రాజా రవివర్మ: కూర్పుల మధ్య తేడాలు

176 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
చి
మూలం చేర్చు
చి (మూలం చేర్చు)
1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు రవివర్మ. దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబై లో ప్రారంభించాడు. అయితే అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. ప్రెస్ పక్కనే తన నివాసాన్ని కూడా ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు.
 
రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించాడు. దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చాడు. అయితే 1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి. <ref>'''రవివర్మ మెచ్చిన పల్లె''', ఈనాడు ఆదివారం అనుబంధం 10 నవంబర్ 2013 పే 18</ref>
 
==రవివర్మ బొమ్మల కొలువు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/947490" నుండి వెలికితీశారు