సంధ్యాసమయం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పగటికి రాత్రి కి సంధి కాలమే సంధ్యా సమయం.సూర్యాస్తమం తర్వాత రమా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వర్గం}}
{{వికీకరణ}}
పగటికి రాత్రి కి సంధి కాలమే సంధ్యా సమయం.సూర్యాస్తమం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య.ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుని ప్రార్ధించాలి.భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు.ఈ సమయంలో పరమ శివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు.కైలాసమందలి ప్రమధ గణములు భూతకోటి శివ నామాన్ని ఉచ్ఛరిస్తూ,శివ తాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు.ముప్పది మూడు కోట్ల దేవతలు,బ్రహ్మ విష్ణువులు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వంతో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు.సమస్తమగు ఋషిదైవ కోటి కైలాసంలో శివ తాండవ వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసుర శక్తులు విజృంభించి జనులను భాదిస్తాయి.అందుకే అసుర సంధ్యలో వేళ కాని వేళ ఆకలి,నిద్ర బద్దకం వంటివి భాదిస్తాయి.ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.అలాగాక పరమేశ్వర ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/సంధ్యాసమయం" నుండి వెలికితీశారు