వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎Call for comments on draft trademark policy: కొత్త విభాగం
పంక్తి 444:
:::రమణగారు, మీరు తెలుగు విక్షనరీ [https://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80] లో కూడా పని చూశారు. ప్రస్తుతం ఆ తెలుగు విక్షనరీలో 1,2,3,4,లు , ఆ,ఆ, ఇ ఏ లు, ఇలా ఏ పేజీలు అయినా కొత్తగా అక్కడ సృష్టించ వచ్చును. కాని పై వాటికి పేజీలు ఉండకూడదని మన తెలుగు అధికారి వ్యక్తిగత అభిప్రాయం. ఏ కారణంగా వద్దని అంటున్నారో పేర్కొనలేదు. చెప్పరు కూడా. వికీపీడియా, విక్షనరీలలో మన తెలుగు అధికారుల పని తీరు వ్యక్తిగత అభిప్రాయాలకు ఇక్కడ చేసే పనిలో ఎక్కువ విలువ ఇస్తుంటే మాత్రం అది అంత సమంజసం కాదు, మంచిది కూడా కాదు. 13:55, 17 నవంబర్ 2013 (UTC)
: తొలిగా, విక్షనరీలో చర్చలు విక్షనరీలోనే చేయవలెనని అభ్యర్ధన, విక్షనరీలో అధికారులెవరూ లేరు. మీరు ఎవరిని ఉద్దేశిస్తున్నారో అర్ధం కాలేదు. వికీపీడియా, విక్షనరీ అనేవి రెండు ప్రత్యేక సముదాయాలు. మీరు కూడా అధికారి అయి ఉండి, మీ అభిప్రాయాన్ని అందరూ పాటిస్తే అప్పుడు సముదాయం మీ వ్యక్తిగతమైనట్టా?? సముదాయపు అభిప్రాయాలు సముదాయంలోని సభ్యులను బట్టి అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. వీలైతే సముదాయపు అభిప్రాయాలని ప్రభావితం చేయటానికి కృషిచేయండి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. అప్పుడప్పుడూ సముదాయపు నిర్ణయాలు మీకు నచ్చకపోయినా సముదాయం ఒక నిర్ణయం చేసినప్పుడు శిరసావహించక తప్పదు. మనం ఇతరుల అభిప్రాయాలను గౌరవించనప్పుడు, ఇతరులు మన అభిప్రాయాలని ఎందుకు గౌరవిస్తారు? ఎందుకు ఫలాన పేజీలను అనుమతించలేదని మర్యాదపూర్వకంగా అడిగి తెలుసుకొండి. వికీప్రాజెక్టులన్నీ సభ్యులకు రెండే రెండు హక్కులను ఇస్తాయి. 1) నిష్క్రమించే హక్కు (Right to leave) 2) ఇక్కడి సమాచారం మొత్తం తీసుకొని వేరే కుంపటి పెట్టుకొనే హక్కు (Right to Fork). --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 05:10, 18 నవంబర్ 2013 (UTC)
::[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]]గారు, విక్షనరీలో చర్చలు విక్షనరీలోనే చేయాలి అని నేను అడిగాను. అక్కడకు అంతగా ఎవరూ రావడము లేదు. అందుకని వికీపీడియాలో చర్చ చేయమని పెద్దలు చెప్పారు. చర్చలు జరిగాయి. ఎక్కడయినా (వికీపీడియా, విక్షనరీ) కొన్ని కొన్ని విషయాలు సముదాయముతో చర్చలు జరపకుండానే నిర్ణయిస్తున్నారు. ఏ సముదాయముతో చర్చ చేశారో సభ్యులకు తెలిస్తే మంచిది. వ్రాత పూర్వక చర్చలు ఉంటే మరీ మంచిది. అభిప్రాయాలను గౌరవించటం అనేది ఇక్కడ అసలు సమస్య కాదు. ఇంతకు ముందు చాలా పేజీలు (మహర్షి పేర్లు, ఇంకా ఇంకా) తొలగించారు. అడిగినా కూడా సరి అయిన సమాధానము తొలగించిన వారు ఇవ్వలేదు. సముదాయము అంటే ఏమిటో మరింత వివరంగా కూడా అందరూ తెలుసుకుంటే అందరకూ మంచిది. ఎందుకు ఫలాన పేజీలను అనుమతించలేదని మర్యాదపూర్వకంగా అడిగినా, ఎందుకు తొలగిస్తున్నారో కూడా తెలియ పరచటము లేదు. నిష్క్రమించే హక్కు, వేరే కుంపటి పెట్టుకొనే హక్కు లాంటివి ఉన్నా, వికీ నియమ నిబంధనలు పాటించి నంతవరకు ఏ సభ్యుడి నయినా వెళ్ళగొట్టే హక్కు ఉందంటారా ? మీరన్నట్లు ఇక్కడి సమాచారము అంతా మనకు కావలసినది తీసుకుని, మనకి నచ్చిన విధముగా తయారు చేసుకోవటము కూడా చాలా బావుంటుంది. ఒకరి తప్పులను తప్పకుండా విమర్శించాలి. సమాధానము రాబట్టి అందరము తెలుసుకోవాలి. మనం ప్రజాస్వామ్యంలా పనిచేయాలి, నిరంకుశంగా కాదని, భజన పరులుగా కాకూడదని నా అభిప్రాయము. ఒకరిలాగా మరొకరు కూడా అలాగే ఉండటము, ఎదుటి వారు కోరుకున్నట్టు మాట్లాడము ఎక్కడా సాధ్యపడదు. మీరు పాత చర్చలు చదివే ఉంటారు. నేను ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు. సహేతుకంగా చర్చలు చేద్దాము. ప్రశ్నించండి. సమాధానము ఇస్తాను. [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 12:51, 18 నవంబర్ 2013 (UTC)
 
== Call for comments on draft trademark policy ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు