"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

:::రవి వైజాసత్య గారి బొమ్మతో సంచిక వెలువడటం హర్షణీయం. ఆయన సేవలకు ఇలాటివి ఎన్నో కావాలి. ఆయన బొమ్మ ప్రచురణకుగాను రవి గారి అనుమతి కొరకు అభ్యర్ధిస్తున్నాను..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 06:24, 16 నవంబర్ 2013 (UTC)
::వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
:::: అర్జునరావు గారు, రాజశేఖర్ గారు, సుజాతగారు, వైజాసత్యగారు, రహ్మనుద్దీన్ (నాని), కాసుబాబు గార్ల పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను. (మరెందరో మహానుభావులను నేనెరుగక ప్రతిపాదించలేకపోయాను. నా అజ్ఞానాన్ని క్షమించగలరు). రాజశేఖర్ గారు చెప్పినట్లు, కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఉంటే బాగుంటుంది. నిర్ణయించే మొత్తంలొ పదవవంతు (అంటే, లక్ష రూపాయలకు గాను, 10,000/-) నేను స్పాన్సర్ చేయదలచాను.
::::: నా ఫోటో ఉంచాలని అభిలషించిన తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అభిమానమే నాకు పది లక్షలు. నేను పూర్వపరంలో చేసిన కృషికి చాలానే గుర్తింపబడ్డాను, నా చిత్రం ఈనాడు పత్రికలో ఐదేళ్ళ క్రితమే వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను మన్నించి ఈ గుర్తింపును ఇప్పటివరకు సరైన విధంగా గుర్తించబడని తెవికీ సభ్యులకు చెందనివ్వండి. తెవికీలో విశేషకృషి చేసి బయటి ప్రపంచంలో గుర్తింపబడిన వాళ్ళు చాలానే ఉన్నారు. వారిపై స్పాట్‌లైటు పెట్టి వాళ్ళ కృషిని అందరికి తెలియజేసి, వారి కృషికి జోహార్లు అర్పించవలసిన సమయమిది. కాబట్టి నేను, అర్జున గారు, రాజశేఖర్ గారు నిర్ణయసంఘంగా అభ్యర్ధనలు పరిశీలించి నిర్ణయించగలము. నిర్ణాయకసంఘపు సభ్యుల ఫోటోలు పరిగణించబడవు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 23:14, 16 నవంబర్ 2013 (UTC)
: వైజాసత్యగారు సున్నితంగా తిరస్కరిస్తున్నారు, నిర్ణాయకసంఘపు సభ్యుల ఫోటోలు వుండరాదు. అయితే, కాసుబాబు, చంద్రకాంతరావు, విశ్వనాథ్ గార్ల పేర్లు ప్రతిపాదనకొరకు పరిశీలించవలసినదిగా మనవి. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 03:47, 19 నవంబర్ 2013 (UTC)
509

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/952230" నుండి వెలికితీశారు