గొట్టపు బావి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Water Bore well.JPG|thumb|Water Bore well]]
[[భూగర్భజలం]] కోసం భూమిలోనికి వేసే బోరును '''బోరుబావి''' అంటారు. సాధారణంగా బోరుబావిని బోరు అని కూడా వ్యవహరిస్తారు. బోరు అనగా చాలా పొడవైన రంధ్రము. నీటి కోసం భూమిలోనికి చాలా పొడవైన రంధ్రం వేయటం ద్వారా ఏర్పరచుకున్న [[బావి]] కనుక ఈ బావిని బోరుబావి అంటారు. బోరుబావులను త్రవ్వేందుకు ఉపయోగించే వాహనాలను బోరుబండ్లు అంటారు. బోరు వేసే ప్రాంతాన్ని బట్టి, వేయవలసిన లోతును బట్టి వివిధ రకాల బోరుబండ్లను ఉపయోగిస్తారు. బోరు బావి గుండ్రంగా, చాలా లోతుగా ఉంటుంది, దీని [[అడ్డుకొలత|వ్యాసం]] సాధారణంగా 5 నుంచి 8 అంగుళాలు ఉంటుంది. వీటి లోతు సాధారణంగా భూగర్భజలం లభించే లోతును బట్టి ఉంటుంది. భూగర్భజలం తక్కువ లోతులో లభించే చోట్ల వీటి లోతు తక్కువగాను, భూగర్భజలం ఎక్కువ లోతులో లభించే చోట్ల వీటి లోతు ఎక్కువగాను ఉంటుంది. వీటి లోతు సాధారణంగా 100 నుంచి 200 అడుగుల లోతు ఉంటాయి, కాని కొన్ని చోట్ల వీటి లోతు 500 అడుగుల కన్నా ఎక్కువ లోతుంటాయి. బోరుబావిలోని [[నీరు|నీటిని]] వాడుకునేందుకు పైకి రంపించడానికి సాధారణంగా కొట్టుడు పంపులు, విద్యుత్ పంపులు ఉపయోగిస్తారు.
|