సైకిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
==చరిత్ర==
[[దస్త్రం:First model of cycle.jpg|200px|right|thumb|1813 లో డ్రే తయారుచేసిన మొరటు సైకిలు నమూనా]]
1813 లో ఒకరోజు మాన్ హీమ్‍హీమ్ అనే [[జర్మనీ]] వీధుల్లో వింత వాహనంపై ఓ యువకుడు వెడుతున్నాడు. ఈ వాహనం లో ఒక కొయ్య చట్రం ఉంది. దీని మధ్యలో కూర్చోవటానికి సీటు ఉంటుంది. ఒకదాని వెనుక మరొకటి ఉండేలా రెండు చక్రాలుంటాయి. యువకుడు సీటు పై కూర్చుని కాళ్ళను నేలపై నెట్టుకుంటూ ముందుకు వెడుతున్నాడు. ముంజేతులను ఇనుప కడ్డీలపై ఉంచాడు. ముందు చక్రానికి సంబంధించిన కొయ్య కడ్డీని చేతులతో తిప్పితే పోదలచుకున్న మార్గంలో అతడు వెళ్ళ గలుగుతున్నాడువెళ్ళగలుగుతున్నాడు. వీధిలో పిల్లలు కేరింతలు పెడుతూ, వాహనం వెంట పరుగెడుతున్నారు. తోటి ప్రజలు పెనుబొబ్బలు పెడుతూ అట్టహాసం చేస్తున్నారు. వీటిని లెక్కపెట్టకుండ 28 ఏళ్ళ ఆ యువకుడు మాత్రం పిచ్చివాడిలా ముందుకు సాగిపోతున్నాడు. అతడు బేడన్ ప్రభుత్వం లోని ఒక పెద్ద అధికారి కొడుకు. తన కొడుకు ఆఫీసర్ కావాలని తండ్రి ఆశించాడు. కానీ ఎక్కువ బాధ్యతలు నెత్తిన వేసుకోవటం ఇష్టంలేక బేరన్‍బేరన్ డ్రే మామూలు గుమస్తాగా చేరాడు. అతనికి కొత్త విషయాలు కనుక్కోవాలనే తపన ఎక్కువగా ఉండేది. చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాల్లో అభిరుచి, ఉత్సుకత ఉన్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు కావటం వల్ల యాంత్రిక శాస్త్రం చదవలేకపోయాడు. ఈ నిరాశ అతనిలో మొండి పట్టుదలను పెంచింది.
 
వీధుల్లో కొత్త వాహనాన్ని ప్రదర్శించటం మూలాన అతని ఉద్యోగం ఊడటమే కాకుండా అతని పట్ల అంతటా ఉపేక్ష, తిరస్కార భావం ఏర్పడ్డాయి. 16 గంటల్లో వెళ్ళే దూరాన్ని కొత్త వాహనం సహాయంతో 4 గంటల్లోనే వెళ్ళగలిగాడు. ఈ నమూనా వాహనాలను తయారుచేయటానికి బెవెడెన్ బేడన్ ప్రభుత్వం నుంచి అనుమతి కూడ పొందాడు. కానీ ఎవరూ ఇతణ్ణి గురించి పట్టించుకోలేదు. సొంత ఊరిలో కూడా ఇంతే. 1851 లో దుర్భర దారిద్ర్యంలో అతడు మరణించే సరికిమరణించేసరికి ఇతడు కనిపెట్టిన వాహనాన్ని రైలు పట్టాలపై వెళ్లి మరమ్మత్తులు చేయటానికి, కార్యకలాపాలు పర్యవేక్షించటానికీ, మాత్రమే ఉపయోగిస్తుండేవారు. అయితే ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పెద్ద అంగలు వేసుకుంటూ ఈ వాహనం చాలా ముందుకు సాగిపోయింది.
 
మనిషి నడిచేటప్పుడు తన బరువును ఒక కాలి నుంచి మరో కాలికి మార్చటంలో ఎక్కువ శక్తిని వినియోగిస్తాడు. ముందుకు వెళ్ళుతున్నపుడు శరీరాన్ని ఒకే స్థితిలో స్థిరంగా ఉంచగల సాధనం నిర్మించటానికి వీలవుతుందా అని అతడు తన్ను తాను ప్రశ్నించుకొన్నాడు. ఇలాంటి వాహనాన్ని తయారు చేయాలన్నతయారుచేయాలన్న ఆలోచనే ఇది వరకుఇదివరకు తట్టినట్టు లేదు. నిటారుగా ఉండటం అసాధ్యమని అందరూ అనుకునేవాళ్ళు. నిటారుగా ఉంచడం అనుకున్న దానికంటె చాలా తేలిక అని అతడు నిరూపించాడు. ఈ కారణం గానే ఈ "వింత వాహనం" ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల దృష్టిని ఆకర్షించింది.
 
హాబీ గుర్రాలు లేదా డాండీ గుర్రాలు అని పిలువబడే వాహనాలు పారిస్ నగర వీధుల్లోనూ, లండన్ హైడ్ పార్క్ లోనూ అసంఖ్యాకంగా తిరగటం మొదలైంది. తీరిక సమయాల్లో యువకులు, స్త్రీలు వీటిని వాడసాగారు. యువరాజు కూడా ప్రత్యేక వాహనాన్ని తయారుచేయించుకొని బహిరంగంగా దానిపై విహరించ సాగాడు. చూస్తుండగానే ఈ వాహనాల తయారీ గొప్ప పరిశ్రమగా రూపొందింది. ఇంగ్లండ్, అమెరికా పట్టణాల్లో ఈ కొత్త ఆట కోసం ప్రత్యేకంగా మందిరాలు నిర్మించారు. ప్రజలకు దీనిపట్ల మోజు విపరీతంగా పెరిగింది. దీన్ని గురించి హాస్య రచయితలు వ్యాసాలు రాశారు. కార్టూనిష్టులు బొమ్మలు గీశారు. అంత జరిగినా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే కొత్త రవాణా సాధనంగా దీన్ని మలిచే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
"https://te.wikipedia.org/wiki/సైకిల్" నుండి వెలికితీశారు