యునానీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: యునానీ అన్న మాట "అయోనియా" అన్న గ్రీకు మాట లోంచి వచ్చింది. అయోనియ...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యునానీ అన్న మాట "అయోనియా" అన్న గ్రీకు మాట లోంచి వచ్చింది. అయోనియా గ్రీకు దేశానికి మరొక పేరు. యునానీ వైద్తయంవైద్యం గ్రీకు దేశంలో రెండవ శతాబ్దంలో పుట్టింది. కాని దీని ప్రచారంలోకి తీసుకు వచ్చినది తొమ్మిదవ శతాబ్దపు పారశీక వైద్యుడు హకీమ్ బిన్ సేనా. హకీం అంటేనే వైద్యుడు. ప్రస్తుతం ఇది గ్రీకు దేశం లోనూ కాదు, పారశీక దేశం లోనూ కాదు కానీ భారత దేశం లో బహుళ ప్రచారంలో ఉంది.
 
 
ఈ వైద్యం హిపోక్రటీస్ ప్రవచించిన సూత్రాలపై ఆధారపడ్డ వైద్య శాస్త్రం.ఈ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నాలుగు రసాలు (humors) ఉంటాయి: కఫం (phlegm), రక్తం (blood), పచ్చ పిత్తం(yellow bile), నల్ల పిత్తం (black bile). ఆ రోజుల్లో ఈ ప్రపంచం అంతా నాలుగు మూలకాలతో (భూమి, అగ్ని, జలం, వాయువుగాలి)చెయ్యబడ్డాదన్న నమ్మకం కూడా ఉండేది. కనుక పైన చెప్పిన నాలుగు రసాలకీ, నాలుగు మూలకాలకీ చాల దగ్గర లంకె ఉంది. ఈ దృష్టితో చూస్తే యునానీకీ ఆయుర్వేదానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఆయుర్వేదానికీ హిందూ మతానికీ ఉన్న సంబంధం లాంటిదే యునానీకీ ఇస్లాంకీ ఉంది.
 
యునానీ మందులని తేనెతో రంగరించి పుచ్చుకుంటారు. భస్మం చేసిన ముత్యాలు, బంగారం కూడ యునానీ వైద్యంలో తరచు కనిపిస్తూ ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/యునానీ" నుండి వెలికితీశారు