పంపు: కూర్పుల మధ్య తేడాలు

ట్రెడల్ పంపు
తాడు పంపు
పంక్తి 35:
ప్రధాన వ్యాసం [[ట్రెడల్ పంపు]]<br />
'''ట్రెడల్ పంపు''' అనగా మానవ శక్తితో నడిచే చూషణ పంపు, ఇది బావి యొక్క పైభాగాన ఉంటుంది. ట్రెడల్ అనగా కాలితో తొక్కుటవల్ల పని చేయు యంత్ర భాగం. ట్రెడల్‌ను కాలుతో తొక్కుతూ ఈ పంపును పనిచేయిస్తారు. ట్రెడల్ పంపు నీటి పారుదల కొరకు ఉపయోగిస్తారు. దీనిని ఏడు మీటర్లు లేదా అంతకు తక్కువ లోతు నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. ట్రెడల్ ను పైకి క్రిందికి తొక్కడం ద్వారా ఈ పంపు పని చేస్తుంది, తద్వారా దీనిలోని మీటలు, డ్రైవ్ పిస్టన్లు భూగర్భజలంను చూషణ పద్ధతిలో ఉపరితలానికి లాగుతాయి.
===తాడు పంపు===
 
ప్రధాన వ్యాసం [[తాడు పంపు]]<br />
 
[[File:Rope Pump.svg|thumb|సాధారణ తాడు పంపు నమూనా]]
 
'''తాడు పంపు''' అనగా పంపు యొక్క ఒక రకం. దీనికి వదులుగా వేలాడుతూ ఉండే ఒక [[తాడు]] ఉంటుంది, అందుకే దీనిని తాడు పంపు అంటారు. దీనికి ఉపయోగించిన తాడు బావి పై భాగానుంచి బావి లోపల ఉన్న నీటిలోకి, అక్కడ నుంచి బావి నీటిలోకి మునిగి ఉండి బావి పైభాగం వరకు ఉన్న పైపు లోపలి గుండా పైకి వచ్చి మొదలు, చివరలు లేకుండా ఒక తాడు గానే కలిసి ఉంటుంది. దీనికి అమర్చే [[బావిగిలక|గిలక]] చక్రం తాడును సులభంగా సౌకర్యంగా తిప్పేందుకు పైపు వ్యాసానికి మధ్యగా ఉండేలా, మరొక వైపు ఏవి తగలకుండా సాఫీగా లోపలి వెళ్లేలా అమర్చుకోవాలి. తాడు పంపులు తరచుగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు, వీటి రూపకల్పనలో సాధారణంగా PVC పైపులను మరియు అదృఢ లేదా దృఢమైన కవాటాలు కలిగిన ఒక తాడులను ఉపయోగిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు