నీలిమందు: కూర్పుల మధ్య తేడాలు

references added
పంక్తి 5:
 
 
అసలు నీలిమందు కొన్ని రకాల మొక్కల నుండి వస్తుంది. ఈ మొక్కలన్నిటిలోకీ శ్రేష్థమైనది భారత దేశంలో పెరిగే నీలి మొక్క. నీలి రంగు ఆకులతోటీ, చిన్న చిన్న పసుపు పచ్చని పువ్వులతోటీ, రెండేళ్ళకొక సారి పెరిగే ఈ మొక్క ఆవ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం ఇండిగోఫెరా టింక్టోరా (Indigofera tintoratinctora). ఈ మొక్కలని కోసి, కట్టలుగా కట్టి, ఇటికలతో కట్టిన కుండీలలో వేసి, నీళ్ళతో తడిపి ఒక రోజుపాటు నానబెడతారు. ఎండుగడ్డి రంగులో ఉన్న తేటని మరొక కుండీలోకి వెళ్ళేలా వారుస్తారు. ఈ తేటని రెండు మూడు రోజులపాటు చిలకాలి. ఇది శ్రమతో కూడిన పని. ఇద్దరు, ముగ్గురు మనుష్యులు ఈ కుండీలలోకి దిగి, తెడ్లతో ఈ తేటని బాదుతారు. అప్పుడు ఎండుగడ్డి రంగులోంచి ఆకుపచ్చ రంగులోకి మారి, క్రమంగా నీలిరంగులోకి వస్తుంది. అప్పుడు నీలిమందు చిన్న చిన్న రేకుల మాదిరి విడిపోయి అడుక్కి దిగిపోతుంది. పైన ఉన్న నీటిని తోడేసి, నీలి ముద్దలో ఉన్న మలినాలని వెలికి తియ్యటానికి ఆ ముద్దని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి, వడబోసి, ఎండబెడితే నీలం రంగు గుండ మాదిరి వస్తుంది.
 
 
పంక్తి 12:
 
ఇంతకీ పెర్కిన్ కనిబెట్టిన పద్ధతిని టూకీగా చెబుతాను. ఏ కళాశాలలోనైనా ఉన్న రసాయన ప్రయోగశాలలో నిమిషాల మీద నీలిమందు తయారు చెయ్యొచ్చు. ఆరంగుళాలు పొడుగున్న గాజు ప్రయోగ నాళికలో అర (0.5) గ్రాము ఆర్ధో నైట్రోబెంజాల్డిహైడ్ (ortho-Nitrobenzaldihyde) ని 5 మిల్లిలీటర్ల ఎసిటోన్ (acetone) లో కరిగించాలి. అప్పుడు 5 మిల్లిలీటర్ల నీళ్ళు కలపాలి. అప్పుడు 2.5 మిల్లిలీటర్ల మోలార్ సోడియం హైడ్రాక్సైడ్ (molar sodium hydroxide) ఒకొక్క చుక్క చొప్పున నెమ్మదిగా కలపాలి. ఈ క్షారం (alkali) కలపటం మొదలవగానే నాళికలో ద్రవం నీలంగా మారుతుంది. నాళిక వేడెక్కటం మొదలవుతుంది. లోపల ఉన్న ద్రవం సలసల మరిగినా మరుగుతుంది. ఈ తాపచూషక (exothermic) ప్రక్రియని 5 నిమిషాలపాటు అలా జరగనిచ్చి అడుక్కి దిగిన నీలం మడ్డి (precipitate)ని వేరు చెయ్యాలి. అదే నీలి మందు! కూలివాళ్ళు, రోజుల తరబడి ఎండలో ఆ కుళ్ళబెట్టిన మొక్కలని కాళ్ళతో తొక్కి, నానా తంటాలు పడి తయారు చెయ్యటం కంటె నిమిషాల మీద ఈ కార్యక్రమం జరిగిపోతూ ఉంటే ఇండియాలో ఈ పరిశ్రమ ఒక్క రోజులో కుదేలయిపోయింది.
 
==వనరులు==
* D. Balasubramanian , Indigo Nation: Champaran to Chandigarh, The Hindu (http://www.hinduonnet.com/seta/2002/04/25/stories/2002042500180300.htm)
* Lotika Varadarajan, "Indian Leven in Een Kleur" (CIP -GKB; The Hague, Holland, 1985, pp. 65-72)
* Kausalya Santhanam, The Hindu Sunday Magazine, Folio, June 20, 1999
* Indigofera tinctoria, Guide des Teintures Naturelles Dominique Cardon et Gaëtan du Chatenet,
Delachaux et Niestlé 1990 ISBN 2 603 00732 7
"https://te.wikipedia.org/wiki/నీలిమందు" నుండి వెలికితీశారు