భీష్మ పర్వము తృతీయాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
తొమ్మిదవ రోజు యుద్ధానికి కౌరవ సేన సర్వతోభద్ర వ్యూహమున నిలిచారు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కురుకుమారులు, భీష్మునితో వ్యూహం ముందు భాగంలో ఉన్నారు. ద్రోణుడు, భూరిశ్రవసుడు, భగదత్తుడు అతడి కుడి వైపున సోమదత్తుడు, అశ్వత్థామ, విందాను విందులు ఎడమ వైపున శ్రుతాయువు వెనుక వైపున త్రిగర్తాధీసునితో సుయోధనుడు మధ్యభాగమున నిలిచారు. ఈ వ్యూహము చూసి ధర్మరాజు " ధృష్టద్యుమ్నా ! తాత భీష్ములు పన్నిన వ్యూహమును చూసావు కదా మనం ఈ రోజు శిఖండిని ముందుంచి అతనికి సాయంగా మనం నిలిచి పోరాడవలెను. అందుకు అనువైన వ్యూహ రచన చేయుము " అన్నాడు. సాత్యకి, విరాటుడు కుడి వైపున , అభిమన్యుడు, పాంచాల కేకయ రాజులు ఎడమ వైపున కుంతి భోజుడు వెనుక వైపున, యుధిష్టరుడు, నకులసహదేవ , ద్రౌపదీ పుత్రులతో మధ్యభాగమున నిలిచారు. శిఖండిని ముందు నిలిపి అతడికి ఒక వైపున ఘటోత్కచుడు, భీమసేనుడు నిలువగా అర్జునుడు వేరొక వైపు నిలువగా సకల యోదులు వారికి రక్షణగా నిలువగా ధృష్టధ్యుమ్నుడు యుద్ధానికి సిద్ధం అయ్యాడు. భేరి నినాదములు, శంఖముల పూరింపుల శభ్దాలు మిన్నంటుతుండగా యుద్ధం మొదలైంది.
==== అభిమన్యుని పరాక్రమం ====
[[File:Mahabharata00ramauoftAbhimanyu 0117showing 44his talent in Battle.jpg|thumb|ఎడమ|300px|అభిమన్యుని యుధ్ధకౌశలము]]
అభిమన్యుడు కౌరవ వ్యూహంలోకి చొచ్చుకొని పోయి దూదిని నిప్పంటుకున్నాట్లు కౌరవ వీరులను మట్టు పెడ్తుతున్నాడు. తన రధమును గుండ్రంగా తిప్పుతూ ద్రోణా, కృపాచార్య, సైంధవులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇది చూసి సుయోధనుడు అలంసుని పిలిచి " అలంబసా ! చూసావా అభిమన్యుడు చిచ్చెర పిడుగులా విజృంభిస్తున్నాడు. వాడిని ఎదుర్కొనగలిగిన వాడివి నీవే నీవే వాడిని చంపాలి " అన్నాడు. అలంబసుడు తన రాక్షస మూకతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారి ధాటికి పెను గాలికి ఎండుటాకుల వలె పాండవ సైన్యం కకావికలైంది. ఇది చూసి ద్రౌపదీ సుతులు అభిమన్యునికి సాయంగా వచ్చి రాక్షసులను హతమారుస్తున్నారు. కోపించిన అలంబసుడు పాండవ కుమారులపై శరవర్షం కురిపించారు. ద్రౌపదీ సుతులు అలంబసునిపై జడివానలా బాణములు కురిపించారు. ఆ బాణముల ధాటికి అలంబసుడు తెలివి తప్పి మరు క్షణంలో తేరుకుని ద్రౌపతీ సుతులపై పుంకానుపుంఖాలుగా బాణములు గుప్పించి వారి విల్లులు, కేతనములు విరిచి ఒక్కొక్కరిపై అయిదు బాణములు వేసాడు. సోదరుల అవస్థ అలంబసుని విజృంభణ చూసిన అభిమన్యుడు అలంబసునిపై అతి క్రూరమైన నారాచ బాణములు ప్రయోగించాడు. మిగిలిన వారు అలంబసుడు మాయావిధ్యా ప్రవీణుడు అభిమన్యుడు దివ్యాస్త్ర సంభూతుడు వీరిరువురి యుద్ధం ఎంత రసవంతరమో అని చూస్తున్నారు. అభిమన్య అలంబచులు దేవేంద్ర వృత్తాసురుల వలె యుద్ధం చేస్తున్నారు. అలంబసుడు తన మాయాశక్తితో రణభూమిని అంధకార బంధురం చేసాడు. అభిమన్యుడు భాస్కరాస్త్ర ప్రయోగంతో ఆ చీకట్లను పటాపంచలు చేసాడు. అలంబసుడు అనేక మాయలు చేయగా అభిమన్యుడు వాటిని అన్నిటినీ తిప్పి కొట్టాడు. అభిమన్యుని శస్త్రధాటికి తాళలేక అలంబసుడు రధం దిగి పారిపోయాడు. అలంసుడు పారి పోగానే అభిమన్యుడు విజృంభిస్తూ కౌరవ సేనలో చొచ్చుకు పోయి ఊచ కోత కోయడం మొదలుపెట్టాడు. కౌరవ సేనలు అభిమన్యుని ధాటికి గజగజలాడాయి. అది చూసి భీష్ముడు అనేక మంది రధికులతో అక్కడికి చేరి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు జంకక అనేక రూపములతో వీరవిహారం చేస్తున్నాడు. అది గమనించిన అర్జునుడు కుమారుని పరాక్రమానికి సంతసింస్తూ భీష్ముని ఎదుర్కొన్నాడు.