"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

ఈకొవ్వు ఆమ్లం ఆవాలనూనెలో వున్నప్పటికి,కొద్దినూనెలలో మాత్రమే అధిక ప్రమాణములో కన్పించును.అవిసెనూనె(linseed)లో 45-50%,పెరిల్ల నూనె(perilla))లో65%వరకు వుండును.జంతు కొవ్వునిల్వలలో(animal fat depot)1.0% వరకు వుండును.అయితే గుర్రం కొవ్వులో 15% వరకు ఈకొవ్వు ఆమ్లం కలదు.చియా(chia)లో 65%,కివి ఫ్రూట్‌సీడ్‌(kiwi fruit seed)నూనెలో 62%,రేప్‌సీడ్‌(rape seed)లో10%,సోయాలో 8%వరకు ఈకొవ్వు ఆమ్లం వున్నది.లినోలినిక్‌ ఆమ్లంను 3-ఒమేగా కొవ్వు ఆమ్లం అంటారు.ఈకొవ్వు ఆమ్లం మానవ ఆహరములో తప్పని సరిగా వుండవలసిన'ఆవశ్యక(essential)కొవ్వు ఆమ్లం.మానవ దేహ జీర్ణవ్యవస్తకు బహుబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను,ముఖ్యంగా ఒమేగా3-కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేసుకునే సమర్దత లేదు.
 
====α-ఎలియోఈలయ స్టియరిక్‌ ఆమ్లం(α-eleastearic acid)====
 
ఈకొవ్వు ఆమ్లం18 కార్బనులను కలిగివుండి,లినొలెనిక్‌ ఆమ్లంవలె 3 ద్విబంధాలను కలిగివున్నది.అయితే ఈద్విబంధాలు 9,11,13 కార్బనుల వద్ద కంజుగెటెడ్‍గా కలిగి వున్నది.దీని శాస్త్రీయనామము 9,11,13-అక్టాడెక ట్రైనొయిక్‌ఆసిడ్(9,11,13-octa decatrienoic acid)ఇది లినొలెనిక్‌ ఆమ్లం యొక్క కంజుగెటెడ్‌బంధాలున్న ఐసోమర్‌ కొవ్వుఆమ్లం.సాధారణంగా బహుద్విబంధాలున్నకొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలమధ్య 3 కార్బనులు వుండును.అలా కాకుండగా 3 కార్బనులకన్న తక్కువగా వున్నచో వాటిని కంజుగెటెడ్‌ఆసిడ్లు అందురు.ఈకొవ్వు ఆమ్లం టంగ్(tung)<ref>http://www.merriam-webster.com/dictionary/eleostearic%20acid</ref> లేదా ఛైనావుడ్‌ఆయిల్‌లో 85% వరకు వున్నది.యుపొర్బెసియె,కుకుర్బిటెసియే కుటుంబ మొక్కల నూనెలో ఈకొవ్వు ఆమ్లంయొక్క వునికిని గుర్తించారు.కంజుగెటెడ్‌బంధాలు కలిగివున్న కారణం వలన ఈకొవ్వు ఆమ్లం త్వరగా పాలిమరైజెసన్(polymerization)చెందును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/964839" నుండి వెలికితీశారు