ఉదయమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు [[అమ్మను జూడాలె ]], [[ ఆఖరి కుందేలు]] పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. [[పాట సంద్రమై...]] పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు [[ఉదయ్]], [[ఉజ్జ్వల్]] లతో కలిసి, [[ దేవులాట]] పేరుతో కవితా సంకలనాన్ని; [[పరిమళ్]], [[ఇక్బాల్ పాష]]లతో కలిసి [[ఓడిపోలే...పల్లె]] పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో [[దుఃఖాగ్నుల తెలంగాణ]] ను వెలువరించారు. వీరు తమ కవితలకు రెండు సార్లు కుందుర్తి - రంజని అవార్డులు అందుకున్నారు. వీరి కవితలను కొన్నిటిని కొడవటిగంటి శాంతాసుందరి హిందీలోకి అనువదించింది.
 
{{పాలమూరు జిల్లా కవులు}}
[[ వర్గం: మహబూబ్ నగర్ జిల్లా కవులు ]]
"https://te.wikipedia.org/wiki/ఉదయమిత్ర" నుండి వెలికితీశారు