అల్ ఘజాలి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q9546 (translate me)
{{సూఫీ తత్వము}}
పంక్తి 22:
'''అబూ హామిద్ మొహమ్మద్ ఇబ్న్ మొహమ్మద్ అల్-ఘజాలీ''' '''Abu Hāmed Mohammad ibn Mohammad al-Ghazzālī ''' ([[1058]]-[[1111]]) ([[పర్షియన్]] : '''ابو حامد محمد ابن محمد الغزالی''' ), [[టర్కీ భాష|టర్కిష్]] : İmâm-ı Muhammed Gazâlî, '''అల్-గాజెల్''' గా కూడా ప్రసిద్ధి. పర్షియా లోని [[ఖోరాసాన్]] లో జన్మించాడు. ముస్లిం పండితుడు, ధార్మిక తత్వవేత్త. <ref> [http://www.bartleby.com/65/gh/Ghazali.html Ghazali], The Columbia Encyclopedia, Sixth Edition 2006</ref>
== కార్యాలు ==
{{సూఫీ తత్వము}}
[[దస్త్రం:Alchemy of Happiness.png|thumbnail|200px|1308 పర్షియన్ ముద్రణ, 'సంతోష రాసాయనం".]]
== అల్-ఘజాలి ప్రకారం ప్రభుత్వాధినేతకు కావలసిన లక్షణాలు ==
 
[[అల్-ఘజాలి]] "నసీహత్ అల్-ములూక్" లేదా "రాజులకు హితబోధలు" సెల్జూఘ్ ఖలీఫా కొరకు వ్రాశాడు. ఇతని ప్రకారం ''దశ హితబోధలు'' రాజుకు తనరాజ్యపరిపాలన కొరకు కనీసం వుండవలసిన సూత్రాలని సూచించాడు.
# తన భుజస్కంధాలపై ఉంచబడిన బాధ్యతల ప్రాముఖ్యాన్ని, అపాయాన్ని, రాజు గ్రహించవలెను. అధికారం ఒక వరం, ఈ అధికారాన్ని ధర్మబధ్ధంగా చెలాయిస్తే ఇటు రాజుకూ అటు ప్రజకూ అనంత సుఖఃసంతోషాలు కలుగును, లేనిచో ఇటు రాజూ అటు ప్రజలూ దుఖః పాతానికి లోనౌతారు.
# రాజు ఎల్లప్పుడూ ధార్మిక పండితులకు సంప్రదించడానికి తహతహలాడాలి, వీరి సలహాలు తీసుకొని రాజ్యాన్ని సుబిక్షంగా పాలించాలి.
# పరస్త్రీవ్యామోహాన్ని తానూ త్యజించాలి తన అధికారవర్గం త్యజించాలి. అన్యాయాన్ని తానూ తన అధికారగణం సహించకూడదు. రాజు తన స్వంత జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అలాగే తన అధికారగణ జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అన్యాయాలుంటే శిక్షించాలి.
# రాజు నిగర్విగాను, కోపతాపాలకు దూరంగానూ, పగ ద్వేషాలకు అతీతంగానూ ఉండాలి. కోపము జ్ఞానుల శత్రువుగా గుర్తించాలి. తనపాలనలో శాంతి, క్షమా, దయా కారుణ్యాలపట్ల తనూ తలొగ్గాలి ఇతరులనూ తలొగ్గేలా చేయాలి. క్షమాగుణాలను అలవర్చుకొనేలాచేయాలి.
# ప్రతివిషయ సన్నివేశంలో రాజు తనకు తాను ప్రజగా భావించి ప్రజలకు అధికారులుగా భావించి కార్యక్రమాలు చేయాలి. తనకొరకు ఏమికోరుకుంటాడో ఇతరులకూ అవే అందజేయాలి. ఇలా చేస్తేనే తన అధికారాలను సద్వినియోగం చేస్తున్నట్లు.
# రాజు న్యాయస్థానంలో ఫిర్యాదు దారుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించవలెను. ఫిర్యాది యొక్క సాధక బాధకాలను తెలుసుకోవడం రాజు యొక్క విద్యుక్తధర్మం. అన్యాయానికి తావు లేకుండా చూడవలసిన బాధ్యతకూడా రాజుదే.
# రాజు అలంకారాలకు మోజులకు వ్యామోహాలకు బానిస కారాదు. అసలు వీటి జోలికే పోరాదు. హుందాగావుంటూ రాజ్యానికి మకుటంలా ఉండాలి గాని, అహంకారానికి పోయి రాజ్యానికి చీడ తేకూడదు.
# రాజు మృదువుగా మెలగడం అలవర్చుకోవాలి, క్రూరంగాను, అసభ్యంగాను, హింసించువాడు గాను ఉండకూడదు.
# రాజును ప్రజలందరూ మెచ్చుకొనేలా రాజు మసలుకోవాలి. ప్రజలను గదమాయించి తనను పొగిడేలా చేసుకొనే రాజు అత్యల్పుడు. ప్రజలలో తనపట్లగల భావాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తన తప్పులున్నయెడల వాటిని తెలుసుకొని దిద్దుకుంటూ ప్రజలనోటిలో నాలుకలా మెలగాలి.
# అల్లాహ్ ను సంతుష్టుడిని చేసేందుకు ప్రతికార్యం సలపాలి. ఓ ప్రజ దగ్గర మెప్పు కోసం అల్లాహ్ ను వ్యతిరేకిగా చేసుకోరాదు. ఒకరిని అసంతుష్టుడిని చేసి అల్లాహ్ ను సంతుష్టుడిని చేయడం ఉత్తమం. ఒకరిని సంతుష్టుడిని చేసి అల్లాహ్ ను అసంతుష్టుడు చేయడం జరగరాదు.
 
 
Line 56 ⟶ 70:
 
[[వర్గం:ముస్లిం పండితులు]]
[[వర్గం:సూఫీలు]]
"https://te.wikipedia.org/wiki/అల్_ఘజాలి" నుండి వెలికితీశారు