2,16,436
edits
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
;ఆకులు: పెద్దవి. గుండ్రము, తొడిమలు మిక్కిలి పొడుగుగాను గుండ్రముగాను నున్నగాను నుండును. ఇవి కడ్డివలె గట్టిగాలేవు. వీని పొడుగునను సొరంగములలో గాలి యుండును. కావున ఆకులు నీటి మీద తేలును. కాడలు వంగ గల్గుట చేతను సాగ గల్గుట చేతను నీరు తగ్గినను హెచ్చిననను ఆకులు నీటి మీదనే తేలు చుండును. కాడ పత్రముతో గలియు చోట నెత్తుగా కణుపు వలె నున్నది. పత్రము రెండు వైపుల సన్నగా నుండును.
72
;పుష్పమంజరి: నీటి లోపల నుండి దీర్ఘమౌ కాడపైకి వచ్చును. కాడ చివర నొక్కటే పుష్పము గలదు. పుష్పము వికసింపక మొగ్గగా నున్నప్పుడు నీళ్ళలోనే యుండును.
;పుష్పకోశము: రక్షక పత్రములు 4. నిడివి చౌకపు నాకారము. అడుగు ఆకు పచ్చగాను పైన తెల్లగా నుండును. నీచము.
;దళవలయము: ఆకర్షణ పత్రములు అసంఖ్యములు వృంతాశ్రితము తెల్లగా నుండును.
;కింజల్కములు: అసంఖ్యములు వెలుపల నున్నవి. వెడల్పుగాను ఆకర్షణ పత్రముల వలెను మాఱియు నుండును. వృతాశ్రితము.
;అండకోశము: పుష్ప పళ్ళెరములో దిగియున్నది. ఉచ్చము. చాల గదులు గలవు. ఒక గదు లో చాల గింజలు గలవు. కుడ్య సంహోగము గింజలకు బీజ పుచ్ఛము గలదు. కాయ కండకాయ.
కలువయు దామర యు నొక కుటుంబము లోనివే. ఈ కుటుంబపు మొక్కలన్నియు నీళ్ళలోనె పెరుగును. ఆకుల యొక్కయు పుష్పముల యొక్కయు గాడలు మిక్కిలి పొడుగుగా నుండును. వీని యందు గాలి యుండుటకు సొరంగములు కలవు. వీనిలో పుష్స్పములు పూచెడు కాడకు నొక్కటే పుష్పముండును. ఇందు నాకర్షణ పత్రమును కింజల్కములును బెక్కులు గలవు. అండాశయములు కూడ చాల యున్నవి. వీని గదులలో సన్నిగోడల నుండియు గింజలు పుట్టు చున్నవి.
|
edits