ఆవిరి యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆవిరి యంత్రం''' అనగా ఒక యంత్రం, ఇది వేడి నీటి నుండి వెలువడే [[ఆవిరి]]ని ఉపయోగించుకొని పనిచేస్తుంది. వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని శక్తిగా మార్చి యంత్రాన్ని కదిలించగలిగేలా చేసి ఫ్యాక్టరీ పనులకు లేదా రైలు లేదా పడవలను కదలించేందుకు ఉపయోగిస్తున్నారు. 18 వ శతాబ్దపు తొలి నాళ్ళలో ఆవిరి యంత్రాలను మైన్ పంపులలో ఉపయోగించడం ప్రారంభమైంది మరియు 1770 లో జేమ్స్ వాట్ ద్వారా బాగా అభివృద్ధి చెందాయి. యంత్రాలు పని చేయడానికి గుర్రాలు, గాలిమరలు మరియు వాటర్‌మిల్లుల స్థానములలో ఆవిరి యంత్రాలను ఉంచారు, ఇవి ప్రవేశపెట్టిన ఈ సమయం పారిశ్రామిక విప్లవానికి చాలా ముఖ్యమైనది. మొదటి ఆవిరి యంత్రాలు పిస్టన్ యంత్రాలు. ఆవిరి పీడనం ఒక పిస్టన్ మీద ఒత్తిడి కలుగజేసినపుడు పిస్టన్ తో పాటు ఉన్న సిలిండర్ కదులుతుంది మరియు ఈవిధంగా ఇది రెసిప్రోకల్ (ముందుకు మరియు వెనుకకు) కదలికలను కలిగి ఉంటుంది. ఈ కదలిక పంపును నేరుగా కదిలిస్తుంది లేదా క్రాంక్ (వృత్తాకార చలనము కలిగించు వంగిన ఇరుసు) ని పనిచేయించటం ద్వారా అది చక్రాన్ని తిప్పుతుంది మరియు యంత్రాన్ని పనిచేయిస్తుంది. ఆవిరి యంత్రాలు, యంత్రాలను పని చేయించేందుకు మరియు గనులలోని పంపులు కదలించడానికి కర్మాగారాల్లో ఉపయోగించారు. తరువాత రైల్వే వాహనాలు మరియు ఆవిరి పడవలు (స్టీమ్ బోట్లు) తరలించడానికి చిన్న ఇంజిన్లు తయారు చేయబడ్డాయి. ఆవిరి యంత్రానికి శక్తినిచ్చే నీటి ఆవిరి ఒక బాయిలర్ లో తయారు చేయబడుతుంది, బాయిలర్ లో ఉన్న నీటిని వేడి చేయడం ద్వారా ఆ ఆవిరి తయారవుతుంది. చాలా చోట్ల అగ్నితో బాయిలర్ వేడిచేస్తారు. అగ్ని కోసం ఇంధనాలుగా కలప, బొగ్గు, లేదా పెట్రోలియం ఉపయోగించవచ్చు. అగ్నికి బదులుగా అణు శక్తి లేదా సౌర శక్తిని ఉపయోగించవచ్చు. బాయిలర్ నుంచి నీటి ఆవిరి బయటికి వచ్చేటప్పుడు ఒక పిస్టన్ పై బలాన్ని ప్రయోగిస్తుంది. తద్వారా ఆ పిస్టన్ ఒకవైపుకు కదులుతుంది. బయటికి వెళ్లుతున్న నీటి ఆవిరిని ఒక కవాటము పిస్టన్ యొక్క చివరికి వెళ్లేలా చేస్తుంది, ఆ ఆవిరి మళ్ళీ పిస్టన్ వెనుకకు మళ్లేలా బలాన్ని ప్రయోగిస్తుంది, దీనితో పిస్టన్ మరియు నీటి ఆవిరి యధాస్థానానికి వస్తాయి, ఈ విధంగా నీటి ఆవిరిని కవాటముల అదుపుతో పదేపదే పిస్టన్ ముందుకు వెనుకకు కదిలేలా ఈ ఆవిరి యంత్రాలను రూపొందిస్తారు.
 
[[వర్గం:ఆవిరి యంత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆవిరి_యంత్రం" నుండి వెలికితీశారు