పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
* గొల్లపూడి ప్రెస్ [[రాజమండ్రి]]
* [[గాజుల సత్యనారాయణ]] రచన
* [[సురభి పెద్ద బాలశిక్ష]]
* విజేత కాంపిటీషన్ పెద్ద బాలశిక్ష
 
==ఆవశ్యకత==
తెలుగు వారు చదవాల్సిన పుస్తకాల్లో పెద్దబాల శిక్ష అతి ముఖ్యమైనది, ప్రతి తెలుగువారి ఇంట్లో ఉండవలసిన పుస్తకం పెద్దబాల శిక్ష. ఈ పుస్తకం బ్రిటీషువారు భారతదేశాన్ని పాలించే కాలంలో గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యపుస్తకంగా ఉండేది. పూర్వం పెళ్ళిసంబంధాలు మాట్లాడేటప్పుడు "మీ అబ్బాయి ఏం చదివాడు?" లేదా "మీ అమ్మాయి ఏం చదివింది?" అని అడిగితే "మావాడు పెద్దబాల శిక్ష పూర్తి చేశాడు", "మా ఆమ్మాయికి పెద్దబాల శిక్ష కంఠోపాఠం వచ్చు" అని గొప్పగా చెప్పేవారు. పెద్దబాలశిక్ష గ్రంధాన్ని పూర్తిగా చదివితే ప్రపంచంలోని అన్ని విషయాల గురించి తెలుసుకున్నట్లు భావించేవారు. తెలుగు సంస్కృతి , తెలుగు కధలు, విజ్ఞాన శాస్త్రం, క్రీడలు, సాహిత్యం వగైరా విషయాలు గల పెద్దబాల శిక్ష ను తెలుగు ఎన్ సైక్లోపెడియాగా పేర్కొనవచ్చు. 1960, 1970 శకాల్లో ఆంగ్ల విద్య ప్రవేశం వలన ఈ పుస్తకం ఆదరణ కోల్పోయినా ఇటీవల మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగువారు అత్యంతగా ఆదరించే పుస్తకంగా పేరొందింది.
"https://te.wikipedia.org/wiki/పెద్ద_బాలశిక్ష" నుండి వెలికితీశారు