సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూ...
 
పంక్తి 1:
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి.నెల్లూరు జిల్లా [[అల్లీపురం]] స్వగ్రామం.అమ్మమ్మ వాళ్ల ఊరు [[కోట]] .ఇద్దరు అక్కలు,తమ్ముడు.చదువంతా నెల్లూరులోనే సాగింది. నెల్లూరు కె.ఎ.సి జూనియర్ కళాశాలలో ఇంటర్ ,ఆర్.ఎస్.ఆర్ కాలేజీలో డిగ్రీ చదువు మధ్యలోనే ఆగిపోయింది.సింగిల్ విండో అధ్యక్షుడిగా,జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశారు.
==భావాలు,అనుభవాలు==
*మా ఊరు ఎంత అందమైనదో, ఊరివాళ్లు చూపించే ఆత్మీయత అంతకన్నా గొప్పది. నేనింతవాణ్నయ్యానంటే అది మా ఊరి చలవే. అందుకే నేను మా ఊళ్లో తప్ప మరెక్కడా ఇల్లు కట్టుకోలేదు.జాఫర్ సాహె బ్సాహెబ్ కాలవ మీద వంతెన నిర్మించేలా చేశా.మా కుటుంబం తరపున నవలాకులతోటలో[[నవలాకులతోట]] లో పాఠశాలకు స్థలాన్ని ఇచ్చాం. అల్లీపురంలో పాఠశాలకురెండున్నర ఎకరాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి అర ఎకరా భూమిని నా సొంత డబ్బుతో కొనుగోలు చేసి వాటి ఏర్పాటుకు సహకరించాను.ఓవర్ హెడ్ ట్యాంకు, పశువుల ఆసుపత్రి నిర్మించేలా చేశాను.ఉద్యానవనం నిర్మించా. గ్రామంలో రోడ్లు, మురుగునీటి పారుదల కాలువలు, విద్యుత్తు దీపాలు వంటి కనీస వసతులన్నీ కల్పించా. మా ఊరికి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇంకాఇంకా ఏదోఏదో చెయ్యాలనే అనిపిస్తుంది. నేనీ ఊళ్లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఊపిరి ఉన్నంత వరకూ ఊళ్లోనే ఉంటాను. రాకపోకలకు, నివాసానికి సదుపాయమని ఎంతమంది చెప్పినా నెల్లూరులోనూ, హైదరాబాద్‌లోనూ నేను ఇళ్లు కట్టుకోలేదు. వేరే ఎక్కడా నివసించడం నాకిష్టం ఉండదు.ఎక్కడకెళ్లినా మా ఊరే గుర్తొస్త్తుంది.
*తాగుడు అలవాటు వల్ల కుటుంబాలు ఆర్థికంగా నాశనమైపోవడం, కల్తీ సారా వ ల్ల మరణాలు సంభవించడం ఇవన్నీ మా ఊళ్లో నేను చిన్నతనంలోనే చూశాను. దాన్ని తల్చుకుంటేనే బాధగా ఉంటుంది. మానెయ్యమని ఎంత చెప్పినా వినేవారు కాదు. ఆ ప్రభావం వల్లనే సారా ఉద్యమం మా నెల్లూరు జిల్లాలో ప్రారంభమయినప్పుడు నేను దానికి మద్దతునిస్తూ, మహిళలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగించాను.
*అక్రమ లే అవుట్లు, ఆక్వా సాగు తదితర కారణాల వల్ల పల్లెవాతావరణం పాడయిపోతోంది. అది చాలా బాధాకరం.
*ఈ రోజుల్లో ఎంతోమంది గ్రామీణ యువకులు చాలా ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నారు. దేశవిదే శాల్లో రాణిస్తున్నారు. అలాంటివారు తాము పుట్టిపెరిగిన పల్లెలకు తోచినంత సాయం చెయ్యాలి. అదో బాధ్యతగా భావించాలి. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మనం పుట్టిన ఊరిని మరిచిపోకూడదు.<ref>http://www.andhrajyothy.com/node/42722ఆంధ్రజ్యోతి 15.12.2013</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}