మామిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను (వీటిని మామిడి ఒరుగు అంటారు) సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయను వివిధ రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపు శక్తి (కాల్షియమ్) [[విటమిన్ బి]] పుష్కలంగా ఉంది కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటల లో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పై తో చేస్తున్నారు. థాయ్ లాండ్ లో భోజనానంతర ఆహారం (డిసర్ట్) తో చేర్చి అందిస్తారు.
=== మామిడి.. క్యాన్సర్‌ నివారిణి ===
మామిడి రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను '''అరికడుతుందని''' మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్టు నిపుణులు కనుగొన్నారు. ఐదు రకాల మామిడి పండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌ను.. రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, రక్త క్యాన్సర్ల బాధితులకు ఇచ్చి పరీక్షించారు. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవటమే కాదు, ఇది రెండు క్యాన్సర్‌ కణాలను చనిపోయే స్థితికీ తెచ్చినట్టు గుర్తించారు.(ఈనాడు22.1.2010)
 
==ఔషదంగా మామిడి ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు