"తమిళనాడు" కూర్పుల మధ్య తేడాలు

 
== అవీ, ఇవీ ==
* దేశంలో తమిళనాడుప్రాంతంలో మాత్రమే ఈశాన్య ఋతుపవనాలవల్ల అక్టోబరు - నవంబరు - డిసెంబరు మాసాలలో వర్షాలు పడతాయి.
 
* దేశంలో తమిళనాడుప్రాంతంలో మాత్రమే ఈశాన్య ఋతుపవనాలవల్ల అక్టోబరు - నవంబరు - డిసెంబరు మాసాలలో వర్షాలు పడతాయి.
 
* బంగాళా ఖాతంలోని అల్పపీడనాలవల్ల పడే వర్షాలు తమిళనాడు నీటివనరులలో ముఖ్యమైనది. కాని వాటివల్ల వచ్చే తుఫానులవల్ల నష్టాలకు కూడా తమిళనాడు తరచు గురి అవుతుంటుంది.
 
* 2004 డిసెంబరు 26 న వచ్చిన 'సునామీ' ఉప్పెనకు తమిళనాట తీరప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
 
* కావేరీ నది జలాల వినియోగం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిరకాలంగా ఉన్న వివాదం. రెండు రాష్ట్రాల వ్యవసాయానికీ ఈ నీరు చాలా అవసరం.
 
* చెన్నైలోని 'మెరీనా బీచ్' ప్రపంచంలో రెండవ పొడవైన బీచ్. కడలూరులోని 'సిల్వర్ బీచ్' మెరీనా బీచ్ తరువాత పొడవైనది.
* ఒకప్పుడు, తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా మద్రాసులో ఉన్నపుడు, మద్రాసు వెళ్ళిన తెలుగు వారికి [[ఎన్.టి.ఆర్]], [[ఏ.ఎన్.ఆర్]] ల ఇళ్ళు చూడడం టూర్ లో చాలా ముఖ్యమైన భాగంగా ఉండేది.
==తమిళనాట తెలుగు బావుటా==
*తమిళంలో ఉన్న తిరుప్పావై తెలుగునాట విష్ణుభక్తులు పాడినట్లే తెలుగులో ఉన్న త్యాగరాయ కీర్తనలను తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సంగీత కళాకారులందరూ పాడగలరు. పొట్టి శ్రీరాములు నిరా హారదీక్ష చేసి మరణించి, తెలుగుకు గుర్తింపు తెచ్చినా, తమిళనాట ఉన్న తెలుగువారు అక్కడే ఉన్నారు తప్ప, అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి రాలేదు.క్రీస్తుపూర్వం నుంచి తెలుగు వారు తమిళ ప్రాంతాలకు వెళ్ళారు. తమిళ నాడుకు తెలుగువారి వలస క్రీ.శ. 6వ శతాబ్దం పల్లవుల రాజ్యపాలన కాలం నుంచి ఉంది. శాతవాహనులు (క్రీ.పూ. 270) 13వ శతాబ్దంలో కాకతీయులు తమిళ నాడును పరిపాలించారు.తమిళనాట చోళ వంశం, తెలుగు రాజ్యమేలుతున్న చాళుక్య వంశం వియ్యం అందుకున్నాయి. దానితో వలసలకు ప్రోత్సాహం లభించింది. ఆ తరువాత కాకతీయుల కాలంలో తమిళనాట తెలుగు రాజ్యానికి మంచి పునాదులు ఏర్పడ్డాయి.15వ శతాబ్దం కృష్ణదేవరాయల ఏలుబడిలో 'తెలుగు వారికి స్వర్ణయుగం' అయింది. నాయక రాజులు, తంజావూరు ప్రాంతాలను పాలించి, తెలుగు సాంస్కృతిక వైభవానికి వన్నె తెచ్చే విధంగా, కవులను కళలను, కళారూపాలను పోషించి ఆదరించారు.తంజావూరును పాలించిన మరాఠా రాజ వంశీయులు 'సాహాజీ'లు కూడా తాము కవులై తెలుగులో యక్షగానాలు రచించారు.తంజావూరుసరస్వతీ గ్రంథాలయం తెలుగువారి సారస్వత భాండాగారంగా పేర్కొనవచ్చు.రెండవ 'సాహజీ' కాలంలో 1810 ప్రాంతాలలో బ్రిటీష్‌వారి సహకారంతో ఈ లైబ్రరీని దర్శించి, అందులో అప్పటికే శిథిలమై పోతున్న అనే తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేశారు. దాదాపు 10 వేల సంస్కృత తాళపత్ర గ్రంథాలు, 3 వేలకు పైగా తెలుగు సాహిత్య, సంగీత గ్రంథాలు ఇందులో ఉన్నాయి. ఇది మనకు సంబంధించి ఒక 'ప్రాచీననిధి', మన సంపద . తంజావూరు 20 కి.మీ.లలో మేలట్టూరు అనే యక్షగాన నాటక కళాకారులుండే గ్రామం .అక్కడకు 20 కి.మీ.లలో తిరువయ్యూరు ఉన్నాయి. భారతదేశం గర్వించతగ్గ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి నివసించిన ఊరు అది. అక్కడే కావేరి ఒడ్డున వారి సమాధి ఉన్నాయి.మేలట్టూరు భాగవత నాటకాలు 15వ శతాబ్ది నుంచి ప్రారంభమై, ఇప్పటి వరకు అజరామంగా నిలిచినాయి. కృష్ణదేవరాయ భార్య తిరుమలాంబ నాట్యకత్తె, మేలట్టూరు నివాసి. అందువల్ల వీరు తెలుగులోనే సాహిత్యం రూపొందించుకుని, కర్ణాటక సంగీత బాణీలో, భరతనాట్య సంప్రదాయంలో చక్కటి నాటకశైలిలో నడిచే నృత్య నాటకాలు ప్రదర్శిస్తుంటారు.అచ్యుతప్ప నాయకుడు వీరికి ఆ గ్రామం భరణంగా ఇచ్చారు.1810 ప్రాంతాలలో ఉన్న వేదం వెంకట్రాయశాస్త్రి గారిని వారి నాటకాల ఆధునీకరణకు కారణంగా చెపుతారు.ఈ నాటకాల తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. వారిది పురాతన తెలుగు నాటకశైలి. వీరు తెలుగులో పాడతారు.రాయడం మాత్రం తమిళంలో రాస్తారు. ఈ నాటక సంప్రదాయాన్ని తమిళ ప్రభుత్వం ఆదరించలేకపోవడానికి ఒక కారణం - అవి తెలుగులో ఉండడమే! తమిళంలో మార్చడానికి వీలుపడదు. వెంకట్రామ శాస్త్రిగారి నాటకాలే కన్యాశుల్కానికి ప్రేరణ అని గురజాడవారు పేర్కొన్నారు. మగవారు ఆడవేషం వేసిన, మేలట్టూరు నాటకాలు చూసి, మధురవాణి అనే పాత్రను కన్యాశుల్కానికి ''నాయకుడిని'' చేశారు గురజాడవారు. మన సాంస్కృతిక శాఖ ఈ మేల ట్టూరును మనదిగా చేసుకోవలసిన అవసరం ఉంది.త్యాగరాజ సమాధి స్థలం తిరువయ్యూరు తెలుగు గ్రామం. 16వ శతాబ్దపు తంజావూరు సంగీత సోద రులు వెంకట మఖి, క్షేత్రయ్య ఇత్యాదులు త్యాగరాజు కాలానికి పూర్వం అచ్చమైన తెలుగు సంగీత సంప్రదాయానికి పునాదులు వేశారు. త్యాగరాజస్వామి తెలుగులో రాసి, తెలుగుభాషకు ఉన్నతిని చేకూర్చారు.ఆయనకు సరైన స్మృతి నిర్మాణాన్ని చేపట్టి, తెలుగు జాతి ఆయన ఋణం తీర్చుకోవాలి. <ref>http://www.prajasakti.com/index.php?srv=10301&id=1020348&title=%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%20%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%9F%E0%B0%BE ---'కళామిత్ర' ఆర్‌. రవిశర్మ, 'నాటక కళ' సంపాదకులు ఆంధ్రజ్యోతి 18.12.2013</ref>
 
 
* ఒకప్పుడు, తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా మద్రాసులో ఉన్నపుడు, మద్రాసు వెళ్ళిన తెలుగు వారికి [[ఎన్.టి.ఆర్]], [[ఏ.ఎన్.ఆర్]] ల ఇళ్ళు చూడడం టూర్ లో చాలా ముఖ్యమైన భాగంగా ఉండేది.
== ఇవి కూడా చూడండి ==
* [[తమిళనాడు ముఖ్యమంత్రులు]]
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/977846" నుండి వెలికితీశారు