సమైక్యాంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్ల పాఠ్యముVali bhasha (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 928650 ను రద్దు చేసారు
పంక్తి 30:
ఆంధ్రప్రాంతంలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా లేదు. రోగులు అమిత వ్యయభారంతో హైదరాబాద్‌కు రావలసి వస్తోంది. దాదాపు 25 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లేదా విశ్వవిద్యాలయం తో సమానమైన ప్రతిపత్తి ఉన్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు అన్నిటినీ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి ఒక్క దాన్నీ ఇవ్వ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఏకైక ఐ ఐటిని సైతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. ఇటువంటి ఉదాహరణలు వందల సంఖ్యలో చెప్పగలను. ఆంధ్రప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నట్టయితే ఈ ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలలో కొన్నిటిని చాలాకాలం క్రితమే కోస్తాంధ్రలో ఏర్పాటుచేసి వుండే వారు కాదా? ఆంధ్రప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలు పలువురు తమ పరిశ్రమలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. సినిమా, మీడియా, ఆరోగ్యభద్రత, ఆతిథ్య రంగాలు కూడా హైదరాబాద్‌లోనే అభివృద్ధి చెందాయి. వాటిని ప్రమోట్ చేసింది ఆంధ్రప్రాంతానికి చెందిన వారే. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కనుకనే అందరూ అక్కడే తమ వ్యాపారాలను నెలకొల్పి అభివృద్ధి చేసుకున్నారు. ఈ హైదరాబాద్ కేంద్రిత అభివృద్ధి చంద్రబాబునాయుడు హయాంలో పరాకాష్టకు చేరింది. ఆయన ప్రారంభించిన హైటెక్ సిటీ ఇప్పటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది. దానిని మొదటనే విభజించి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలలో కూడా ఏర్పాటు చేసి వుండవల్సింది.
 
ఆంధ్రప్రాంత యువజనులు కొంతమంది రాష్ట్ర విభజనను ఇందుకే వ్యతిరేకిస్తున్నారు.రాష్ట్ర విభజన జరిగితే తమకు ప్రైవేట్‌రంగంలో ఉపాధి అవకాశాలు, స్వయంఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని భయపడుతున్నారు.ఉద్యోగాలకోసం హైదరాబాద్‌కు మినహా మరే నగరానికి వేళ్ళే అవకాశం లేదు. ఆంధ్రప్రాంతపు ప్రతి గ్రామంలోని ప్రతికుటుంబం నుంచి ఎవరో ఒకరు హైదరాబాద్‌లో స్థిరనివాసాన్ని ఏర్పరచుకుని ఉన్నారు. విభజనతో తాము నష్టపోతామని వారు భయపడుతున్నారు. ఈ విషయమై వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించాలి.విభజన మూలంగా తమకు తొలుత సమస్యలేర్పడినప్పటికీ దీర్ఘకాలంలో ఆంధ్రరాష్ట్రం వల్ల తమకు అధిక ప్రయోజనాలు సమకూరుతాయనే భరోసా వారికి కల్పించాలి. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రుల భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండదనే నమ్మకం కూడా వారిలో కల్పించాలి.(ఆంధ్రజ్యోతి 27.7.2013)
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/సమైక్యాంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు