ఈమని శంకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేడియో ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
సంగీతబ్రహ్మ త్యాగ్యం తన చివరి రోజులలో ‘మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు’ అనే కీర్తన పాడేవారని చరిత్ర చెబుతోంది. యాదృచ్చికమో ఏమో కాని, శాస్త్రిగారు గుంటూరులో చేసిన ఆఖరి కచేరీలో కూడా ఇదే కీర్తన వాయించారు. ఇక తన వీణానాదాన్ని అమరలోకంలో దేవతలకు వినిపించాలనుకున్నారో ఏమో 1986, డిసెంబరు 23న వీణాగానం చేస్తూ నారదునితో సంచారం చేయడం ప్రారంభించారు.
 
==రేడియో కార్యక్రమాలు=
1940లో [[తిరుచ్చి]] రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది. అలా మెల్లగా ఎదుగుతూ వచ్చారు. ఆకాశవాణి డైరక్టరేట్ లో సంగీత విభాగంలొ చీఫ్ ప్రొడ్యూశర్ గా పనిచేసిన మరో ప్రముఖులు ఈమని శంకరశాస్త్రి. వైణికులుగా లబ్ధ ప్రతిష్టులైన శంకరశాస్త్రి ఢిల్లీలో సముచిత గౌరవాన్ని పొందారు.
 
==విదేశీయానము మరియు సత్కారములు==
విమానం ఎక్కడమంటే ఆయనకు చాలా భయము. అందువల్ల ఆయన ఎన్నిసార్లు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు. చివరికి 1970వ దశకంలో ఫ్రాన్స్ వెళ్లి కచేరీలు చేశారు. అక్కడివారు ఎంతో సంబరపడ్డారు. ‘కాన్సర్ట్ ఆఫ్ ది సెంచురీ’ అని పత్రికలు ప్రశంసించాయి..
"https://te.wikipedia.org/wiki/ఈమని_శంకరశాస్త్రి" నుండి వెలికితీశారు