నీలిమందు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
wiki style conversion
పంక్తి 1:
{{వికీకరణ}}
 
==చరిత్ర==
'''నీలిమందు''' (indigo) కీ భారతదేశానికీ చాలా గట్టి లంకె ఉంది. సింధు నాగరికత రోజులనుండీ వృక్షసంపద నుండి రంగులు తీసి వాడటం భారతీయులకి తెలుసు. హరప్పా దగ్గర దొరకిన ఒక వెండి పాత్ర చుట్టూ చుట్టబెట్టిన అద్దకపు బట్టే దీనికి నిదర్శనం. అజంతా గుహలలో ఉన్న చిత్రాలలో మొక్కలనుండి తీసిన రంగులు కనిపిస్తున్నాయి కదా! కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో రంగుల ప్రస్తావన ఉంది. రంజనాలు (dyes) మొక్కల నుండి తయారు చెయ్యటమే కాకుండా వాటిని బట్టలకి అద్దటంలో ఉన్న సాంకేతిక సూక్ష్మాలని కూడ కనిపెట్టేరు భారతీయులు. ఎనిమిదవ శతాబ్దం నాటికే మధ్య ఆసియాలోనూ, ఈజిప్ట్ లోనూ భారతదేశంలో చేసిన అద్దకపు బట్టలు మంచి ప్రాచుర్యంలో ఉండేవి. పదమూడవ శతాబ్దంలో ఇండియా వచ్చిన మార్కోపోలో ఇండియాలో నీలిమందు వాడకం గురించి ప్రస్తావించేడు. అప్పటికి గ్రీకు దేశంలోనూ, రోములోనూ ఈ నీలిరంగు రంజనం (blue dye) వాడకంలో లేకపోలేదు. కాని ఈ రంగుకి 'ఇండిగో' అన్న పేరు రావటానికి మార్కోపోలో ఇండియాలో ఈ రంగుని చూడటమే అని అభిజ్ఞవర్గాల నమ్మకం. గ్రీకు భాషలో "ఇండికాన్" అన్నా లేటిన్ భాషలో "ఇండికమ్" అన్నా "ఇండియా నుండి వచ్చినది" అనే అర్ధం.
 
పంక్తి 7:
 
 
==నీలిమందు తయారీ==
అసలు నీలిమందు కొన్ని రకాల మొక్కల నుండి వస్తుంది. ఈ మొక్కలన్నిటిలోకీ శ్రేష్థమైనది భారత దేశంలో పెరిగే నీలి మొక్క. నీలి రంగు ఆకులతోటీ, చిన్న చిన్న పసుపు పచ్చని పువ్వులతోటీ, రెండేళ్ళకొక సారి పెరిగే ఈ మొక్క ఆవ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం ఇండిగోఫెరా టింక్టోరా (Indigofera tinctora). ఈ మొక్కలని కోసి, కట్టలుగా కట్టి, ఇటికలతో కట్టిన కుండీలలో వేసి, నీళ్ళతో తడిపి ఒక రోజుపాటు నానబెడతారు. ఎండుగడ్డి రంగులో ఉన్న తేటని మరొక కుండీలోకి వెళ్ళేలా వారుస్తారు. ఈ తేటని రెండు మూడు రోజులపాటు చిలకాలి. ఇది శ్రమతో కూడిన పని. ఇద్దరు, ముగ్గురు మనుష్యులు ఈ కుండీలలోకి దిగి, తెడ్లతో ఈ తేటని బాదుతారు. అప్పుడు ఎండుగడ్డి రంగులోంచి ఆకుపచ్చ రంగులోకి మారి, క్రమంగా నీలిరంగులోకి వస్తుంది. అప్పుడు నీలిమందు చిన్న చిన్న రేకుల మాదిరి విడిపోయి అడుక్కి దిగిపోతుంది. పైన ఉన్న నీటిని తోడేసి, నీలి ముద్దలో ఉన్న మలినాలని వెలికి తియ్యటానికి ఆ ముద్దని రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి, వడబోసి, ఎండబెడితే నీలం రంగు గుండ మాదిరి వస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/నీలిమందు" నుండి వెలికితీశారు