కళ్ళు (నాటిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
రంగడికి కళ్లు వస్తాయి. దృష్టి పరిసరాలపై పడుతుంది. తమ స్థితి, తిండి, దరిద్రం తాండవిస్తున్న స్తితిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్లూ ఏ మనుషులతో ఒకటిగా సహజీవనం చేశాడో, ఆ మనుషుల బాహ్యమైన స్థితి ఏవగింపు కలిగిస్తుంది. తాము తినకుండా తనకోసం దాచివుంచే పాచి రొట్టను చూసి వాంతి చేసుకుంటాడు. పూజారి బసవయ్య చేస్తున్న మోసాన్ని చూసి రంగడిలో స్వార్థం మొలకెత్తుతుంది. రంగడి కళ్లతో లోకాన్ని చూడాలనుకునే నేస్తాలు రంగడి తెలివితేటలకు గర్వపడిపోతున్నారు కానీ మోసం కుబుసం విడిచి బుసలుకొట్టబోయే విషయాన్ని పసిగట్టలేకపోతారు. కళ్లున్న రంగడు కళ్లులేని మనుషులను అడ్డంపెట్టుకొని వ్యాపారంచేసే స్థాయికి ఎదుగుతాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటాడు. అంహంకారం వంటికి పడుతుంది. తోబుట్టువులాగా కష్టసుఖాల్లో తోడుగా ఉన్న సీతను మానభంగం చేయబోతాడు. మానసంరక్షణ కోసం శేలాన్ని రంగడిపై విసురుతుంది. రంగడు తిరిగి గుడ్డివాడైపోతాడు. తాను అసహ్యించుకున్న మనుషులు తనను క్షమించి కలిసిపొమ్మని కోరినా వారి మంచితనాన్ని భరించలేని రంగడు వారినుండి శాశ్వతంగా విడిపోతాడు.
 
ఈ నాటిక ఆధారంగా [[కళ్ళు (సినిమా)|కళ్ళు]] సినిమా తీయడం జరిగింది. దీనికి ప్రముఖ ఛాయాగ్రహకులు [[ఎం.వి.రఘు]] దర్శకత్వం వహించారు.
"https://te.wikipedia.org/wiki/కళ్ళు_(నాటిక)" నుండి వెలికితీశారు