సువర్ణముఖి (చిత్తూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
స్వర్ణముఖి నది పాకాల సమాంలో ఉన్న [[పాలకొండ]] లలో [[ఆదినాపల్లి]] వద్ద చిన్నవాగులా పుట్టిన్ంది. ఇది చంద్రగిరి ఎగువన [[భీమానది]] తో సంగమించి నది అయింది. ఆతరువాత దిగువన ఉన్న [[కల్యాణీనది]]తో కలిసి పెద్దనదిగా మారింది. చంద్రగిరి వద్ద ఉన్న చంద్రనగము మరియు హేమనగములలో ఇది హేమనగాన్ని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఇది సార్ద్జక నామాధేయురాలైంది. వాస్తవానికి స్వర్ణముఖరీ ఇసుక వెండిలా తెల్లగానూ అలాగే సువర్ణంలో బంగారు వర్ణంతోనూ ఉంటుంది. తరువాత ఈ నది కొంతదూరం ఉత్తరంగా ప్రవహించి మరికొంత దూరం ఈశాన్యంగా ప్రవహిస్తు శేషాచల కొండలను స్పృజించి కల్యాణీ, భిమానదులతో సంగమించి కపిలతీర్ధం, అలివేలుమంగాపురం, శ్రీకాళహస్తి, నెల్లూరు మీదుగా ప్రవహించి నూడుపేట సమీపంలో ఉన్న సిద్ధవరం వద్ద తూర్పుసముద్రంలో సంగమిస్తుంది. స్వర్ణముఖీ నదీ తీరంలో అగశ్వేరాలయం, వరేశ్వరాలయం, పద్మావతీ దేవి ఆలయం, పరశురామేశ్వరాలయం ఉన్నాయి. ఈ నది మొత్తంగా దాదాపు 100 మైళ్ళు ప్రయాణిస్తుంది.
== పురాణకథనం ==
హిమాలయాలలో శివపార్వతుల కల్యాణానికి కదిలి వచ్చిన దేవ, ౠషి, మానవ గణాల భారంతో భూమి ఒక వైపుకు వంగిపోయిన సందర్భంలో శివుడు అగస్త్యమహామునిని పిలిచి
విద్యపర్వతాలకు ఆవలివైపు వెళ్ళమని ఆదేశించాడు. అగస్త్యుడు శివుని ఆదేశాన్ని అనుసరించి భారతదేశ దక్షిణప్రాంతానికి తరలి వెళ్ళాడు. పోతూ పోతూ సూర్యగమనానికి అడ్డుతగులుతూ పెరుగుతున్న విద్యపర్వతం వద్ద తాను తిరిగి వచ్చే వరకు పెరగకూడదని వరం స్వీకరించాడు. అందువలన విద్యపర్వతాల పెఉగుదల ఆగిపోయింది. అగస్త్యుడు తిరిగి ఉత్తరదిశకు వెళ్ళలేదు. ఇలా విదర్వత గర్వభంగం చేసాడు. దక్షిణ దిశకు వచ్చిన అగస్త్యుడు కృష్ణానది, జ్యోతి సిద్ధవటం, శ్రీశైలం, ద్రాక్షారామం మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చివరకు
కాళహస్థికి చేరుకున్నాడు. అక్కడ స్నానపానాలకు, జపతపాలకు తగిన నీరు లభించని కారణంగా కాళహస్థికి నాలుగు యోజనముల దూరములో పడమరదొశగా ఉన్న పర్వతశ్రేణులలో
తపసు చేయగా బ్రహ్మాదులు దేవగణములతో శివుని దర్శించుకుని అగస్త్యుని కోరిక తెలిపారు. శివునుడు ఆప్రదేశంలో ఒక నదీమతల్లి ఆవిర్భావానికి అనుగ్రహించగా ఆకాశం నుండి గంగాభవాని స్వర్ణ కాంతులతో భూమిమీదకు దిగివచ్చింది. అందువలన ఈ నది స్వర్ణముఖి అని నామదేయురాలైంది.
 
==మూలాలు==