క్షేత్రయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 16:
==దేశాటనం, సన్మానాలు, గుర్తింపు==
[[దస్త్రం:Kshetrayya.jpg|thumbnail|క్షేత్రయ్య చిత్రపటం]]
ఆంధ్ర దేశంలోని [[తిరుపతి]], [[కడప]], [[శ్రీశైలం]] మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక, [[కంచి]], [[శ్రీరంగం]], [[మధుర]], [[తిరువళ్ళూరు]]లలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది.
 
ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శించాడు (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?). అనంతరం భద్రాచలంంలోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు.
"https://te.wikipedia.org/wiki/క్షేత్రయ్య" నుండి వెలికితీశారు