సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
===అంగజాల జగన్నాథయ్య===
అంగజాల జగన్నాథయ్య ([[1932]] - [[1989]]) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. వీరి స్వస్థలం [[విజయనగరం]] జిల్లాలోని [[బలిజిపేట]] గ్రామం. వీరు వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు. ఈయన తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య మరియు ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు. ఈయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. కోసం దగ్గరిలోని విద్యాకేంద్రమైన [[బొబ్బిలి]] వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు 1952లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నారు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అన్నయ్య అయిన కృష్ణమూర్తి గారు చనిపోవడంతో చదువు ఆపి తండ్రి గారి వ్యాపార విషయాలలో కేంద్రీకరించారు. జగన్నాథయ్య గారు, బావమదరులైన మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య మరియు భరతారావు గార్లతో కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా [[చింతపండు]] వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు కుడా చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను మరియు తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం మరియు కమిషన్ కోసం కూడా క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. వాటిని బస్తాలలో [[లారీ]]లు లేదా [[రైలు]] ద్వారా సాలురుకు తరలించి నిలువచేసేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) కొట్లు పెట్టి ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు [[ఉపాధి]] కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేశేవారు.
 
 
'''పోతుబరి పెదనారాయణ'''
 
సాలూరు కోటలో రాజ వైద్యునిగా పనిచేసేవారు . రాజుల వద్ద పనిచేసే కాలంలో ఎన్నో నయం కాని ఎన్నో రోగాలను తన వైద్యంతో తరిమికొట్టేవారు . సాలూరుపట్టణం లో మరియు కోటలో ఎన్నో నారాయణ సంకీర్తనలు భజనలు చేసేవారు . వీరి కుమారుడు పోతుబరి విష్ణు మూర్తి గారు కూడా ఎంతో సంఘ సేవా కార్యక్రమాలు చేబట్టేవారు . అందులో భాగంగానే అతను మరియు కొంతమంది ప్రముఖుల సహాయంతో ఎంతో మంది అనాధలకు ఉండడానికి ఒక అనాధ సంఘం నిర్మించారు . అనాధ సంఘం నిర్వహించడానికి ప్రతి రోజు బిక్షాటన చేసేవారు . శ్రీమన్నారయునిని ఎంతగానో కొలిచేవారు . కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఒక చిన్న గుమస్తాగా పని చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా ఏదో ఒక మంచి పని చేబట్టేవారు . ఈయన కుమారుడు పోతుబరి అప్పలసుర్యనారాయణ (భావాజీ )గారు కూడా ఆయుర్వేదం విద్య అభ్యసించి చిన్న పిల్లలకు వచ్చే భాలగ్రహాలు ,అన్నిరకముల ఆయుర్వేద మందులు విక్రయించేవారు . శ్రీ భుజంగరావు వైద్యశాల అనే ఒక ఆయుర్వేద ఆసుపత్రి ని నడిపేవారు . ఎంతోమంది చిన్నపిల్లలకు నయం కాని రోగాలను కూడా నయం చేసేవారు . పోతుబరి వారు అంటే సాలురులో మోతుబరులు . ఇప్పటికీ చిన్నపిల్లలకు వైద్యం వారి భార్య పోతుబరి మంగయమ్మ గారు చేస్తున్నారు .
 
==పవిత్ర స్థలాలు==
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు