ఉయ్యాల జంపాల (2013 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
'''ఉయ్యాల జంపాల ''' 2013 డిసెంబరు 25న లో విడుదల కాబోతున్న తెలుగు చిత్రం. 2013 డిసెంబర్ 15 న ఈ చిత్ర సంగీతం విడుదల కాబోతున్నది.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2013-12-10/news-interviews/45033681_1_uyyala-jampala-anandi-brisk-progress |title=Uyyala Jampala audio to release on Dec 15 |publisher=timesofindia |date= 2013-12-10|accessdate=2013-12-12}}</ref>
==కథ==
గోదావరి జిల్లా [[కూనవరం]] నేపథ్యంగా సాగే పక్కా గ్రామీణ ప్రేమ కథ ఇది. ఈ చిత్రంలో సూరి, ఉమాదేవి బావ, మరదళ్లు. కోడిపెంట ఎరువు అమ్ముకునే ఓ పల్లెటూరి బుల్లెబ్బాయి... సూరి (రాజ్‌ తరుణ్‌). తన మేనమామ కూతురు ఉమ (అవిక) అంటే అతనికి క్షణం పడదు. గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా కనిపించే బావ మరదళ్ల సరసం, చిలిపి తగాదాలు, గిల్లి కజ్జాలు, ఆటపట్టించడం లాంటి తమాషాలు సూరి, ఉమల బాల్యంలో ఓ భాగం. బావామరదళ్లు ఇద్దరూ ఒకర్ని ఒకరు ఉడికించుకోవడానికి వేరే వాళ్లని ప్రేమిస్తారు. వారి జీవితం అలా సాగిపోతుండగా అనుకొని సంఘటన వారిద్దర్ని మరింత దగ్గరికి చేరుస్తుంది. ఉమ ప్రేమించిన వాడు ఆమెని మోసం చేయబోతే తన్ని బుద్ధి చెప్తాడు సూరి. దాంతో సూరిపై తనకున్న ప్రేమని తెలుసుకుంటుంది ఉమ. అంతేకాకుండా సూరిపై తనకు ఉన్న ఇష్టం ప్రేమ అని ఉమకు అర్ధమవుతుంది. కానీ సూరికి తన మరదలిపై తనకున్న ప్రేమ తెలీదు. అయితే ఇరు కుటుంబాల మధ్య ఉన్న తగాదాల కారణంగా ఉమకు సూరి పెళ్లి సంబంధాన్ని ఖాయం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సూరి ఖాయం చేసిన పెళ్లి ఉమ చేసుకుంటుందా? లేక సూరికి తన ప్రేమను తెలుపుతుందా? సూరి, ఉమాదేవిల మధ్య ఉన్న సాన్నిహిత్యం పెళ్లి వరకు దారి తీస్తుందా అనే ప్రశ్నలకు సమాధానమే ఉయ్యాలా జంపాలా.
 
==నటవర్గం==
* [[రాజ్ తరుణ్]]