శంకరాభరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా |
name= శంకరాభరణం{{PAGENAME}}|
year =1979|
image = Sankarabharanam.jpg|
పంక్తి 22:
}}
 
'''శంకరాభరణం{{PAGENAME}}''' [[1979]] లో [[కె.విశ్వనాధ్]] దర్శకత్వంలో నిర్మంచబడిన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. [[తెలుగు]] సినీ జగత్తులో ఎన్నదగిన చిత్రాలలో ఇది ఒకటి .శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం ద్వారా కొత్త ఊపిరులూదింది. ఈ చిత్రం ఇక్కడే కాకుండా [[ప్రపంచం]]లోని శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ [[కళా తపస్వి]] గా పేరొందాడు. అప్పటివరకూ పెద్దగా పేరు ప్రఖ్యాతలు లేని గాయకుడు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ఈ చిత్రంలోని శాస్త్రీయ సంగీత బాణీలతో కూర్చబడిన పాటలను అజరామరమైన రీతిలో ఆలపించి దక్షిణ భారత సినీ గాయకులలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ చిత్రం ప్రభావంతో తెలుగునాట అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పించనారంభటం మరో విశేషం.
==చిత్ర కథ==
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు తులసి (మంజు భార్గవి) ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. విధిలేని పరిస్థితులలో ఆమె శీలాన్ని నాశనం చేసి, శంకర శాస్త్రిని తులనాడిన ప్రతినాయకుడిని హతమారుస్తుంది. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. ఇలా కొంతకాలం అయిన తరువాత మంజు భార్గవి ఒక కొడుకుని కని ఎలాగోలా ప్రయత్నించి శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/శంకరాభరణం" నుండి వెలికితీశారు