వెన్నెలకంటి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 19:
== సమాజ సేవ ==
ఆనాటి కంపెనీ పాలనలో ఉన్నతోద్యోగాలు నిర్వర్తించిన సుబ్బారావు సమాజసేవలో కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించారు. ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ ప్రాంతంలో బాటసారులకు మజిలీ చేసే సౌకర్యాలు లేకపోవడం గమనించిన సుబ్బారావు సత్రం కట్టించారు. ఆ సత్రానికి తన భార్య కనకమ్మ పేరిట "కనకమ్మ సత్రం"గా నామకరణం చేశారు. ఎన్నో ఏళ్ల పాటు దారినపోయే బాటసారులకు మజిలీగా ఉపయోగపడిన ఆ సత్రం అటువైపు నుంచి రహదారులు వేరేవైపుకు మారిపోగా వందల ఏళ్లకు నిరుపయోగమై శిథిలావస్థకు చేరుకుంది. ఆ స్థితిలో సత్రం ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడంతో ప్రముఖ పాదయాత్రికుడు [[ప్రొఫెసర్ ఆదినారాయణ]] 2010ప్రాంతాల్లో కనుగొన్నారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ వెన్నెలకంటి సుబ్బారావు గ్రంథాన్ని, ఆనాటి కంపెనీ కాలంలోని స్పష్టాస్పష్టమైన మాపులను ఆధారంగా తీసుకుని కాలగర్భంలో కలిసిపోయిన రాజమార్గాలను సాహిత్యాధారాలతో ఊహించి ఆ సత్రాన్ని కనుగొన్నారు.<ref>ప్రొ.ఆదినారాయణ రాసిన వెన్నెలకంటి సుబ్బారావు నిర్మించిన సత్రం పరిశోధనకు సంబంధించిన వ్యాసం, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక</ref><br />
వెన్నెలకంటి సుబ్బారావు ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించారు. "[[కాశీయాత్ర చరిత్ర]]"గ్రంథకర్త, నాటి మద్రాసు సుప్రీంకోర్టులో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని పొందిన [[ఏనుగుల వీరాస్వామయ్య]]కు మద్రాసుకోర్టులో ఉద్యోగాన్ని ఇప్పించిన వ్యక్తి వెన్నెలకంటి సుబ్బారావే.<ref>ఈతకోట సుబ్బారావు రాసిన అలనాటి నెల్లూరు గ్రంథంలోని "ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త వెన్నెలకంటి సుబ్బారావు" వ్యాసం:పేజీ.56</ref>
 
== మూలాలు ==