సింగరేణి బొగ్గుగనులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. 125 ఏళ్ల క్రితం ఒక కుగ్రామం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. 125 ఏళ్ల క్రితం ఒక కుగ్రామంలో చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు జిల్లాలకు విస్తరించింది. 23 డిసెంబర్ 1920న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ... దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'.తరవాత కాలంలో నిజాం ప్రభువుల ఆధీనంలోకి కంపెనీ వెళ్లింది. సింగరేణిపై అధికారం తరవాత హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లింది.1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్పు చేశారు 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా ఏర్పడింది కాబట్టి ఆ రోజును 93వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.
 
==విస్థరణ==
మొదట్లో చాల కొద్ది ప్రాంతానికే పరిమితమైన ఈ బొగ్గు గనులు కాల గమనంలో ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి లోయలో 350 కిలో మీటర్ల మేర నిక్షిప్తమై ఉన్న అపార బొగ్గు ఖనిజాన్ని ఈ సంస్థ తవ్వి తీస్తోంది. దక్షిణ భారత దేశంలో సుమారు నాలుగు వేల పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కావలసిన ఇంధనం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొనసాగుతోంది.
 
==బొగ్గు నిక్షేపాలు ఇలా బయటపడ్డాయి==
19వ శతాబ్దపు పూర్వార్థంలో గోదావరి నది తీరంలోని భద్రాచలంలో ఉన్న రామచంద్రుణ్ణి దర్శించుకోడానికి కాలి నడకన గాని, ఎడ్ల బండ్లపై కాని భక్తులు వెళ్లే వారు. పట్టేది. భక్తులు దారిలో అనువైన ప్రదేశంలో విశ్రాంతి కోసం ఆగి, పొయ్యి ఏర్పాటు వంట చేసుకునే వారు. అలా నల్ల రాళ్ళతో పొయ్యి ఏర్పాటు చేసుకొని వంట చేస్తుండగా పొయ్యి లోని కట్టెలతో సహా ఆ రాళ్లు కూడా మండడం చూసిన భక్తులు సమీపంలోని బ్రిటిష్ అధికారులకు ఈ వింతను చెప్పారు. మండే స్వభావం ఉన్న ఆ రాళ్లను స్థానిక బ్రిటిష్ అధికారులు ఉన్నతాధికారులకు పంపారు. వాటిని రాక్షసి బొగ్గుగా గుర్తించిన బ్రిటిష్ అధికారులు ఆ ప్రాంతంలో అన్వేషణ మొదలు పెట్టారు. అప్పటి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ముఖ్య అధికారి డాక్టర్ విలియమ్ కింగ్ దీనిపై సర్వే చేశారు. 1889లో కేవలం 59,671 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సింగరేణి ఉత్పత్తి సామర్థ్యం 2012-13 వచ్చేసరికి 53 మిలియన్ టన్నులు దాటిందంటే ఎంత అభివృద్ధి జరిగిందో ఊహించవచ్చు...2013-14 ఆర్థిక సంవత్సరానికి 54.300 లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది.
 
==విద్యుత్ ఉత్పత్తి రంగంలో సింగరేణి==
రానున్న కాలంలో సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తే కాకుండా 2015 నాటికి విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. ఇప్పటికే బిజినెస్ డెవలప్‌మెంట్ గ్రూపును ఏర్పాటుచేసుకుని జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును 6వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. సింగరేణికి ఈ ప్రాజెక్టు ద్వారా యేటా 250 నుంచి 300 కోట్ల లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే 150 మెగావాట్ల విద్యుత్‌ను సింగరేణి తన అవసరాలకు వాడుకుంటుంది.
 
1050 మెగావాట్లను రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు అమ్మడానికి 25 సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. విస్తరణతో పాటు సామాజిక సేవలో కూడా సింగరేణి ఎంతో ముందుంది. కార్మికులు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు, భూనిర్వాసితుల కోసం సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సేవలకు గుర్తింపుగా 2013లో ఉత్తమ సామాజిక సేవా (సీఎస్ఆర్) అవార్డును దక్కించుకుంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 53.100 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించిన సింగరేణి 2013-14 ఆర్థిక సంవత్సరానికి 54.300 లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది.