ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవరాయలు]] రచించిన తెలుగు [[ ప్రబంధం]] ఈ "'''ఆముక్తమాల్యద'''" గ్రంథం. దీనికే "'''విష్ణుచిత్తీయం'''" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో [[పంచకావ్యాలు]] లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.
 
==ప్రారంభం==
పంక్తి 11:
 
సాధారణంగా [[శార్దూలము]] తో గాని, [[విక్రీడితము]] తో గాని కావ్యమును ప్రారంభించుట పరిపాటియైన కాలములో, ఈ కావ్యము [[ఉత్పలమాల]] తో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, గోదాదేవి రంగనాయక స్వామి వారి పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.
 
==కథాంశాలు==
ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలొ స్త్రీ శిశువు లభించింది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మంలో భూదేవి. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీరంగంలో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచినాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.
 
==శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన==
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు