కృష్ణవంశీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పసుపులేటి కృష్ణవంశీ''' ప్రముఖ [[తెలుగు సినిమా]] దర్శకుడు. [[రామ్ గోపాల్ వర్మ]] దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం [[గులాబి (సినిమా)|గులాబీ]] తో మంచి పేరు తెచ్చుకున్నాడు. [[2000]]వ సంవత్సరంలో [[ఆంధ్రా టాకీస్]] అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి [[రమ్యకృష్ణ]]ను పెళ్ళి చేసుకున్నాడు.
 
తెలుగు సినిమా పరిశ్రమ లో క్రిష్ణవంశీ సృజనాత్మక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాకు క్రొత్త ఒరవడిని పరిచయం చేసిన [[రామ్ గోపాల్ వర్మ]] వద్ద శిష్యరికం చేయక మునుపు, కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నాడు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు [[అనగనగా ఒక రోజు]] చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే [[గులాబి]] అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రధను చెరిపేసినవాడు క్రిష్ణవంశీ. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి, అతనికి [[అక్కినేని నాగార్జున]] రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చాడు . ఆ సినిమా పేరు [[నిన్నే పెళ్ళాడతాపెళ్ళాడుతా (1996 సినిమా)|నిన్నే పెళ్ళాడుతా]]. తరువాత స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి 'ఆంధ్రా టాకీస్' సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన [[సింధూరం]] అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి [[సముద్రం (సినిమా)|సముద్రం]] లాంటి సినిమాలను తీసినట్టు స్వయంగా అతనే ఇంటర్వ్యూలలో చెప్పాడు.
 
==చిత్రాలు==
 
# [[గులాబి (సినిమా)]]
# [[నిన్నే పెళ్ళాడుతా (1996 సినిమా)|నిన్నే పెళ్ళాడుతా]]
# [[నిన్నే పెళ్ళాడతా]]
# [[సింధూరం]]
# [[అంతఃపురం]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణవంశీ" నుండి వెలికితీశారు