పాంచరాత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==దైవ దర్శనం==
పదకొండవ శతాబ్దిలో రామానుజులు ఆది శంకరుల అద్వైతాన్ని తిరస్కరిస్తూ వైష్ణవులకు పాంచరాత్ర పద్ధతిని ఏర్పరచారు. పాంచరాత్రాగమనానికి అనువుగానే నారాయణుణ్ణి పరమాత్మగా నమ్మడం, దేవాధిదేవుడిగా కొలవడం కనిపిస్తుంది. రామానుజుల ప్రకారం పరమాత్మ ఐదు రూపాల్లో అవతరిస్తాడు: పర, వ్యూహ, విభవ, అంతర్యామి మరియు అర్చ. మనుషులు భగంతుణ్ణి చేరేందుకు ఈ ఐదు రూపాల్లో ఏదో ఒకటి లేదా ఎక్కువ రూపాలను ఆరాధించవచ్చు.
;పర రూపం
పరమాత్ముడి రూపమే ఈ పర.
;వ్యూహ రూపం
ఆరు గుణాలతో కూడుకుని ఉన్న వాసుదేవుడే మొదటి వ్యూహ మూర్తిగా గుర్తించబడ్డాడు. వాసుదేవుడి నుండి ఉద్భవించిన సంకర్షణుడిలో జ్ఞానము మరియు బలము అనే గుణాలు ఉంటాయి. సంకర్షణుడి నుండి ఉద్భవించిన ప్రద్యుమ్నుడిలో ఐశ్వర్యము మరియు వీర్యము (వీరత్వము) అనే గుణాలు ఉంటాయి. ప్రద్యుమ్నుడి నుండి ఉద్భవించిన అనిరుద్ధుడిలో శక్తి మరియు తేజస్సు అనే గుణాలు ఉంటాయి.
ఇలా ఈ రూపాలను ఆయా గుణాలకు అధిదేవతలుగా కీర్తిస్తూ పూజించడం పాంచరాత్రుల సంప్రదాయం.
;అవతార రూపం
వ్యూహ రూపం యొక్క సిద్ధాంతానికి దగ్గరగా ఉండేదే ఈ రూపం. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యూహ రూపంలో పేర్కొన్న నలుగురూ వేరు వేరు సమయాలలో అవతారాలుగా ఈ భూమిపైకి వస్తారు.
;అంతర్యామి రూపం
ఈ రూపం ప్రతీ మనిషిలోనూ ఉంటుందనేది నమ్మిక. ఈ నాలుగో రూపం ప్రతి మనిషిలోనూ అనిరుద్ధుడి ద్వారా నియంరించబడుతుంది. ఈ శక్తి ప్రతి ఒక్కరి హృదయంలో హృదయకమలంగా స్థాపించబడి ఉంటుంది. ఇది వ్యూహంలోని ఒక్కడయిన అనిరుద్ధుడే కానీ పరమాత్మ కాదన్నది పండితుల వాదన.
 
==మూలములు==
"https://te.wikipedia.org/wiki/పాంచరాత్రం" నుండి వెలికితీశారు