సెక్యులరిజం: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
పంక్తి 7:
సెక్యులరిజం అనే పదాన్ని మొదటిసారిగా బ్రిటిషు రచయిత 'జార్జి హోలియోక్' 1846 లో ఉపయోగించాడు.<ref>Feldman, Noah (2005). Divided by God. Farrar, Straus and Giroux, pg. 113</ref> ఈ పదము క్రొత్తదైననూ, 'స్వతంత్ర ఆలోచన' గా మరియు సాధారణ వ్యాఖ్యగా చరిత్రలో కానవస్తుంది. ప్రత్యేకంగా, తొలి సెక్యులర్ భావాలు [[తత్వము]] మరియు [[మతము]] ను విడిచేసి చూసే విధము, అవెర్రోజ్ (ఇబ్న్ రుష్ద్) తత్వములోను, అవెర్రోయిజం తాత్విక పాఠశాలలో కనబడుతుంది. <ref>Abdel Wahab El Messeri. [http://www.muslimphilosophy.com/tvtk/ch21.htm Episode 21: Ibn Rushd], ''Everything you wanted to know about Islam but was afraid to Ask'', ''Philosophia Islamica''.</ref><ref>Fauzi M. Najjar (Spring, 1996). [http://archive.is/20120629113116/findarticles.com/p/articles/mi_m2501/is_n2_v18/ai_18627295/pg_13 The debate on Islam and secularism in Egypt], ''Arab Studies Quarterly (ASQ)''.</ref> హోలియోక్ 'సెక్యులరిజం' అనే పదాన్ని సృష్టించి, మతమునుండి సమాజాన్ని వేరుచేసి, సమాజాభివృద్ధికొరకు తన సూచనలిచ్చాడు. దీనిలో మతాన్ని విమర్శించడము గాని, వ్యాఖ్యలు చేయడము గాని చేయలేదు. తనవాదనలో "సెక్యులరిజం, క్రైస్తవమతానికి వ్యతిరేకి కాదు, ఇదో స్వేచ్ఛాయుత ఆలోచన" అని అన్నాడు. ఇంకనూ "ఇది క్రైస్తవ మతాన్ని ప్రశ్నించదు, మతము యొక్క అస్థిత్వాన్ని, హేతువునూ ప్రశ్నించదు, సెక్యులరిజంలో వున్న జ్ఞానాన్ని ముందుపెడుతుంది మరియు ప్రోత్సహిస్తుంది" అన్నాడు. సామాజిక జీవితాలకు కావలసిన వనరులను చూపెడుతుంది, మరియు పలు మతాల వారికి సామాజిక స్థితిగతుల శాస్త్రాలను బోధిస్తుంది. <ref>[http://www.newadvent.org/cathen/13676a.htm ''Secularism''], Catholic Encyclopedia. Newadvent.org</ref>
 
==సెక్యులర్ రాజ్యము== (లౌకిక రాజ్యము)==
[[Image:Secularmap.PNG|thumb|280px|ప్రపంచ దేశాలు, అధికారికంగా 'సెక్యులర్' అయినవి నీలం రంగులో గలవు, రాజ్యపు మతం కలిగిన రాజ్యాలు ఎర్రని రంగులో వున్నవి.]]
రాజకీయ పదజాలంలో, లౌకిక వాదం (సెక్యులరిజం) అనునది, ప్రభుత్వాన్ని మరియు మతాన్ని వేరుగా వుంచడం. అటువంటి ప్రభుత్వాన్ని "మతప్రసక్తి లేని లౌకిక రాజ్యం" (లేదా సూక్ష్మంగా "లౌకిక రాజ్యం" అని) గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో రాజ్యము తన ప్రజలలో అనేక మతాలు కలిగివున్ననూ, ప్రభుత్వంలో ఏమతమూ కలిగి వుండక పోవడం. పౌరచట్టాలతో మత సంప్రదాయాలకు తావు లేకపోవడం, మతపరమైన తారతమ్యతలను తొలగించి మెజారిటీలు మరియు మైనారిటీలు (మతపరంగా) సమాన పౌరహక్కులు కలిగివుండేటట్లుగా సూత్రీకరించి రాజ్యాంగ వ్యవస్థను తయారుచేయడం. <ref>Feldman, Noah (2005). ''Divided by God''. Farrar, Straus and Giroux, pg. 14 ("[Legal secularists] claim that separating religion from the public, governmental sphere is necessary to ensure full inclusion of all citizens.")</ref>
"https://te.wikipedia.org/wiki/సెక్యులరిజం" నుండి వెలికితీశారు