"ఆత్మబలం (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
==కథ==
కుమార్ (జగ్గయ్య) ఒక ధనికుల కుమారుడు. అతను చిన్నప్పటినుండి తనకు కావలసినదానిని ఇతరులు పొందితే సహించలేని మనస్తత్వం కలిగినవాడు. వారి ఎస్టేటులో పని చేసే జయ అంటే అతనికి ఇష్టం. అయితే జయ ఆనంద్‌ (అక్కినేని నాగేశ్వరరావు)తో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని కుమార్ తను ఆత్మహత్య చేసుకొని ఆ నేరం ఆనంద్‌పైకి వచ్చేలా చేస్తాడు. ఫలితంగా ఆందుకు ఉరిశిక్ష పడుతుంది. ఒక మానసిక వైద్యుని (గుమ్మడి) సహాయంతో మరియు ఆత్మబలంతో జయ ఉరికంబందాకా వెళ్ళిన ఆనంద్‌ను కాపాడుకోవడం ఈ సినిమా కథ.
==సినిమా విశేషాలు==
 
నిర్మాతగా [[వి.బి. రాజేంద్రప్రసాద్‌]] కు ఇది రెండో విజయం. తనకు అండదండ, వెన్నూదన్నూ అనుకున్న ప్రధాన భాగస్వామి [[పర్వతనేని రంగారావు]] హఠాత్తుగా కాలం చేశారు. దాంతో మిగిలిన భాగస్వాములు కూడా ఎవరి దారిన వాళ్లు ళ్లిపోయారు.ఇప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఒంటరి. తన వాళ్లనుకున్నవాళ్లెవరూ అండగా లేరు. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి.వి.బి.రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నాడు. గుండెల నిండా త్మవిశ్వాసం నింపుకున్నాడు. మళ్లీ సినిమా మొదలుపెట్టాలి. ఉన్నపళంగా కథ కావాలి.
అప్పట్లో తెలుగు సినిమా వాళ్లందరికీ కలకత్తానే పెద్ద అడ్డా. బోలెడన్ని బెంగాలీ సినిమాలు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఉద్వేగాలు వాటిల్లో పుష్కలం. వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా కలకత్తా ప్రయాణం కట్టాడు. అప్పుడు అక్కడ ఉత్తమ్‌కుమార్ నటించిన ‘అగ్ని సంస్కార’ సినిమా ఆడుతోంది. ఈయనకు బాగా నచ్చేసింది. అప్పటికప్పుడు నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగారు.ఇప్పుడు దీన్ని అక్కినేనికి చూపించాలి. ఆయన చూడ్డానికి కొంచెం టైం పట్టింది. కానీ చూడగానే ‘ఓకే’ అనేశారాయన. ఇంకేముంది... ‘ఆత్మబలం’ సినిమా ప్రారంభం. వి.మధుసూదనరావు దర్శకుడు. [[కేవీ మహదేవన్]] సంగీతం. సి.నాగేశ్వర్రావు ఛాయాగ్రహణం. [[ఆత్రేయ]] మాటలూ పాటలూ. ప్రధాన నాయికగా[[బి.సరోజాదేవి]] ని ఎంచుకున్నారు. [[జగ్గయ్య]], [[కన్నాంబ]], [[రేలంగి]], [[రమణారెడ్డి]], [[గిరిజ]], [[సూర్యకాంతం]]... ఇలా హేమాహేమీలను మిగిలిన పాత్రలకు ఎన్నుకున్నారు.
==పాటలు==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/995689" నుండి వెలికితీశారు