తేనెటీగల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67:
* ఈ బుట్ట పైభాగంలో ఎక్కువ వెడల్పుగా కింద తక్కువ వెడల్పుగా వుంటుంది.
* పైభాగాన్ని ఒక్కొక్కటి 1.25 అంగుళాల వెడల్పు వుండే , సమాంతరంమైన కొయ్య పలకలతో కప్పుతారు. తేనెటీగలు బయటకు వెళ్ళలేని మూత మాదిరిగా, వీటిని దగ్గర దగ్గరగా అమర్చుతారు. ఈ కొయ్య పలకలు ఒక అంగుళం మేర లోపలివైపునకు వంపు తిరిగి వుంటాయి. ఈ వంపు పలక మధ్యన కేంద్రీకృతమవుతుంది. పలకల రెండు చివరలూ 2-3 అంగుళాల వరకు సమతలంగా వుండాలి. ఎందుకంటే, బుట్ట అంచుకంటె మందమైన ఈ పలకలు చివరలలో వంపుగావుంటే, ఆ సందులనుంచి తేనెటీగలు తప్పించుకునే అవకాశం వుంటుంది. దానిని నివారించడం కోసమే , ఇలా బుట్ట అంచుపై చక్కగా నిలవడానికి వీలుగా, పలకల చివరలను సమతలంగా వుంచుతారు.
* ప్రతి పలక పొడవునా , మధ్యలో కిందుగా ఒక మంచి తేనెతుట్టెను, కరిగించిన తేనె మైనంతో అతికించాలి. తేనెటీగలు ఆ కొయ్యపలక కిందుగా బుట్ట చివరివరకు మంచి తేనెపట్టును పెట్టడానికి ఇది వాటికి దారి చూపుతుందన్నమాట.
* ఈ బుట్టకు లోపలివైపు, వెలుపలివైపు రెండుభాగాలు ఆవుపేడ, ఒకభాగం బంకమన్ను కలిపిన మిశ్రమాన్ని పూయాలి. (2వ బొమ్మ చూడండి). ఈ మిశ్రమం పూత ఆరిన తర్వాత పలకలను బుట్ట పైన అమర్చి, గడ్డితో చేసిన కిరీటాకారపు టోపీతో కప్పాలి. ఎండ, వానలనుంచి తేనెటీగల బుట్టను ఇది కాపాడుతుంది. (3వ బొమ్మ చూడండి).
* బుట్టలోకి తేనెటీగలు వెళ్ళడానికి ఏర్పాటుచేసే ప్రవేశద్వారం బుట్ట అడుగునుంచి కనీసం మూడు అంగుళాలు ఎత్తులో వుండాలి. ఎందుకంటె, ఒకవేళ ఏదైనా తేనె తుట్టె కిందపడినా, ద్వారం మూసుకుపోకుండా వుండడానికి. (4వ బొమ్మ చూడండి).
* తేనె పట్టు తేనెతోనిండి, తేనె తీయడానికి సిద్ధంగా వుంటే, పలకలనుంచి తేనె పట్టులను జాగ్రత్తగా కోయాలి. అయితే, ప్రతి పలకకు పావు అంగుళాన్ని మించకుండా, మంచి తేనెపట్టు ముక్కను మిగిలించి, మిగతా దానిని కోయాలి. ఈ మిగిలిన చిన్న తేనెతుట్టె, తేనెటీగలను ఆకర్షించి, నేరుగా కొత్త తేనె పట్టు పెట్టే మార్గాన్ని సిద్ధంచేస్తుంది.
 
== వనరులు==
"https://te.wikipedia.org/wiki/తేనెటీగల_పెంపకం" నుండి వెలికితీశారు