తేనెటీగల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవులలో మకరందాన్ని [[తేనె]] గా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి. <ref>[http://te.pragatipedia.in/agriculture/c35c4dc2fc35c38c3ec2f-c35c4dc2fc35c38c3ec2fc47c24c30-c2ac30c3fc36c4dc30c2ec32c41/c24c47c28c46c1fc40c17c32-c2ac46c02c2ac15c02 ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
=='''ఆదాయమార్గంగా తేనెటీగల పెంపకం – ప్రయోజనాలు'''==
* తేనెటీగల పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం చాలు
* తేనెటీగల పెంపకానికి, మైనం తయారీకి వ్యవసాయపరంగా ఎలాంటి విలువలేని స్థలమైనా చాలు
పంక్తి 10:
* తేనెకు, మైనానికి మార్కెట్లో ఎంతో గిరాకీ వుంది.
 
=='''తేనెటీగల జాతులు'''<br />==
ఇండియాలో నాలుగు జాతుల తేనెటీగలు వున్నాయి. అవి
* రాక్ బీ (ఎపిస్ డార్సటా) ఇవి చాలా ఎక్కువ తేనె సేకరిస్తాయి. సగటున ఒక్కొక్క తేనె పట్టుకు 50 - 80 కిలోల తేనెను ఇవి సేకరిస్తాయి.
పంక్తి 18:
* కొండి లేని తేనెటీగ (ట్రిగొనా ఇరిడిపెన్నిస్) పైన పేర్కొన్న నాలుగు జాతులే కాకుండా కేరళలో కొండిలేని తేనెటీగ అనే మరో జాతి కూడా వుంది. అయితే నిజానికి వాటికి కొండి బొత్తిగా లేకపోలేదు కాని అది అంతగా పెరగదు. ఇవి పరాగ సంపర్కానికి బాగా తోడ్పడతాయి. సంవత్సరానికి 300 – 400 గ్రాములు తేనెను సేకరించగలవు.
 
=='''తయారీ విధానం'''<br />==
తేనెటీగలను పొలంలో లేదా ఇంటివద్ద పెట్టెలలో పెంచవచ్చు
 
పంక్తి 30:
* అగ్గి పెట్టె
 
=='''తేనె పెట్టెల ఏర్పాటు'''==
* తేనె పెట్టెలను తప్పని సరిగా, నీరు నిల్వన ప్రదేశంలో ఏర్పాటు చెయ్యాలి. మకరందం, పుప్పొడి, నీరు బాగా లభ్యమయ్యే పండ్ల తోటల సమీపంలో అయితే మరీ మంచిది.
* తేనె పెట్టెలో ఎప్పడూ అనువైన ఉష్ణోగ్రత వుండాలి. అందువల్ల, తేనె పెట్టెకు నేరుగా ఎండ తగలకుండా చూడాలి
పంక్తి 36:
* తేనెటీగల అరలను పశువులకు, జంతువులకు అందుబాటులో వుండకుండా చూడాలి జన సమ్మర్దమైన రోడ్లపక్కన, వీధి దీపాల దగ్గర వీటిని వుంచకూడదు.
 
=='''తేనె టీగల సముదాయాన్ని ఏర్పాటుచేయడం'''==
* అడవిలో తేనెటీగల గుడ్లు వున్న తేనెపట్టెనుతెచ్చి, తేనెపెట్టెలో పెట్టడం ద్వారానో తేనెపట్టె సమీపం నుంచి వెళ్ళే తేనెటీగల గుంపును తేనెపెట్టెలోకి ఆకర్షించడం ద్వారానో తేనెటీగల సముదాయాన్ని ఏర్పాటు చేయవచ్చు.
* తేనెటీగల గుడ్లునో, అటుగా వెళ్ళే తేనెటీగల గుంపునో ఆకర్షించడాని కంటె ముందుగా చేయవలసింది ఆ తేనెపెట్టెలో తేనెటీగలకు అలవాటైన వాసన వుండేలా చూడడం. కొన్ని పాత తేనెతుట్టె ముక్కలనో, కొద్దిపాటి తేనె మైనాన్నో తీసుకుని ఈ కొత్త తేనె పెట్టెకు బాగా రుద్దాలి. వీలైతే, గుంపుగా వెళ్ళే తేనెటీగల నుంచి రాణి ఈగను పట్టుకుని, తేనె పెట్టెలో అడుగున వుంచాలి. అప్పుడు ఇతర తేనెటీగలు అక్కడికి ఆకర్షితమవుతాయి.
పంక్తి 42:
* ఒక తేనె పెట్టెలో మరీ ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు వుండకుండా జాగ్రత్త వహించాలి.
 
=='''తేనె పెట్టె నిర్వహణ'''==
* తేనె పట్టులో తేనె నిండే రోజులలో కనీసం వారానికొకసారి తేనె పెట్టెలను పరిశీలించాలి. ఉదయం పూట అయితే మరీ మంచిది.
* ఈ వరసలో తేనె పెట్టెను శుభ్రం చేయాలి. పై భాగం, సూపర్ / సూపర్స్ ఛేంజర్, పిల్ల ఈగలు అరలు (బ్రూడ్ ఛేంజర్స్), అడుగు పలక (ప్లోర్ బోర్డు)
పంక్తి 56:
* పూర్తిగా లేదా మూడింట రెండు వంతులు తేనేతో నిండిన చట్రాలను బయటకు తీసి, తేనె పిండుకున్న తర్వాత తిరిగి సూపర్స్ లో పెట్టాలి.
 
=='''తేనె తీయడం'''==
* పొగపెట్టి ఈగలను పక్కకు మళ్ళించి, తేనె పట్టిన భాగాలను జాగ్రత్తగా కత్తిరించి, తేనెను తీయాలి.
* సాధారణంగా పూలు బాగాపూచే అక్టోబరు/ నవంబరు ఫిబ్రవరి / జూన్ సీజన్లలోను, ఆ తర్వాత కొద్దిరోజుల పాటు తేనె తీయడానికి అనువైన కాలం
పంక్తి 64:
గ్రీక్ బాస్కెట్ హైవ్ అనేది సాంప్రదాయికమైన పరిజ్ఞానం. కేవలం, స్థానికంగా లభ్యమయ్యే వస్తువులు, స్థానిక నైపుణ్యాలతో ఈ బుట్టతో తేనెటీగల పెంపకం సాగించ గలుగుతుండడంతో, ఇది ఇప్పటికీ అనువైన విధానమే.
 
=='''నిర్మాణం'''==
* ఈ బుట్ట పైభాగంలో ఎక్కువ వెడల్పుగా కింద తక్కువ వెడల్పుగా వుంటుంది.
* పైభాగాన్ని ఒక్కొక్కటి 1.25 అంగుళాల వెడల్పు వుండే , సమాంతరంమైన కొయ్య పలకలతో కప్పుతారు. తేనెటీగలు బయటకు వెళ్ళలేని మూత మాదిరిగా, వీటిని దగ్గర దగ్గరగా అమర్చుతారు. ఈ కొయ్య పలకలు ఒక అంగుళం మేర లోపలివైపునకు వంపు తిరిగి వుంటాయి. ఈ వంపు పలక మధ్యన కేంద్రీకృతమవుతుంది. పలకల రెండు చివరలూ 2-3 అంగుళాల వరకు సమతలంగా వుండాలి. ఎందుకంటే, బుట్ట అంచుకంటె మందమైన ఈ పలకలు చివరలలో వంపుగావుంటే, ఆ సందులనుంచి తేనెటీగలు తప్పించుకునే అవకాశం వుంటుంది. దానిని నివారించడం కోసమే , ఇలా బుట్ట అంచుపై చక్కగా నిలవడానికి వీలుగా, పలకల చివరలను సమతలంగా వుంచుతారు.
"https://te.wikipedia.org/wiki/తేనెటీగల_పెంపకం" నుండి వెలికితీశారు