బేతా సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: -పనిచేయని మూలాలు
పంక్తి 36:
'''సుధాకర్''' ప్రముఖ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత. ఇతడు ప్రధాన నటుడిగాను,హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.
==జీవిత విశేషాలు==
సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని [[మార్కాపురం]], తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా [[కోయిలకుంట్ల]]లో పుట్టాడు.<ref>http://www.telugulo.com/view_news.php?id=8215</ref> బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. [[ఏలూరు]] లో, మరియు [[గుంటూరు]]లలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు. తదనంతరం ప్రముఖ నటుడు [[చిరంజీవి]], హరిప్రసాద్ మరియు నారాయణమూర్తిలతో కలసి ఒకే గదిలో ఉన్నపుడు ఒకసారి అప్పటికి ఉప దర్శకుడిగా ఉన్న దర్శకుడు [[భారతీరాజా]] ను కలవడం ఆయన సుధాకరును ''కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్'' సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది, దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. ప్రముఖ నటి [[రాధిక]]తో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరుతెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది.<ref>http://www.idleburra.com/2006/02/interview-with-comedian-sudhakar.html</ref>
 
తెలుగులో ఇతడి మొదటి చిత్రము [[సృష్టి రహస్యాలు]]. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు [[ఊరికిచ్చిన మాట]], [[భోగి మంటలు]].
"https://te.wikipedia.org/wiki/బేతా_సుధాకర్" నుండి వెలికితీశారు