అగ్ని-4

భారత్ తయారు చేసిన మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి

అగ్ని క్షిపణుల శ్రేణిలో నాలుగోది అగ్ని-4. మొదట్లో దీన్ని అగ్ని-ప్రైమ్ అనేవారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఈ బాలిస్టిక్ క్షిపణి అనేక కొత్త సాంకేతికతలను ప్రదర్శించింది. క్షిపణి సాంకేతికతను కూడా ఎంతో మెరుగుపరచారు. ఈ క్షిపణి తక్కువ బరువుతో, రెండు ఘన ఇంధన చోదిత దశలతో, పేలోడు చుట్టూ పునఃప్రవేశ రక్షణ కవచంతో ఉంటుంది[4]  ఈ క్షిపణిలో మొదటిసారిగా కాంపోజిట్ రాకెట్ మోటారును వాడారు. అది చక్కటి పనితీరు కనబరచింది. ఈ క్షిపణి వ్యవస్థలో రిడండెన్సీతో కూడిన ఆధునిక ఏవియానిక్స్‌ను వాడారు. దీనితో ఇది మరింతగా విశ్వసనీయమైన పనితీరు కనబరచింది. దేశీయంగా తయారైన రింగ్ లేసర్ గైరోస్ ఆధారంగా తయారుచేసిన ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థ, మైక్రో నేవిగేషన్ వ్యవస్థలు రెంటినీ గైడెన్స్ మోడ్‌లో మొదటిసారిగా పనిచేయించారు. డిస్ట్రిబ్యూటెడ్ ఏవియానిక్స్ ఆర్కిటెక్చర్‌తో ఆన్‌బోర్డు కంప్యూటరు, హైస్పీడ్ రిలయబుల్ కమ్యూనికేషన్ బస్, పూర్తి డిజిటల్ కంట్రోల్ సిస్టములు కలిసి, క్షిపణిని లక్ష్యం దిశగా నియంత్రిస్తూ, దిశానిర్దేశం చేసాయి. క్షిపణి తన లక్ష్యాన్ని చాలా ఉన్నతమైన కచ్చితత్వంతో  ఛేదించింది. ఒరిస్సా తీరాన ఉన్న రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు క్షిపణి ప్రయాణాన్ని, దాని పరామితులనూ పర్యవేక్షించాయి. లక్ష్యానికి దగ్గరలో ఉంచిన  రెండు భారత నావికాదళ నౌకలు లక్ష్య ఛేదనను వీక్షించాయి.

అగ్ని-4
Agni IV missile being launched from Wheeler’s Island, Odisha.
రకంమధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంభారత్
సర్వీసు చరిత్ర
సర్వీసులో2014
వాడేవారుభారత సాయుధ బలగాలు
ఉత్పత్తి చరిత్ర
డిజైనరుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
తయారీదారుBharat Dynamics Limited
విశిష్టతలు
బరువు17,000 kilograms (37,000 lb)[1]
పొడవు20 metres (66 ft)[1]
వార్‌హెడ్Strategic nuclear (~15 kilotonnes (15,000 t) to ~250 kilotonnes (250,000 t)), conventional, Thermobaric

ఇంజనుTwo stage solid propellant engine
ఆపరేషను
పరిధి
4,000 km (2,500 mi)[2][3]
ఫ్లైటు ఎత్తు900 kilometres (560 mi)
గైడెన్స్
వ్యవస్థ
Ring Laser Gyro - INS (Inertial Navigation System), optionally augmented by GPS/IRNSS. Terminal guidance with possible radar scene correlation
లాంచి
ప్లాట్‌ఫారం
8 x 8 TELAR (Transporter erector launcher) Rail Mobile Launcher

DRDO డైరెక్టర్ జనరలైన డా. విజయ్ కుమార్ సరస్వత్ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించాడు. అగ్ని-4 ప్రయోగం విజయవంతం కావడంతో DRDO శాస్త్రవేత్తలను, ఉద్యోగులను, సాయుధ బలగాలనూ అతడు అభినందించాడు.  ఛీఫ్ కంట్రోలర్, (మిస్సైల్స్ అండ్ స్ట్రటీజిక్ సిస్టమ్స్), అగ్ని ప్రోగ్రాము డైరెక్టరూ అయిన అవినాష్ చందర్ ఆధునిక దీర్ఘ శ్రేణి నేవిగేషన్లో ఈ క్షిపణి విజయం ఒక కొత్త యుగం అని వ్యాఖ్యానించాడు. "ఈ విజయం త్వరలో రానున్న అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడానికి దోహదపడుతుంది” అని అన్నాడు.

అగ్ని-4 ప్రాజెక్టు డైరెక్టరు టెస్సీ థామస్, ఆమె బృందం క్షిపణి వ్యవస్థలను సమీకృతం చేసి విజయవంతంగా ప్రయోగించడంలో పాత్ర వహించారు. ఆమె మాట్లాడుతూ, 'క్షిపణి వ్యవస్థలో అవసరమైన అనేక వ్యవస్థలను DRDO తయారుచేసి ప్రదర్శించింది' అని చెప్పింది. వ్యూహాత్మక వార్‌హెడ్లను  మోసుకుపోగల ఈ క్షిపణిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసి వీలైనంత త్వరలో సాయుధ బలగాలకు అందజేస్తారు. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టరు  ఎస్.కె.రాయ్, DRDL డైరెక్టరు పి. వేణుగోపాలన్ , ASL డైరెక్టరు డా.వి.జి. శేఖరన్, ITR డైరెక్టరు ఎస్.పి. దాష్ క్షిపణి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. 

అభివృద్ధి మార్చు

దేశీయంగా తయారైన కాంపోజిట్ రాకెట్ మోటార్లు, రింగ్ లేసర్ గైరోస్ ఆధారంగా తయారుచేసిన ఇనర్షియల్ నేవిగేషన్ వ్యవస్థ, మైక్రో నేవిగేషన్ వ్యవస్థలు శక్తివంతమైన ఆన్‌బోర్డు కంప్యూటరు, డిజిటల్ కంట్రోల్ సిస్టము వంటి అనేక వ్యవస్థలను DRDO ఈ క్షిపణి ప్రయోగం పరీక్షించి, నిరూపించింది[4] అగ్ని-4 ఒక టన్ను బరువైన వార్‌హెడ్‌ను తీసుకుపోగలదు. పరిధి పెరిగే కొద్దీ విధ్వంసక కచ్చితత్వాన్ని కూడా పెంచుకునేలా దీన్ని డిజైను చేసారు. దీని  పొడవు 20 మీ., బరువు 17 టన్నులు. రోడ్డు మొబైలు లాంచరుతో దీన్ని ప్రయోగించవచ్చు.[5][6] బాలిస్టిక్ క్షిపణి నిరోధక వ్యవస్థలను తలదన్నేలా అగ్ని-4  క్షిపణిని మెరుగుపరచే ప్రయత్నాలు  జరుగుతున్నాయి. అగ్ని-4 యొక్క రాడార్ సంతకాన్ని విశేషంగా తగ్గించి, ప్రతిదాడుల నుండి  తట్టుకునేలా దాన్ని  తీర్చిదిద్దుతున్నారు.[7]

పరీక్ష మార్చు

ఐదేళ్ళ కాలంలో అగ్ని-4 కు చేసిన పరీక్షల్లో ఒకటి విఫలమైంది. నాలుగు విజయవంతమయ్యాయి..[8]

  • 2011 నవంబరు 15 న మొదటి విజయవంతమైన పరీక్ష చేసారు. వీలర్ ఐలండ్ నుండి రోడ్డు మొబైలు లాంచరు ద్వారా దీన్ని ప్రయోగించారు. నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి, 900 కి.మీ. ఎత్తుకు చేరింది. బంగాళాఖాతంలో అంతర్జాతీయ జలాల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. పరీక్షించ తలపెట్టిన అన్ని ధ్యేయాలనూ సాధించింది. పునఃప్రవేశ సమయంలో ఏర్పడిన 3,000 °C ఉష్ణోగ్రతలను తట్టుకుని అన్ని వ్యవస్థలూ చక్కగా పనిచేసాయి.[4] లోపే ఉండేలా చూసింది. 2014 చివర్లోగానీ,  2015 మొదట్లోగానీ క్షిపణి ఉత్పత్తి మొదలవుతుంది, వెంటనే వ్యూహాత్మక బలగాల కమాండుకు అందజేస్తారు.[9][10]
  • 2012 సెప్టెంబరు 19 న క్షిపణిని రెండోసారి విజయవంతంగా పరీక్షించారు. 4,000 కి.మీ. పూర్తి పరిధిని పరీక్షించారు.[11] వీలర్ ఐలండు నుండి, ఒక టన్ను పేలోడుతో రోడ్డు మొబైలు లాంచరు ద్వారా ప్రయోగించాక, అగ్ని-4 800 కి.మీ. ఎత్తుకు చేరి, ఆ తరువాత వాతావరణంలోకి పునఃప్రవేశం చేసింది. 3000 °C ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ, ప్రయోగించిన 20 నిముషాల తరువాత, హిందూ మహాసముద్రంలోని నిర్దేశిత లక్ష్యాన్ని అమోఘమైన కచ్చితత్వంతో ఛేదించింది..[2][12]
  • 2014 జనవరి 20: ఈసారి క్షిపణిని అసలైన ఆయుధాలు, రోడ్డు మొబైలు కాన్ఫిగరేషనుతో ప్రయోగించారు. వ్యూహాత్మక బలగాల కమాండు ఏ కాన్ఫిగరేషనునైతే వాడుతుందో, అదే కాన్ఫిగరేషనుతో ప్రయోగించారు. క్షిపణి 850 కి.మీ. ఎత్తుకు వెళ్ళి, 4,000 కి,మీ. దూరం ప్రయాణించి లక్ష్యానికి 100 మీ. దూరం లోపులో ఛేదించింది. పునఃప్రవేశ కవచం 3000 °C ఉష్ణోగ్రతలను తట్టుకుని క్షిపణి లోపల ఉన్న ఏవియానిక్స్ 50 °C
  • 2014 డిసెంబరు 2: వ్యూహాత్మక బలగాల కమాండు క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఇది మొట్టమొదటి వాడుకరి పరీక్ష, నాలుగో విజయవంతమైన పరీక్ష.[13] క్షిపణిని భారత సైన్యంలో మోహరించారు.[14]
  • 2015 నవంబరు 9: వ్యూహాత్మక బలగాల కమాండు మరోసారి వాడుకరి పరీక్ష విజయవంతంగా జరిపింది. క్షిపణి అన్ని పరామితులనూ చేరుకుందని DRDO తెలిపింది.[8][15]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Subramanian, T.S. (15 November 2011). "Agni - IV successfully test fired". The Hindu. Chennai, India. Retrieved 15 November 2011.
  2. 2.0 2.1 "India Test Fires Long Range Strategic Missile Agni-IV". The Outlook India. 19 September 2012. Archived from the original on 22 సెప్టెంబరు 2012. Retrieved 19 September 2012. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "India Test Fires Long Range Strategic Missile Agni-IV" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "Long range strategic missile Agni-IV test-fired". The Hindu. Chennai, India. 19 September 2012.
  4. 4.0 4.1 4.2 "Livefist: VIDEO: Today's Successful Agni-IV Test". Archived from the original on 2013-04-23. Retrieved 2016-11-09.
  5. "India test-fires nuclear-capable Agni-IV missile". Hindustan Times. 15 November 2011. Archived from the original on 16 నవంబరు 2011. Retrieved 15 November 2011.
  6. "India tests nuclear-capable surface-to-surface Agni-IV missile". The Times Of India. 15 November 2011. Archived from the original on 7 జూలై 2012. Retrieved 9 నవంబరు 2016.
  7. "Eyeing China, India to enter ICBM club in 3 months". The Times Of India. 17 November 2011. Archived from the original on 2012-04-19. Retrieved 2016-11-09.
  8. 8.0 8.1 "Ballistic missile Agni-IV test-fired as part of user trial". Times Of India. 9 November 2015. Retrieved 9 November 2015.
  9. Subramanian, T.S. (20 January 2014). "Agni-IV missile successfully test fired". The Hindu. Chennai, India. Retrieved 20 January 2014.
  10. "Agni-IV test successful, ready for induction". The Times of India. 21 January 2014. Retrieved 21 January 2014.
  11. "India test-fires nuclear-capable strategic missile Agni-IV". The Times of India. Balasore (Orissa), India. 19 September 2012. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 19 September 2012.
  12. "Long range strategic missile Agni-IV test-fired". The Hindu. Chennai, India. 19 September 2012. Retrieved 19 September 2012.
  13. "Agni-IV launch successful". The Hindu. 2 December 2014. Retrieved 2 December 2014.
  14. "India successfully tests nuclear capable Agni IV missile". The Hindu. 3 December 2014. Retrieved 1 February 2015.
  15. "Ballistic missile Agni-IV test-fired as part of user trial off Odisha coast". Times Of India. 9 November 2015. Retrieved 9 November 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=అగ్ని-4&oldid=3979690" నుండి వెలికితీశారు