అజ్ఞాతవాసి

2018 లో త్రివిక్రమ్ దర్శకత్వం లో విడుదల చేసిన చిత్రం

అజ్ఞాతవాసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 2018లో విడుదలైన సినిమా. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు.[1]

అజ్ఞాతవాసి
దర్శకత్వంత్రివిక్రమ్ శ్రీనివాస్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతఎస్. రాధాకృష్ణ
తారాగణం
ఛాయాగ్రహణంవి. మణికండన్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
హారిక & హాసినీ క్రియేషన్స్
విడుదల తేదీ
2018 జనవరి 10 (2018-01-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

హీరో తన తండ్రిని చంపిన వారిని తెలుసుకోటానికి తన సొంత కంపెనీలో ఉద్యోగిగా వస్తాడు. వాళ్ళని కనుగొని చంపటమే ఈ సినిమా కథ.

తారాగణం మార్చు

పవన్ కల్యాణ్ ఇందులో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిగా కనిపిస్తాడు. అతనికి మరదలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.

సంగీతం మార్చు

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఆడియో డిసెంబరు 19, 2017 న విడుదలైంది.

[2]బయటికొచ్చి చూస్తే, రచన: శ్రీమణి, గానం. అనిరుద్ రవిచందర్

గాలి వాలుగా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.అనిరుద్ రవిచందర్

ధగ ధగ మనే , రచన: శ్రీమణి, గానం . అనిరుద్ రవిచందర్

కొడకా కోటేశ్వర రావు, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. పవన్ కళ్యాణ్

ఎ బి ఎవరో నీ బేబీ , రచన: శ్రీమణి , గానం.నకాష అజీజ్, అర్జున్ చండీ

స్వాగతం కృష్ణా ,: రచన: ఊత్తుక్కడు శ్రీ వెంకట సుబ్బ ఐయేర్ కృతి , గానం.పద్మలతా , నిరంజన, రమణన్.

రికార్డులు మార్చు

యూనివర్సల్ స్టూడియోస్ లోని సిటీ వాక్ థియేటర్స్ లో ప్రదర్శించబడిన తొలి భారతీయ చిత్రంగా ఈ చిత్రం రికార్డును సృష్టించినది. [3]

వివాదాలు మార్చు

ఈ చిత్రం ఫ్రెంచి సినిమా లార్గో వించ్ నుండి కాపీ కొట్టబడినదని, అయితే ఫ్రెంచి సినిమా యొక్క నకలు హక్కులు T-Series సంస్థ అప్పటికే పొంది ఉన్నదని, ఈ చిత్రానికి చట్టపరమైన ఇబ్బందులు తప్పవని పుకార్లు షికార్లు చేసాయి. [4]

మూలాలు మార్చు

  1. న్యాయపతి, నీషిత. "Pawan Kalyan's clip from behind-the-scenes of 'Agnathavasi' goes viral". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 26 December 2017.
  2. "Live: Agnyaathavaasi audio launch". thehansindia.com. Retrieved 26 December 2017.
  3. యూనివర్సల్ స్టూడియోస్ లోని సిటీ వాక్ థియేటర్స్ లో ప్రదర్శించబడిన తొలి భారతీయ చిత్రం[permanent dead link]
  4. https://www.deccanchronicle.com/entertainment/tollywood/010118/agnyaathavaasi-lands-in-trouble.html