అడిక్‌మెట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతం ఉస్మానియా విశ్వవిద్యాలయంకి సమీపంలో ఉంది. అడిక్‌మెట్ లో నల్లకుంట నుండి తార్నాక వెళ్లే రహదారికి సమీపంలో ఆంజనేయ దేవాలయం ఉంది.

అడిక్‌మెట్
సంగీత్ నగర్ కాలనీ
సమీప ప్రాంతాలు
అడిక్‌మెట్ is located in Telangana
అడిక్‌మెట్
అడిక్‌మెట్
Location in Telangana, India
అడిక్‌మెట్ is located in India
అడిక్‌మెట్
అడిక్‌మెట్
అడిక్‌మెట్ (India)
Coordinates: 17°24′25″N 78°30′46″E / 17.40698°N 78.51284°E / 17.40698; 78.51284
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500044
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

కాలనీలు, బస్తీలు మార్చు

లలితానగర్‌ కాలనీ, బాలాజీ నగర్‌, గణేష్‌ నగర్‌, ఎస్‌ఆర్‌టీ కాలనీ, ఈస్ట్‌ పార్సిగుట్ట మున్సిపల్‌ కాలనీ, ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌, అడిక్‌మెట్‌, వడ్డెర బస్తీ, పోచమ్మ బస్తీ, అంజయ్యనగర్‌, రాంనగర్‌ రామాలయం వీధి, మేడిబావి బస్తీ, బహుద్దూర్‌ నగర్‌, దీన్‌దయాళ్‌ నగర్‌, రాంనగర్‌ గుండు, కట్టంబాయి అడిక్‌మెట్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ). సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన మార్చు

ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మించడానికి అడిక్‌మెట్‌ ప్రాంతంలో విశాలంగా వున్న 1600 ఎకరాల స్థలం ఇచ్చారు. 1934, జూలై5న నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆర్ట్స్‌ కాలేజీ భవనానికి పునాదిరాయి వేశారు. అదే సమయంలో ఆ ప్రాంగణంలోనే రేకులతో తాత్కాలిక గదులను నిర్మించి, అద్దె భవనాల్లో నడుస్తున్న తరగతులను అడిక్‌మెట్‌ క్యాంప్‌సలోకి తరలించారు. 1939, డిసెంబరు 04న ఆర్ట్స్‌ కళాశాల భవనాన్ని మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ చేతులమీదుగా ప్రారంభించారు.[1][2]

విద్య మార్చు

అడిక్‌మెట్ ప్రాంతంలోని పాఠశాలలు:

  1. నేతాజీ పబ్లిక్ స్కూల్
  2. జ్యోతి బాలమందిర్ హైస్కూల్
  3. శ్రీవిద్యా మోడల్ హైస్కూల్
  4. సెయింట్ జాన్స్ స్కూల్
  5. శకుంతల హైస్కూల్
  6. ఆర్య సమాజ్ హైస్కూల్
  7. సీతఫల్ మండి హైస్కూల్
  8. మదర్ మేరీ కేజీ అండ్ ప్రైమరీ స్కూల్
  9. అపోలోనియా హైస్కూల్
  10. మదర్ థెరీసాస్ హైస్కూల్
  11. రాంనగర్ హైస్కూల్
  12. వాణి హైస్కూల్

ప్రముఖ దేవాలయాలు మార్చు

  1. ఆంజనేయ దేవాలయం: ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ ఊరేగింపు జరుగుతుంది.[3]

మూలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి, ఎడ్యుకేషన్ (16 March 2017). "ఉస్మానియాకు వందనం". Retrieved 22 December 2017.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ, ఆదివారం (23 April 2017). "ఖండాంతరాన కీర్తి కిరీటం". Retrieved 22 December 2017.
  3. ఆంధ్రప్రభ, హైదరాబాద్ (6 April 2017). "అడిక్‌మెట్‌ : ఘనంగా శ్రీరామనవమి ఊరేగింపు". Retrieved 22 December 2017.[permanent dead link]