అఫ్జల్ ఉద్దౌలా - మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ (11 అక్టోబర్ 1827 - 26 ఫిబ్రవరి 1869) నాసిర్ ఉ ద్దౌలా కుమారుడు నిజాం పరిపాలకులలో ఐదవ అసఫ్ జా. ఇతడు హైదరాబాదును సా.శ. 1857 నుండి 1869 వరకు పరిపాలించెను.

అఫ్జల్ ఉద్దౌలా - మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ - అసఫ్ ఝా V'
GBE
Reignur'Nizam: 1827–1869
Titular Nizam:
Successorమహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్ జాహ్ VI
Houseఆసఫ్ జాహీ వంశం
మతంఇస్లాం

అసఫ్ జహ V హైదరాబాద్ రాబడి, న్యాయ వ్యవస్థలు సంస్కరించింది, ఒక పోస్టల్ సర్వీస్ రూపొందించినవారు, మొదటి రైలు, టెలిగ్రాఫ్ నెట్వర్క్లు నిర్మించారు.

సిపాయిల తిరుగుబాటు మార్చు

ఈతని పరిపాలన కాలంలోనే సిపాయిల తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లిం ప్రజలను రెచ్చగొడుతున్న అల్లాఉద్దీన్ మౌల్వీని బంధించి అండమాన్ దీవులకు పంపారు.

ఈ తిరుగుబాటు సమయంలో నిజాం, సాలార్ జంగ్లు కంపెనీకి పూర్తి సహకారం అందించి బ్రిటిష్ వారికి తోడ్పడినందుకు ప్రతిఫలంగా షోలాపూర్ను తిరిగి నిజాంకు స్వాధీనం చేశారు. నిజాం కంపెనీకి చెల్లించవలసిన 50 లక్షల రూపాయలు రద్దుచేశారు. బ్రిటిష్ వారు నిజాంకు "స్టార్ ఆఫ్ ఇండియా" అనే బిరుదును ఇచ్చి సత్కరించారు.

నిర్మాణాలు మార్చు

  1. అఫ్జల్ దర్వాజా: ఇది హైదరాబాదు సరిహద్దు గోడకు ఆఖరున 1861లో నిర్మించబడింది.[1]

మూలాలు మార్చు

  1. B., Nitin (4 September 2017). "Of darwazas and khidkis: Tracing the origins of the walled city of Hyderabad" (in ఇంగ్లీష్). Hyderabad. Retrieved 20 December 2019.

బయటి లింకులు మార్చు