అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

అమలా పాల్
2013 లో జరిగిన 60 వ సైమా పురస్కారాలలో అమలా పాల్
జననం (1991-10-26) 1991 అక్టోబరు 26 (వయసు 32)
కోచి, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుఅనఖ
వృత్తినటి, రూపదర్శి
క్రియాశీల సంవత్సరాలు2009 నుండి ఇప్పటివరకు
జీవిత భాగస్వామిఎ. ఎల్. విజయ్ (m. 2014; div. 2017)

నేపధ్యము మార్చు

ఈమె అసలు పేరు అనఖ . కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసింది.

నట జీవితము మార్చు

2009 లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో ప్రవేశానికై ఒక సంవత్సరము విరామము తీసుకొంది. ఈ సమయంలో ఈవిడ చాయాచిత్రాలు చూసిని ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తన చిత్రం నీల తామర లో ఒక చిన్న పాత్రకు ఈమెను ఎంచుకున్నాడు. ఆచిత్రం విజయవంతము కానప్పటికి, అందులో ఈవిడ నటన విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తరువాత తమిళ హాస్యచిత్రం వికడకవి లో ఒక పాత్రను పోషించింది. ఈ చిత్ర విడుదల బాగా ఆలస్యంగా జరిగి, ఈవిడ 6 వ చిత్రంగా విడుదలయ్యింది. ఈమధ్యలో వీర శేకరన్ , సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించింది. సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళిలో ఈమె పోషించిన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది. ఇందులో మావగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగీచే కోడలి పాత్రలో నటించింది. తరువాత మైనా చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఘనవిజయంతో అవకాశాలు వెల్లువెత్తాయి.

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2009 నీలతామర బీనా మలయాళం
2010 వీరశేఖరన్ సుగంధి తమిళం
సింధు సమవేలి సుందరి అనఖా గా ఘనత పొందారు
మైనా మైనా
2011 ఇది నమ్ముదే కథ ఐశ్వర్య మలయాళం
వికడకవి కవిత తమిళం
దైవ తిరుమగల్ శ్వేతా రాజేంద్రన్
బెజవాడ గీతాంజలి తెలుగు
2012 వెట్టై జయంతి తమిళం
కాదలిల్ సోదప్పువదు ఎప్పడి / లవ్ ఫెయిల్యూర్ పార్వతి తమిళం/తెలుగు తమిళం & తెలుగులో ద్విభాషా చిత్రం
ముప్పోజుదుమ్ ఉన్ కార్పనైగల్ చారులత (చారు / లత) తమిళం
ఆకాశతింటే నిరం పడుచు అమ్మాయి మలయాళం
రన్ బేబీ రన్ రేణుక
2013 నాయక్ నందిని తెలుగు
ఇద్దరమ్మాయిలతో కోమలి శంకరాభరణం
తలైవా ఏసీపీ మీరా నారాయణన్ తమిళం
ఓరు భారతీయ ప్రణయకధ ఐరీన్ గార్డనర్ మలయాళం
2014 నిమిరందు నిల్ పూమారి తమిళం
వేలైల్లా పట్టధారి డా. షాలిని
కథై తిరైకతై వసనం ఇయక్కమ్ ఆమెనే పొడిగించిన అతిధి పాత్ర
ఐయోబింటే పుస్తకం నర్తకి మలయాళం అతిధి పాత్ర
2015 మిలి మిల్లీ
జెండాపై కపిరాజు ఇందుమతి తెలుగు [1]
లైలా ఓ లైలా అంజలి మీనన్ (లైలా) మలయాళం
పసంగ 2 వెంబ తమిళ్ నాదన్ తమిళం తెలుగులో మేము
2016 2 పెంకుట్టికల్ అశ్వతి మలయాళం
అమ్మ కనక్కు శాంతి గోపాల్ తమిళం [2]
షాజహనుం పరీకుట్టియుమ్ జియా మలయాళం
2017 హెబ్బులి నందిని కన్నడ [3]
అచాయన్లు రీటా మలయాళం
వేలైల్లా పట్టధారి 2 డా. షాలినీ రఘువరన్ తమిళం
తిరుట్టు పాయలే 2 అగల్య సెల్వం
2018 భాస్కర్ ఓరు రాస్కెల్ అను
రాత్ససన్ విజయ "విజి" లక్ష్మి
2019 ఆడై కామిని / సుధంతిర కోడి తెలుగులో ఆమె
2021 కుట్టి స్టోరీ మృణాళిని విభాగం: "ఎదిర్పారా ముతం" [4]
పిట్ట కథలు మీరా తెలుగు విభాగం: "మీరా" [5][6]
2022 శవ డా. బధ్ర తంగవేల్ తమిళం నిర్మాత కూడా [7][8]
గురువు దేవిక మలయాళం [9]
2023 క్రిస్టోఫర్ సులేఖ [10]
భోలా డాక్టర్ స్వర హిందీ ప్రత్యేక ప్రదర్శన [11]
2024 ది గోట్ లైఫ్ సైను మలయాళం పోస్ట్ ప్రొడక్షన్ [12]
ద్విజ TBA చిత్రీకరణ [13]
లెవల్ క్రాస్ TBA పూర్తయింది [14]

వెబ్‌సిరీస్‌ మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2021 కుడి ఎడమైతే సీఐ దుర్గాగౌడ్ తెలుగు
2022 రంజిష్ హాయ్ సాహి అమ్నా పర్వేజ్ హిందీ
రాజు వూట్ల పార్టీ తమిళం
బాధితుడు: నెక్స్ట్ ఎవరు? అంజన తమిళం

వివాహం మార్చు

అమలా పాల్ 2014లో దర్శకుడు విజయ్‌తో వివాహం చేసుకొని 2017లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె నటుడు జగత్‌ దేశాయ్ ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది.[15][16]

మూలాలు మార్చు

  1. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
  2. "I modelled my role in 'Amma Kanakku' on my mother" : Amala Paul". 26 June 2016. Retrieved 26 June 2016.
  3. "Ravi Kishan with Sudeep and Amala Paul in Hebbuli!". The Times of India (in ఇంగ్లీష్). 24 January 2017. Retrieved 20 November 2021.
  4. "Vijay Sethupathi, Amala Paul part of upcoming Tamil anthology 'Kutti Love Story'". The News Minute. 2 February 2021. Retrieved 6 February 2021.
  5. "Amala Paul to star in Telugu remake of 'Lust Stories'". The News Minute. 9 October 2019. Retrieved 25 October 2019.[permanent dead link]
  6. "Amala Paul To Be A Part of Netflix's Telegu Original "Pitta Kathalu"". MT Critics.
  7. "Actor Amala Paul Announces Own Production House, Shares First Look of 'Cadaver'". News18 (in ఇంగ్లీష్). 27 October 2021. Retrieved 31 July 2022.
  8. "Cadaver trailer: Amala Paul plays police surgeon in this gory investigative thriller". The Indian Express (in ఇంగ్లీష్). 30 July 2022. Retrieved 31 July 2022.
  9. "Amala Paul's next 'Teacher' starts rolling". Times of India (in ఇంగ్లీష్). 16 February 2022. Retrieved 29 August 2022.
  10. "Amala Paul to play Sulekha in Mammootty's 'Christopher'". The Times of India (in ఇంగ్లీష్). 27 November 2022. Retrieved 2023-02-01.
  11. "Amala Paul starts shooting for Ajay Devgn's Bholaa in Varanasi". Bollywood Hungama (in ఇంగ్లీష్). 9 December 2022. Retrieved 10 November 2022.
  12. "Aadujeevitham will fully realize Amala Paul's potential, says director Blessy". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-02-22. Retrieved 2023-03-30.
  13. "First look poster of Amala Paul and Neeraj Madhav starrer 'Dvija' out". Telangana Today (in ఇంగ్లీష్). 2022-10-17. Retrieved 2023-01-10.
  14. "It's a wrap for Jeethu Joseph's film with Asif Ali and Amala Paul". Cinema Express (in ఇంగ్లీష్). 2023-04-18. Retrieved 2023-08-10.
  15. Eenadu (5 November 2023). "వైభవంగా అమలా పాల్‌ వివాహం.. ఫొటోలు షేర్‌ చేసిన వరుడు". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
  16. Prabha News (5 November 2023). "ప్రియుడుని పెళ్లాడిన నటి అమలా పాల్." Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అమలా_పాల్&oldid=4172883" నుండి వెలికితీశారు