అల్యూమినియం ఫ్లోరైడ్

అల్యూమినియం ఫ్లోరైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం.ఇది ఒక అకర్బన సంయోగపదార్ధం.ఈ సంయోగపదార్ధం రసాయన సంకేత పదం AlF3.అల్యూమినియం, ఫ్లోరిన్ మూలకపరమాణువుసంయోగం వలన అల్యూమినియం ఫ్లోరైడ్ ఏర్పడినది.అల్యూమినియం ఫ్లోరైడ్ ను సంశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేసినప్పటికీ, ప్రకృతిలో కూడా లభించును.అల్యూమినియం ఫ్లోరైడ్‌ను ఎక్కువగా అల్యూమినియం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగిస్తారు.

అల్యూమినియం ఫ్లోరైడ్
Aluminium trifluoride crystal structure
పేర్లు
ఇతర పేర్లు
అల్యూమినియం(III)ఫ్లోరైడ్
అల్యూమినియం ట్రైఫ్లోరైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7784-18-1]
పబ్ కెమ్ 2124
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:49464
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BD0725000
SMILES F[Al](F)F
ధర్మములు
AlF3
మోలార్ ద్రవ్యరాశి 83.9767 g/mol (anhydrous)
101.022 g/mol (monohydrate)
138.023 (trihydrate)
స్వరూపం white, crystalline solid
odorless
సాంద్రత 3.1 g/cm3 (anhydrous)
2.1 g/cm3 (monohydrate)
1.914 g/cm3 (trihydrate)
ద్రవీభవన స్థానం 1,291 °C (2,356 °F; 1,564 K) (anhydrous) (sublimes)
0.56 g/100 mL (0 °C)
0.67 g/100 mL (20 °C)
1.72 g/100 mL (100 °C)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Rhombohedral, hR24
R-3c, No. 167
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు -
S-పదబంధాలు -
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none
REL (Recommended)
2 mg/m3
IDLH (Immediate danger)
N.D.
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ధర్మాలు మార్చు

అల్యూమినియం ఫ్లోరైడ్ జలయోజిత/సార్ద్ర, అనార్ద్ర రూపాలలో లభ్యం.అల్యూమినియం ఫ్లోరైడ్ వాసనలేని తెల్లని స్పాటికాకార ఘనపదార్ధం. అనార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ అణుభారం 83.9767 గ్రాములు/మోల్. ఒక జలాణువు ఉన్న జలయోజిత/సార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ అణుభారం 101.022 గ్రాములు/మోల్. మూడు జలాణువులు trihydrate) ఉన్నసార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ అణుభారం138.023 గ్రాములు/మోల్.25 °C వద్ద అనార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ సాంద్రత 3.1 గ్రాములు/సెం.మీ3. ఒకజలాణువు (monohydrate) కలిగిన జలయోజిత/సార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ సాంద్రత 2.1 గ్రాములు/సెం.మీ3. అలాగేమూడు జలాణువులు కలిగిన జలయోజిత/సార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ సాంద్రత 1.914 గ్రాములు/సెం.మీ3. అనార్ద్ర అల్యూమినియం ఫ్లోరైడ్ ద్రవీభవన స్థానం 1,291 °C (2,356 °F;1,564K, ఈ ఉష్ణోగ్రత వద్ద ఈ సంయోగపదార్ధం ఉత్పతనం (sublimes) చెందును.అల్యూమినియం ఫ్లోరైడ్ నీటిలో చాలా స్వల్పప్రమాణంలో కరుగును. 100 °C నీటి ఉష్ణోగ్రతలో,100 మి.లీ లలో కేవలం 1.72 గ్రాముల అల్యూమినియం ఫ్లోరైడ్ కరుగును.

ఉత్పత్తి , లభ్యత మార్చు

అల్యూమినియం ఫ్లోరైడ్ ను ఎక్కువగా, అధిక ప్రమాణంలో ఉత్పత్తికై అల్యూమిన (అల్యూమినియం ఆక్సైడ్) ను హెక్సాఫ్లోరోసిలిసిక్ ఆమ్లంతో చర్య జరపడంద్వారా ఉత్పత్తిచేసెదరు.

H2SiF6 + Al2O3 → 2 AlF3 + SiO2 + H2O

మరో ప్రత్యామ్నాయపధ్ధతిలో అమ్మోనియం ఫ్లోరోఅల్యుమినేట్‌ను ఉష్ణవియోగం (thermal decomposition) కావించడం ద్వారా కూడా అల్యూమినియం ఫ్లోరైడ్‌ను ఉత్పత్తి చేసెదరు.[1] తక్కువ ప్రమాణంలో ప్రయోగశాలల్లో అల్యూమినియం హైడ్రాక్సైడ్‌ను లేదా లోహ అల్యూమినియాన్ని హైడ్రోజన్ ఫ్లోరైడ్ (HF) తో రసాయనికచర్య వలన ఉత్పత్తి కావింతురు.

మూడు జలాణువులున్నసార్ద్రఅల్యూమినియం ఫ్లోరైడ్ ప్రకృతిలో రోసేన్బెర్గిటే (rosenbergite) ఖనిజరూపంలో లభ్యం.

నిర్మాణం మార్చు

అల్యూమినియం ఫ్లోరైడ్ అణుసౌష్టవం రేనియం ట్రైఆక్సైడ్ నిర్మాణముతో, రూప వికృతి పొందిన అల్యూమినియం హెక్సాఫ్లోరైడ్ అణువువలె షట్భుజాకృతి కలిగిఉండును. ప్రతి ఫ్లోరైడ్ రెండు అల్యూమినియం కేంద్రాలతో సంబంధం కలిగి ఉండును.దీనియొక్క త్రిమితీయ పాలిమెరిక్ నిర్మాణం వలన అల్యూమినియం ఫ్లోరైడ్ ఎక్కువ/అధిక ద్రవీభవన స్థానం కల్గిఉన్నది.అల్యూమినియం యొక్క మిగిలిన మూడు ఘనస్థితిలోని హలినాయిడ్ సమ్మేళనాలు అల్యూమినియం ఫ్లోరైడ్ తో విభేదించును. అల్యూమినియం క్లోరైడ్ (AlCl3) లేయర్/పొర నిర్మాణం కలిగి ఉండగా, అల్యూమినియం బ్రోమైడ్ (AlBr3), అల్యూమినియం అయోడైడ్ (AlI3) లు అణు ద్వణుకాలు (dimers).[2] అంతేకాకుండా తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత కలిగి, త్వరగా బాష్పీకరణచెంది ద్వణుకాలుగా ఏర్పడును[3].వాయు స్థితిలో అల్యూమినియం ఫ్లోరైడ్ త్రికోణ నిర్మాణంతో D3h అణునిర్మాణాన్ని కల్గిఉన్నది.వాయు స్థితిలోని అణువులోని అల్యూమినియం-ఫ్లోరిన్ పరమాణువుల బంధ పొడవు 163 pm.

ఉపయోగాలు మార్చు

  • విద్యుద్విశ్లేషణ విధానంలో అల్యూమినియం ఉత్పత్తి చెయ్యుటకు క్రయోలైట్ తోపాటు అల్యూమినియం ఫ్లోరైడును క్రియాజనాకలలో చేర్చెదరు. ఇది ద్రవీభవన ఉష్ణోగ్రతను 1000 °C కన్న తక్కువ స్థాయికి తగ్గిస్తుంది., ద్రవ వాహకత్వాన్ని పెంచును.
  • ఫ్లోరోఅల్యుమినేట్ గాజు తయారు చేయుటకు జిర్కోనియం ఫ్లోరైడ్‌తో పాటు అల్యూమినియం ఫ్లోరైడ్ ను వాడెదరు.
  • పులియుటను (కిణ్వన ప్రక్రియ) నివారించుటకు, లేదా నిరోదినిగా అల్యూమినియం ఫ్లోరైడ్ ను ఉపయోగిస్తారు.

రక్షణ-అరోగ్యభద్రత మార్చు

అల్యూమినియం యొక్క కనిష్ఠ విషప్రభావ ప్రమాదకరమితి (Iethaldose) 600 మి.గ్రా/కిలో

ఇవికూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు/ఆధారాలు మార్చు

  1. J. Aigueperse, P. Mollard, D. Devilliers, M. Chemla, R. Faron, R. Romano, J. P. Cuer, "Fluorine Compounds, Inorganic" in Ullmann’s Encyclopedia of Industrial Chemistry, Wiley-VCH, Weinheim, 2005.doi:10.1002/14356007.a11_307
  2. Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. ISBN 0080379419.
  3. Holleman, A. F.; Wiberg, E. "Inorganic Chemistry" Academic Press: San Diego, 2001. ISBN 0-12-352651-5.