అవేకళ్లు 1967లో త్రిలోక్ చందర్ దర్శకత్వంలో విడుదలైన ఉత్కంఠభరిత చిత్రం. కృష్ణ, కాంచన ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎవిఎం సంస్థ నిర్మించింది. పూర్తి స్థాయి రంగుల్లో విడుదలైన తొలి క్రైం చిత్రం ఇది. తెలుగులో వచ్చిన క్రైం థ్రిల్లర్ల జాబితాలో మొదటి వరుసలో ఉంటుందీ సినిమా.[1] సంగీత పరంగా మంచి విజయాన్ని సాధించింది.

అవేకళ్లు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.సి.త్రిలోకచందర్
నిర్మాణం ఎ.వి.మెయ్యప్పన్
కథ ఎ.సి.త్రిలోక్‌చందర్
తారాగణం కృష్ణ,
కాంచన,
పద్మనాభం,
రమణారెడ్డి,
సురేంద్రనాధ్,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రాజనాల,
రామదాసు,
రామచంద్రరావు,
టైపిస్ట్ గోపు,
ఆనందమోహన్,
నాగభూషణం,
గీతాంజలి,
పుష్పకుమారి,
వెన్నెరాడై నిర్మల,
కనకం,
విజయశ్రీ,
రేణుక,
సాధన,
లక్ష్మి
సంగీతం వేదపాల్ వర్మ (వేదా)
నేపథ్య గానం పి.సుశీల,
పిఠాపురం నాగేశ్వరరావు,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన దాశరథి,
కొసరాజు
నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్
విడుదల తేదీ డిసెంబర్ 14, 1967
నిడివి 150 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

విశేషాలు మార్చు

తెలుగులో కలర్లో విడుదలైన తొలి హారర్, సస్పెన్స్ సినిమా ఇది.[2][3] ఈ సినిమా తొలుత అంతగా విజయవంతం కానప్పటికీ ఆ తరువాత విడుదలలో బాగా ఆడి డబ్బు వసూలు చేసుకున్నది. ఈ సినిమాను ఏ.వి.ఎం వారు ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తమిళంలో సినిమా పేరు అదే కణగళ్. తమిళ సినిమాలో రవిచంద్రన్ కృష్ణ పాత్ర పోషిస్తే, పద్మనాభం పాత్రను నగేష్ పోషించాడు. కాంచన, గీతాంజలి రెండు భాషల్లోనూ నటించారు. సినిమాలో డుం డుం గంగిరెద్దు దాసరోడొచ్చాడు, మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భలే భయమన్నది వంటి చిరకాలం నిలచిన హిట్ పాటలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణ సమయంలో కాంచన కృష్ణను డ్యాన్సులో ఎంతో ప్రోత్సహించింది. కనకం గీతాంజలి తల్లి పాత్ర పోషిస్తుంది. పద్మనాభం, గీతాంజలులకు పెద్దగా కథలో స్థానం లేకపోయినా మధ్య మధ్యలో హాస్య సన్నివేశాలలో కనిపిస్తారు.

పాటలు మార్చు

  1. చక్కని పార్కుఉండి పక్కన పడుచు - పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.ఆర్. ఈశ్వరి
  2. చెలిని చెంతకు పిలుచుకొ - ఎల్. ఆర్. ఈశ్వరి
  3. డండండం గంగిరెద్దు దాసరొచ్చాడు డు డు డూ బసవన్నను తోలుకొచ్చాడు- పి.సుశీల బృందం
  4. ఎవరు నీ వారు తెలుసుకో లేవు - ఘంటసాల బృందం . రచన: దాశరథి.
  5. మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమంది - ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం బృందం (రచన: కొసరాజు)
  6. ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది - ఘంటసాల, పి.సుశీల . రచన: దాశరథి
  7. ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయంలో లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో - (రచన: దాశరథి) - ఘంటసాల, పి.సుశీల బృందం
  8. ఓ ప్రియతమా నీదానరా వేయి జన్మలుగా వేచితి నీకోసం వేగమె రావేలా- పి.సుశీల

మూలాలు మార్చు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  1. "Ave Kallu: సూపర్‌స్టార్‌ కృష్ణ 'అవేకళ్లు'.. 55 ఏళ్లు". EENADU. Retrieved 2023-03-30.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-04. Retrieved 2009-05-02.
  3. Eenadu. "'అవేకళ్లు'.. 52ఏళ్లు.. - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Retrieved 2019-12-15.
"https://te.wikipedia.org/w/index.php?title=అవేకళ్లు&oldid=3953564" నుండి వెలికితీశారు