"యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం.

వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం ఆమెది. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఉన్నారు.

మధ్యలో కొన్ని మూఢ నమ్మకాలు, చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. ఇంకా ఎన్నో నిర్బంధాలు. ఈ విధంగా సంకెళ్ళలో చిక్కుకున్న అతివ అబల అన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేయడం వరకే అని హద్దులు గీచారు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైయ్యారు. అనేకమైన దురాచారాలకు బలిపశువులయ్యారు. కొన్నాళ్ళు కన్యాశుల్కం సమస్య పీడించింది. వరకట్నం యిబ్బంది పెడుతోంది. అయితే క్రమంగా మళ్ళీ ఆడవాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారు. ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు.

దేశానికి ప్రధానమంత్రులయ్యారు, అవుతున్నారు.దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్నో రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి - " లేచింది మహిళా లోకం - నిద్ర చేచింది మహిళా లోకం - దద్దరిల్లింది పురుష ప్రపంచం" అన్నాడు. అంతకు ముందే ఇంకో పాత కవి "ముదితల్ నేర్వగరాని విద్య కలదే? ముద్దార నేర్పించినన్" అన్నాడు.

అటువంటి మహిళలను అంతా మెచ్చుకోవలసిందే, ఆచరించవలసినదే. అటువంటి మెచ్చుకోతగ్గ మహిళలు కొంతమందిని ఈ దిగువనుదహరించటం జరిగింది.

ఈ మహిళల చరిత్రలు మరింతమందికి మరింత ప్రేరణ కలిగిస్తాయి అనుటలో సందేహం లేదు.ముఖ్యంగా మహిళలు మరింత ఉత్తేజాన్ని పొందాలి. అప్పుడే తల్లి ఋణం తీర్చుకున్న తృప్తి కలుగుతుంది. ఈ ఆదర్శ మహిళలను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరు విజయపథం వైపు పయనించాలి.ఆడవాళ్ళు చదువుకుంటే ఎన్ని అధ్బుతాలు చేయవచ్చు.! మగవాడి చదువు అతనికే పరిమితం కానీ ఆడవాళ్ళ చదువు ఇంటింటి వెలుగు!

వేదకాలంనాటి అతివలు మార్చు

వేదకాలం నాటి వనితలు:వేదకాలంలో ఋషులు మాత్రమే మంత్రాలు చెప్పలేదు. కొందరు మహిళలు కూడా మంత్రాలు చెప్పారు. అటువంటివారిని ద్రష్టలు అంటారు. వేదద్రష్టలు మంత్ర దర్శినులు అయిన మహిళలు ఇరవై నాలుగు మందికి పైగా ఉన్నారు. గోధ ఘోష, విశ్వపార, వేష, మాతృకర్షక, బ్రహిజాయ, రోమక, జుహు, నామ, అగస్త్య, నృపాదితి, శశ్వతి, లోపాముద్ర, వాక్, శ్రద్ధ, మేధ, సూర్య, మాంధాత్రి, సావిత్రి మొదలయినవి వారి పేర్లు.

  • గార్గి పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షితో వాద ప్రతివాదాలు చేసిన మహామనీషి ఆనాడూ, ఈనాడూ ఉపనయనం చేసుకోవటం పురుషులకే పరిమితం. అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది. జందెం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది. మిధిలా నగర రాజైన జనకుని సభలో ఆస్థాన పండితురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి మాట్లాడింది. యాజ్ఞవల్క్యుని ముప్పుతిప్పలు పెట్టింది. పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసిపోరని ఋజువు చేసింది. ఆది శంకరాచార్యులనూ ఇలాగే ఓ వనిత ఓడించింది. గార్గి కథ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది.
  • మైత్రేయి యాజ్ఞవల్క్యుని భార్య. గార్గితో సమానమైన పండితురాలు. జనకుని ఆస్థానానికి వెళ్ళలేదు అయినా భర్త ద్వారా అన్నీ తెలుసుకుంది. కొన్ని సందర్భాలలో భర్తకు సలహాలనిచ్చేది. ఆదర్శ మహిళగా పేరు పొందింది.
  • ఘోష ఎక్కువ మంత్రాలు చెప్పిన వనిత. ఈమె తాత దీర్ఘతముడు అనే మహర్షి. తండ్రి కాక్షీవతుడు ఇద్దరూ వైద్య నిపుణులు. చిన్నతనంలో ఈమెకు తెల్ల కుష్టురోగం వచ్చింది. బాధపడింది. అశ్వికుల దయవల్ల, ఆరోగ్యం పొందింది. ఇంకా ఖేలుని భార్య నిష్పల, ముద్గరుని భార్య - వారిద్దరూ యుద్ధ విద్యలలో ఆరితేరినవారు. ఇక రెండవ పులకేశి కోడలు విజ్ఞిక సంస్కృత భాషలో తొలి కవయిత్రి.

అలనాటి తెలుగు వనితలు మార్చు

రుద్రమదేవి మార్చు

 
రుద్రమదేవి

కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వీరవనిత. మహారాణి, విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఈమెను చాలా మెచ్చుకున్నాడు. ఈమె ప్రజలను కన్న బిడ్డల్లాగ పరిపాలించింది. వారికి ఏ లోటూ లేకుండా కాపాడింది. మనం గర్వంగా చెప్పుకోదగ్గ మహిళా రత్నం రాణీ రుద్రమదేవి.

ఆతుకూరి మొల్ల మార్చు

ఈమెనే కుమ్మరి మొల్ల అంటారు. ఈమె మొల్ల రామాయణం అనే గ్రంథం రచించింది. ఆనాటి కాలంలో ఏకైక రచయిత్రి, పదహారవ శతాబ్దంలో ఈమె జీవించింది. తండ్రి కేతన కుమ్మరి పని చేసేవాడు. ఏదైనా ఒక కళను నేర్చుకోవడానికి కులం మొదలైనవి అడ్డం రావని నిరూపించించిన మహిళ మొల్ల. ఈమెను కృష్ణదేవరాయలు సన్మానించాడు.

గంగా దేవి మార్చు

ఈమె బుక్కరాయల కోడలు. మధురా విజయం అనే గ్రంథాన్ని రచించింది. మంచి కవయిత్రిగా పేరు తెచ్చుకుంది.

అవంతి సుందరి మార్చు

తొమ్మిదవ శతాబ్దం చివరి కాలంలో ఉంది. అలంకార శాస్త్రం రచించింది.

తరిగొండ వెంగమాంబ మార్చు

మంచి కవయిత్రి, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. చిన్నతనం నుండి ఈమెకు దైవభక్తి ఎక్కువ. బాల్యంలోనే వితంతువు అయింది. అయినా ఆ నాటి ఆచారాలను పాటించలేదు. ఆనాడు భర్త చనిపోతే భార్యకు గుండు గీయించేవారు. ఆ ఆచారాన్ని కాదని ఎదిరించి నిలిచింది. ఈమె సహజ పండితురాలు. "వేంకటాచల మాహాత్మ్యం" అనే గ్రంథాన్ని రచించింది.

తాళ్ళపాక తిమ్మక్క మార్చు

తాళ్ళపాక అన్నమాచార్యుడు ధర్మ పత్ని తాళ్ళపాక తిమ్మక్క. ఈమె "సుభద్రా కళ్యాణం" అనే కావ్యాన్ని ద్విపదగా రాసింది. అంటే రెందు పాదాలున్న పద్యం.

దార్ల సుందరీ మణి మార్చు

ఈమె శతకాన్ని రచించింది. దాని పేరు "భావలింగ శతకం" . వేమన లాగా ఆటవెలదిలో పద్యాలు రాసింది.

ముద్దు పళని మార్చు

పురుషులతో సమానంగా శృంగారం రాయాలంటే ఆడవాళ్ళూ రాయగలరు అని నిరూపించింది. తొలి మహిళా కవయిత్రి. "రాధికా స్వాంతనం" అనే గ్రంథాన్ని రాసింది.

రంగాజమ్మ మార్చు

ఒకనాడు తంజావూరును తెలుగు రాజులు పరిపాలించేవారు. వారిలో గొప్ప వాడుగా పేరు తెచ్చుకున్నవాడు విజయరాఘవుడు. ఈతని వాణీ విలాస మందిరంలో నాట్యకత్తెగా పేరు తెచ్చుకున్న మహిళ రంగాజమ్మ. ఈమె చక్కని కవయిత్రి. అతిలోక సౌందర్యవతి. చాలా లౌక్యురాలు. రాజనీతి తెలిసినది, "విజయ రాఘవం" కథనీ "మున్నూరుదాస విలాసం" అన్న గ్రంథం రాసింది. ఆనాడు కనకాభిషేకం పొందిన ఏకైక కవయిత్రి.

బ్రిటీష్ పాలనను వ్యతిరేకించిన తెలుగు మహిళలు, ఇతరులు మార్చు

మహిళా దినోత్సవం మార్చి 8 వ తారీఖున ఆంగ్లవీకీలో 8,9,10 తేదీలలో అంతర్జాతీయ ఖ్యాతి చెందిన మహిళా వ్యాసాలను అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు. తెవికీ సభ్యులు అలా వ్యాసాలు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా ఈ క్రింది జాబితా తయారు చెయ్యబడింది.[1] కుతూహలం ఉన్న సభ్యులు ఇందులో పాల్గొని మార్చి 8,9,10 తేదీలలో మహిళా వ్యాసాల అభివృద్ధికి కృషి చేయవచ్చు. ఈ క్రింది వ్యాసాలే కాక మీకు తోచిన వ్యాసాలు జాబితాలో చేర్చవచ్చు. అలాగే అభివృద్ధి చేయవచ్చు.

ఇతర భారత నారీమణులు మార్చు

 
ఝాన్సీ లక్ష్మీబాయి

ప్రధానులైన మహిళలు మార్చు

 
ఇందిరాగాంధీ

సేవారంగంలో ప్రకాశించిన మహిళలు మార్చు

 
మేధాపాట్కర్

రాష్ట్రపతులైన మహిళలు మార్చు

మన దేశమే అనుకున్న విదేశీమహిళలు మార్చు

 
మదర్ థేరిసా

ఇతర రంగాలలో కృషి చేసిన విదేశీ వనితలు మార్చు

 
కల్పనా చావ్లా

కళా రంగం మార్చు

 
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి

ఆధ్యాత్మిక రంగం మార్చు

క్రీడారంగం మార్చు

చలనచిత్ర రంగం, బుల్లితెర రంగం మార్చు

వాణిజ్య, పారిశ్రామిక రంగం మార్చు

శాస్త్ర, సాంకేతిక రంగం మార్చు

రాజకీయ రంగం మార్చు

ఇతర రంగాలు మార్చు

కవయిత్రులు మార్చు

ఈ వ్యాసాల కోసం వర్గం:తెలుగు కవయిత్రులు, వర్గం:భారతీయ కవయిత్రులు చూడండి.

అంతర్జాతీయ ఖ్యాతి వహించిన మహిళలు మార్చు

మూలాలు మార్చు

  1. "Ideal Person - Baaru Alliveluamma|| Rajahmundry|| Rajamahendravaram". web.archive.org. 2013-06-30. Archived from the original on 2013-06-30. Retrieved 2021-09-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు మార్చు