ఆదాల ప్రభాకర రెడ్డి

అదల ప్రభాకర రెడ్డి ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నుండి భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభకు ఆయన ఎన్నికయ్యాడు. [1]

ఆదాల ప్రభాకర రెడ్డి
ఆదాల ప్రభాకర రెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు మేకపాటి రాజమోహన రెడ్డి
నియోజకవర్గం నెల్లూరు

పదవీ కాలం
1999 – 2004
ముందు జక్కా వెంకయ్య
తరువాత కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి
నియోజకవర్గం అల్లూరు
పదవీ కాలం
2004 – 2014
ముందు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
తరువాత కాకాని గోవర్ధనరెడ్డి
నియోజకవర్గం సర్వేపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1948-10-25) 1948 అక్టోబరు 25 (వయసు 75)
మోపూరు (ఉత్తర),నెల్లూరు జిల్లా, మద్రాసు రాష్ట్రము
(ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు *తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి ఆదాల వింధ్యావళి
సంతానం 2
మూలం [1]

జీవిత విశేషాలు మార్చు

ఆదాల ప్రభాకర రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఉత్తర మోపూర్ లో 1948 అక్టోబరు 25న ఆదాల శంకరరెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించాడు. అతను 1974 మార్చి 9న వింధ్యావళిని వివాహమాడాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు.[2] 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 50829 ఓట్లు సాధించి కాటం రెడ్డి విష్ణువర్థనరెడ్ది పై విజయం సాధించాడు.[3] 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పై గెలుపొందాడు.[4] 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పై రెండవసారి విజయం సాధించాడు.[5]

నిర్వహించిన పదవులు మార్చు

  • 1999-2014 - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడు (మూడు సార్లు)
  • 1999-2000 - ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖామాత్యులు.
  • 2002 - 2004 - చైర్‌పర్సన్, అస్యూరెన్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ శాసససభ.
  • 2002 - 2014 - చైర్‌పర్సన్, పబ్లిక్ అండర్ టేకింగ్స్, ఆంధ్రప్రదేశ్ శాసససభ.
  • మే 2019 - 17వ లోక్‌సభ సభ్యుడు.
  • 2019 సెప్టెంబరు 2019 నుండి - పట్టణాభివృద్ధి స్టాండిగ్ కమిటీ సభ్యుడు.

రాజకీయ జీవితం మార్చు

అతను ఆంతకు పూర్వం తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2019 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీలో టికెట్ ఖరారు అయిన తర్వాత వైసీపీలోకి పార్టీ మారిపోయాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన 126 మంది ఎమ్మెల్యేల జాబితాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని అభ్యర్థిగా ప్రకటించాడు. అయితే, ఇది జరిగిన మూడు రోజులకే ఆయన వైసీపీలో చేరిపోయాడు. అతను ని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందాడు.[6]

మూలాలు మార్చు

  1. "Nellore Election Results 2019". Times Now. 23 May 2019. Retrieved 25 May 2019.
  2. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2020-01-17.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1999". www.elections.in. Archived from the original on 2021-01-20. Retrieved 2020-01-17.
  4. "Andhra Pradesh Assembly Election Results in 2004". www.elections.in. Archived from the original on 2022-05-20. Retrieved 2020-01-17.
  5. "Andhra Pradesh Legislative Assembly". web.archive.org. 2008-03-14. Archived from the original on 2008-03-14. Retrieved 2020-01-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "మొన్న టీడీపీ టికెట్ ఖరారు.. ఇవాళ వైసీపీ కండువా వేసుకున్న నేత". News18 Telugu. 2019-03-16. Retrieved 2020-01-17.