ఆది పరాశక్తి[1][2] హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది.

ఆది పరాశక్తి
అమ్మవారు
సంస్కృత అనువాదంఆది పరాశక్తి
అనుబంధందేవీ మాత, పరబ్రహ్మ, విశ్వ మాత
నివాసంమేరు పర్వతం, కైలాస పర్వతం , వైకుంఠం
మంత్రంఐం హ్రీం క్లీం
ఆయుధములుసకల ఆయుధములు
అవతారాలుసతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి
తండ్రిసతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి
తల్లిసతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి
రాజవంశంసతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి
తరువాతి వారుసతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి
అంతకు ముందు వారుసతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి
సాక్షాత్ పరమశివుని స్త్రీ రూపమే శక్తి

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి.[3] ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి. దుర్గా దేవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము.[4] అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది.[5]

హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.

సృష్టికే కాక, సకల మార్పులకీ కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం.

శక్తి ఆరాధన లోనూ శైవము లోనూ ఆది పరాశక్తి సర్వశక్తిమంతురాలిగా పూజించబడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతోంది.gy

వ్యుత్పత్తి మార్చు

 
దేవత ఆది శక్తి ఉత్తర అమెరికాలో పరాశక్తి ఆలయం వద్ద దేవతగా ఉంది. మంత్రం: - ఐం హ్రీం క్లీం ఆయుధం:- అన్ని ఆయుధాలు. దేవేరి: - శివ

ఆది పరాశక్తి అనగా నిత్య, అపరిమిత శక్తి. ఇది ఈ సృష్టిని మించిన శక్తి. యావత్ సృష్టి యొక్క పుట్టుకకి, వినాశనానికి కారకమైన క్రియాత్మక అదృశ్య శక్తి.

శ్వేతాశ్వతరోపనిషత్తు లో వర్ణన మార్చు

శ్వేతాశ్వతరోపనిషత్తు - చతుర్థాధ్యాయం - మొదటి పద్యం ఆమె గూర్చి ఈ క్రింది విధంగా వర్ణించబడింది.

య ఏకోవర్ణో బహుధా శక్తియోగాద్
వర్ణననేకాన్నిహితార్థో దధాతి
విచైతి చాంతే విశ్వమాదౌ చ దేవ
స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు

తాత్పర్యం
రంగు లేనిది బహువిధ శక్తి గలది, సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగులని సృష్టించేది, అన్నీ ఉద్భవించేది తన నుండే, అన్నీ కలసిపోయేది తన లోనే, తనే మనకి శుభాన్ని, అవగాహనని కలిగిస్తుంది.

ప్రాముఖ్యత మార్చు

 
నిర్గుణ శక్తి యొక్క సగుణ స్వరూపం పార్వతీ దేవి

పార్వతీ దేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించింది. వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించింది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపము అని రహస్యము తెలిపినది. జయం, విజయం తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది. బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమేనని, విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని, శివుడు తన అతిశయ రూపాంతరమని తెలిపినది. ఎవరూ కని, విని, ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది. సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, మృత్యువు, అనురాగం, భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపినది.[6]

పుట్టుక మార్చు

సప్తమాతృకలు అయిన బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండిలు బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, స్కందుడు, వరాహుడు, నరసింహు ల సహధర్మచారిణులు, శక్తిస్వరూపాలు. అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్తమాతృకలు సహాయసహకారాలనందించారు.

దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు, కేరళ లలో ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మగా, పెద్దమ్మ తల్లిగా పూజలందుకొంటోంది. ఆది పరాశక్తి యొక్క వివిధ అవతారాలకి దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాలలో పలు ఆలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని, ఊరి బాగోగులని చూసుకొంటుందని, దుష్ట శిక్షణ చేస్తుందని, రోగాలని నయం చేస్తుందని నమ్ముతారు. సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. గంగమ్మ తల్లి, కామాక్షమ్మ, కనకదుర్గ, లక్ష్మీ దేవి, మీనాక్షి, మారియమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పేరంటాళ్ళమ్మ వంటివన్నీ ఆది పరాశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు.

పురాణాలు మార్చు

శక్తి ఆరాధన మినహాయించి "ఆది శక్తి" ఎక్కడా ఆ పేరుతో సంబోధించబడలేదు. కానీ, పరోక్షంగా అన్ని పురాణాలు శక్తినే మహోన్నతంగా ఆరాధిస్తాయి.

వైష్ణవ పురాణాలలో ఆది శక్తి మార్చు

వైష్ణవులు ప్రత్యేకంగా శక్తిని ఆరాధించకపోయిననూ మాయని, యోగమాయని నమ్ముతారు. రాధని మూల ప్రకృతిగా ఆరాధిస్తారు.[7] మహాలక్ష్మి రాధ యొక్క వైశాల్య రూపమని భావించటం వలన విష్ణుపురాణం, భాగవత పురాణం లలో కూడా ఎక్కడా ఆది శక్తి ప్రస్తావనలు లేవు.

బ్రహ్మ పురాణం మార్చు

బ్రహ్మ పురాణం మాత్రం వీటికి విరుద్ధంగా ఆది పరాశక్తి అనే బీజము తనని తాను పురుషుడు, ప్రకృతిగా విభజించుకొన్నదని తెలుపుతుంది. ఆది బీజం కృష్ణుడుకి, కాళికి జన్మనిచ్చింది. తర్వాత కాళి లలితా త్రిపుర సుందరిగా అవతరించి, రెండు బుడగలని సృష్టించింది. మొదటి బుడగ నుండి విష్ణువు అవతరించి బ్రహ్మకి, గౌరికీ జన్మనివ్వగా, గౌరి సతిగా, పార్వతిగా రూపాంతరం చెందినది. రెండవ బుడగ నుండి శివుడు, రాధ అవతరించారు. రాధ తర్వాత లక్ష్మిగా, సరస్వతిగా, గంగగా అవతరించింది.[8]

శైవ పురాణాలలో ఆది శక్తి మార్చు

 
శివ-పార్వతుల సంగమ సూచిక, యోనిలో ప్రతిష్ఠించబడిన లింగం

శివ పురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆది పరాశక్తి పరమ ప్రకృతిగా అవతరించినట్లు ఉంది. లింగ పురాణంలో ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమైన పార్వతి యోనిగా, శివుడు లింగంగా అవతరించి వీరి సంగమమే జీవోద్భావన గావించినట్లు తెలుపుతుంది. స్కంద పురాణం, మార్కండేయ పురాణం దుర్గ లేదా చండి సకల జగత్తుకీ ఆది దేవత అనీ, ఈ రూపాంతరమే ఆది శక్తి యొక్క భౌతిక రూపమనీ తెలుపుతున్నవి.[9]

సృష్టి లో పాత్ర మార్చు

 
ఆది పరాశక్తి యొక్క రూపాంతరలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులతో బ్రహ్మ, విష్ణ్జు, మహేశ్వరులు

శ్రీమద్ దేవీ భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు, సూచనలు ఇవ్వబడ్డాయి.

  • శక్తి, తన గురించి - "నేను ఆది పరాశక్తిని. భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా స్వంతం. అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచలన శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురు కాగా, దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం. సర్వానికి అతీతం. అన్ని దైవ శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన, అపరిమిత శక్తిని."
  • బ్రహ్మతో - "ఓ బ్రహ్మా! ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరము శారదా దేవి (సరస్వతి) నీ భార్య. నీ భార్య తో కలసి ఈ విశ్వాన్ని సృష్టింపుము."
  • విష్ణువుతో - "ఓ నారాయణా! నీవు ఎదురులేని, మరణం లేని ఆత్మవి. నీకు రూపం లేకున్ననూ రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే. ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి నీవు వివిధ రూపాంతరాలని చెందుతావు. నీవు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ ఇతర దేవదేవతలని సృష్టిస్తాడు. నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన, నా మరొక రూపాంతరము శ్రీ నీ భార్య. జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించే, పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు."
  • శివునితో - "ఓ రుద్రా! మూర్తీభవించిన నీ రూపం, కాలగతికి చిహ్నం. నీవు రూపంలో లేనపుడు కాలం స్థంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనము కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడవు అవుతావు. మహాశక్తిని అయిన నేనే నీ భార్యను. లక్ష్మీ సరస్వతులు కేవలం నాలోని భాగాలు. నా రూపాంతరాలు. నా పరిపూర్ణ రూపం మహా శక్తి. నీ ధ్యాన శక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలని నీవు మించిపోతావు. అప్పుడే నేను నీ ఎడమ భాగం నుండి నేను అవతరిస్తాను.[10]"

శాక్త పురాణాలలో ఆది శక్తి మార్చు

దేవీ భాగవత పురాణం ప్రకారం బీజ మంత్రమైన "క్లీం"ని జపిస్తూ శివుడు ఆదిశక్తి పై దృష్టి కేంద్రీకరించి వేల యేళ్ళ కొలదీ ధ్యానం చేసాడు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆది శక్తి ప్రత్యక్షమైనది. అందానికి, శక్తికీ దేవత అయిన పార్వతి ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమని (మానవ రూపం) తెలుపబడింది. సత్వ, రజో, తమో గుణములు కలిగిన పార్వతీ దేవి, ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము.[11]

ఆధునిక విఙ్ఞాన శాస్త్రంలో శక్తి మార్చు

ఆధునిక వైఙ్ఞానికావిష్కరణలలో శక్తి యొక్క భావము, పురాణాలలోనిదే. శక్తి దేని పైనా ఆధారపడకున్ననూ, ఈ అనంత విశ్వం సర్వం శక్తి పైనే ఆధారపడి ఉంది. ఈ విశ్వం వినాశనమైపోయిననూ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్య శక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత, పునఃసృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి (Sacred Energy, Zero Energy) లేదా మహోన్నత మేధస్సు (Supreme Intelligence) అని అంటారు. దేవీ భాగవత పురాణం, చతుర్వేదాలు కాళినిని కాలంతో బాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయి. లలితా దేవి అండపిండబ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటం చెందుట, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విఙ్ఞాన శాస్త్రంలో మహా విస్ఫోటంకి పోలికలు ఉన్నాయి. అంటే, ఆది శక్తియే శూన్య శక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని అర్థం.[12][13]

ఆది పరాశక్తి , కుండలిని శక్తి మార్చు

 
కుండలిని శక్తిని జాగృతం చేసే కుండలిని యోగ

సకల జీవాలలోనూ దైవము అచేతన రూపంలోనూ, చేతన రూపంలోనూ ఉంది. దైవం యొక్క అచేతనాంశం పరమాత్మ కాగా, చేతనాంశం ఆది పరాశక్తి. మనుష్యులలోని ఈ చేతన శక్తినే కుండలినీ శక్తి అని అంటారు. జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు ఈ కుండలినీ శక్తియే ప్రాథమిక మూలం. మన నిత్యకృత్యాలలో ఈ శక్తి నిగూఢంగా ఉంది. ధ్యానం ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేయటం వలన అదృష్టం వరించటమే కాక, భావోద్రేకాల నియంత్రణపై పట్టు కూడా సాధించవచ్చును.

ఇతర దేవతలతో సాహచర్యం మార్చు

త్రిమూర్తులతో సాహచర్యం మార్చు

దేవీ పురాణంలో ఇలా వ్రాయబడినది: మునులు, మహామునులు అందరూ కృష్ణుని వద్ద పురాణాలని తెలుసుకొన్న సుతుడిని శక్తిని గురించిన పలు సందేహాలను నివృత్తి చేయమని కోరారు.

శివ పురాణం, విష్ణు పురాణం వంటి వాటిలో త్రిమూర్తులే శాశ్వతమని, బ్రహ్మాండాన్ని మించినది లేదనీ, త్రిమూర్తులందరూ ఒక్కరేననీ, ఒక్కరే త్రిమూర్తుల రూపాలని తెలియజేయడమైనది. మరి మీరు ప్రస్తావించే ఆది పరాశక్తి ఎవరు? తాను ఎప్పుడు ఎలా జన్మించినది? మాకు అర్థమయ్యేలా తెలియచెప్పండి.

- అని విన్నవించుకొన్నారు.

సుతుడు ఇలా సమాధానం ఇచ్చాడు.

ఈ ప్రశ్నలకి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేరు. బ్రహ్మ, నారద మహర్షుల వంటి గొప్ప వారినే ఈ ప్రశ్నలు అయోమయానికి గురి చేస్తాయి. శ్రీ మహావిష్ణువే సకల శక్తులు కలిగినవాడు, సర్వాంతర్యామి అని కొందరు భావించి అతనిని పూజిస్తారు. మరి కొందరు అర్థ నారీశ్వరుడే గొప్పవాడు అని అంటారు. వేదాలలో సూర్యుడే పరమాత్మ కావటం వలన సూర్యుడిని ఆరాధించటమే ఉత్తమం అని తెలుపబడినది. కొందరు బ్రాహ్మణులు అవగాహన, హేతువు , వేద మంత్రాలను వీటికి ఆధారాలుగా చూపితే మరికొందరు పోలిక, పరిస్థితులు, సత్యశోధన, సూత్రాలు , సాక్ష్యాలని ఆధారంగా చూపారు. కానీ పరమాత్మ, సృష్టి మూలాల గురించి తెలుసుకొనటానికి ఈ ఆధారాలు ఏ మాత్రం ఉపయోగపడవని వేదాంతం తెలుపుతుంది. అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరూ శక్తిని మాత్రం స్మరిస్తున్నారు. అతి సూక్ష్మ కీటకం నుండి అతి విశాల విష్ణు స్వరూపం వరకు శక్తియే సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నది. కృష్ణుడు, శివుడు శక్తిమంతులయితే వారికంటే ముందే ఉనికి గల, వారిలో అస్థిత్వం కల సర్వ శక్తియే వారిని శక్తిమంతులుగా చేస్తుంది. కావున శివుడు, విష్ణువు ఇరువురూ సృష్టికి ఆద్యులు కారు. శక్తియే ఆదిమం. మనం చేసే ఆరాధన, మన నిత్యకృత్యాలన్నీ శక్తితోనే సాధ్యం. శక్తి లేనిదే సృష్టి, సంరక్షణ , వినాశనాలు లేవు. ఆత్మని శరీరంలోనికి ప్రవేశపెట్టాలన్నా, ఈ రెంటినీ కాపాడుకోవాలన్నా లేదా ఆత్మ శరీరాన్ని విడివడిపోవాలన్నా, శక్తి అవసరం. కుండలినీ శక్తిని వేరు చేసినచో శివుడంతటి వాడు కూడా శవంతోనే సమానం.

నవగ్రహాలతో సాహచర్యం మార్చు

 
దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గ శక్తులు నవగ్రహాలకి దిశానిర్దేశం చేస్తాయి

ఆది శక్తి నవగ్రహాలని అన్నింటినీ నియంత్రిస్తుంది. ఆది పరాశక్తి భౌతిక శక్తి, విద్యా శక్తి, మాయా శక్తిగా తనని తాను విభజించుకొని అవతారములు ఎత్తినది. దైవ క్రమాన్ని నడిపించే నవగ్రహాలు భౌతిక శక్తి నుండి, దశావతారాలలో ఒకటైన కాళి విద్యా శక్తి నుండి వెలువడినవి. మాయా శక్తి నుండి యోగమాయ, మహామాయ, మాయలు అవతరించి, జీవులని భ్రాంతుల నుండి రక్షించి పరమాత్మ వైపు నడిపించేలా చూస్తుంది.

దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటామే కాక వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది.

  • సూర్యుడు - కూష్మాండ శక్తి
  • రాహువు - మహాగౌరి
  • శని - కాళరాత్రి
  • కేతువు - సిద్ధిధాత్రి
  • బృహస్పతి - కాత్యాయిని
  • మంగళ - బ్రహ్మచారిణి
  • చంద్రుడు - శైలపుత్రి
  • బుధుడు - స్కంద మాత
  • శుక్రుడు - చంద్రఘంట

నవరాత్రులు నవగ్రహాలని పూజించినచో చెడు ప్రభావాలని దూరం చేస్తుంది.

మహా విద్యాశక్తిగా దశావతారాలతో సాహచర్యం మార్చు

 
దశావతారాలకి మూలాలైన జ్ఞాన దేవతలు విద్యాశక్తి యొక్క భాగాలు

శ్రీ దేవీ భాగవత పురాణం ప్రకారం విద్యా శక్తి మరల 10 భాగాలుగా విడిపోతుంది. వీటినే జ్ఞాన దేవలతలందురు. తంత్రాల దశావతారాలకి ఈ దేవతలే మూలాలు.[14]

  • మత్స్యావతారం - ధూమవతి
  • కూర్మావతారం - బాగ్లముఖి
  • వరాహావతారం - భైరవి
  • నరసింహావతారం - ఛిన్న మస్త
  • వామనావతారం - త్రిపురసుందరి
  • పరశురామావతారం - మాతంగి
  • రామావతారం - తార
  • కృష్ణావతారం - కాళి
  • వేంకటేశ్వరావతారం - కామాక్షి
  • కల్కి అవతారం - భువనేశ్వరి

మాయాశక్తిగా జీవకోటి (ఉపదేవతల, జీవాల , భూతాల)తో సాహచర్యం మార్చు

ఆదిశక్తి తనని తాను యోగమాయ, మహామాయ, మాయగా విభజించుకొన్నది. యొగమాయ మహామాయని, మహామాయ మాయని నియంత్రిస్తాయి.

యోగమాయ మార్చు

దేవతల ఉపయోగార్థం మాయని సృష్టించి చేయవలసినవి, చేయకూడనివి నిర్దేశించి వారిని దైవం వైపు నడిపిస్తుంది. మహావిష్ణువు మధు-కైటభులనే అసుర ద్వయాన్ని సంహరించేందుకు సహకరించి యోగమాయ లోకరక్షకురాలైనది. అంతేగాక, మహావిష్ణువుకి యోగ నిద్రని (ధ్యానాన్ని) ప్రసాదించింది. ఈ ధ్యానమే యోగులకు, మునులకు, భక్తులకు దైవములో ఐక్యము చేయటానికి నేటికీ ఉపయోగపడుతుంది.

మహామాయ మార్చు

భ్ర్రాంతిని సమూలంగా నాశనం చేసే అమ్మవారి శక్తి. మాయని సృష్టిస్తుంది, ఛేదిస్తుంది. యోగమాయచే నియంత్రించబడేది. శారీరక శక్తి, ఆరోగ్యము, సాత్విక లక్షణాలని పెంపొందించుకోవటానికి, క్రోధాన్ని, దురాశ, అహంకారాలని తగ్గించుకోవటానికి శక్తినిస్తుంది.[15]

మాయ మార్చు

సన్మార్గము నుండి ప్రక్కత్రోవ పట్టించి, భగవంతుని వద్దకు కాకుండా భ్రాంతి వైపు నడిపింప జేసేది. మహామాయ చే నియంత్రించబడేది. క్రోధాన్ని, దురాశని, అహంకారాలని పెంపొందించేది. మాయ యొక్క ప్రభావం కలియుగంలో అత్యధికంగా ఉండునట్లు తెలుపబడింది.[16]

సిక్కు మతంలో శక్తి మార్చు

సిక్కు మతంలో కూడా ఆది శక్తి భావన ఉన్ననూ, తత్త్వములో తేడా ఉంది. అఖండ శక్తిని ఖండ అనే చిహ్నముతో సూచిస్తారు. ఆది శక్తికి స్త్రీ లక్షణాలని ఆపాదించుకొన్ననూ, స్త్రీ స్వరూపంగా మాత్రం పరిగణించరు. సురాసురుల పోరులో చండి ఖడ్గముగా అవతరించి దుష్టశక్తులని సంహరించి, దేవతలను రక్షించిన ఘట్టం సిక్కుల పవిత్రగ్రంథం చండీ ది వార్ లో వివరించబడింది.[17][18]

ఆది పరాశక్తి రూపాంతరాలు మార్చు

  1. దుర్గ, పార్వతి, సతి, మహాలక్ష్మి, సరస్వతి
  2. అంబికా దేవి, దుర్గా సప్తశతి
  3. కాత్యాయని
  4. మహాకాళి
  5. కౌషికి
  6. సప్తమాతృకలు

ఆది పరాశక్తి హారతి మార్చు

హిందీ భాషలో ఆది పరాశక్తి యొక్క హారతి ఈ క్రింది విధంగా యుండును.

जय आदि शक्ति, मईया जय आदि शक्ति, अखंड ब्रह्माण्ड बनाया, शक्ति रूप धरी ॐ जय आदि शक्ति ॥
प्रथम रूप भुवनेश्वरी, शिव विष्णु प्रगटायो, रचना पालन संघार, तुम कारज दीनो, ॐ जय आदि शक्ति ॥
द्वित्य रूप माँ ललिता, शिव की शक्ति बानी , त्रिपुर सुंदरी नामो, जग में हुआ विख्याति, ॐ जय आदि शक्ति ॥
तृत्य रूप माँ शारदा, शक्ति ब्राह्मणी भजे, मात्तांगी रूप तू धारी, ज्ञान कला दीनो, ॐ जय आदि शक्ति ॥
चत्तुर रूप माँ कमला, धन वैभव प्रदायनी, विष्णु की वैष्णवी शक्ति, लक्ष्मी नारायणी, ॐ जय आदि शक्ति ॥
पंचम रूप माँ भैरवी, माँ भूतादिक संगे, सर्व भयभंजनी, माँ जगत कारिणी, ॐ जय आदि शक्ति ॥
षष्ठी तू बगलामुखी, माँ सकंटहरणी, पीताम्बर पीतासन, पीत भोजन करनी, ॐ जय आदि शक्ति ॥
सप्तम रूप माँ तारा, बाघम्बर धारिणी, योग सीधी प्रदायनी, अतुल तेज धारी, ॐ जय आदि शक्ति ॥
अषटम रूप छिनमस्तिका, चिंता मुक्त कीजो, काम क्रोध की भंजनी, माँ चिन्तपुरनी, ॐ जय आदि शक्ति ॥
नवमी माँ धूमावती, मोह माया मर्दिनी, कलयुग की तुम दमनी, माँ स्वछंदरी, ॐ जय आदि शक्ति ॥
दशम रूप माँ काली, परम ब्रह्म परमेश्वरी ॥ मुक्ति शांति प्रदायनी, माँ जगदीश्वरी ॐ जय आदि शक्ति ॥
उत्तर की कौमारी, दखन की दखयानी, पूरब की महाकाली, पश्चिम की भवानी, ॐ जय आदि शक्ति ॥
आदि शक्ति की आरती जो प्राणी गाये, कहत शिवानंद स्वनि, मुक्ति शक्ति पावे, ॐ जय आदि शक्ति ॥

[19]

ప్రతిమా నిర్మాణ శాస్త్రం మార్చు

కాళికా పురాణం, లలితా సహస్రనామం, దేవీ భాగవత పురాణాలలో ఆది పరాశక్తి గూర్చి వివరించబడింది. దేవీ భాగవతం ప్రకారం ఆది పరాశక్తి త్రిమూర్తులను ఆమె దివ్య నివాసానికి ఒకసారి అహ్వానించినట్లు వ్రాయబడింది. త్రిమూర్తులు ఆమెను ఏడు సింహాలతో కూడిన రత్నాల సింహాసనం కలిగిన రథంపై కూర్చోవడాన్ని చూసారు. ఆమె వదనం మిలియన్ల నక్షత్రాల యొక్క కాంతితో ప్రకాశితమైనట్లుంది. ఆమె దివ్య స్వరూపాన్ని త్రిమూర్తులు తమ నేత్రాలతో చూడలేకపోయారు. అపుడు వారు విశ్వంలో ఆమె సృష్టి, స్థితి, లయ కారకురాలు అని గ్రహించారు.[20]

పౌరాణిక కథలు మార్చు

దేవీ భాగవత పురాణం ప్రకారం ఆదిశక్తి పార్వతి, లక్ష్మీ, సరస్వతి ల రూపాలతో కూడిన త్రిదేవీ రూపంగా వర్ణించబడింది. అనగా త్రిమూర్తుల యొక్క సగభాగంలో గల దేవతల రూపంగా వర్ణింపబడింది. ఆమె విశ్వవ్యాపితంగా శక్తి ప్రదాత. ఈ మూడు రూపాలలో నుండి ఆమె యొక్క మూల రూపము పార్వతీ దేవిగా వర్ణింపబడింది.

ఇవి కూడా చూడండి మార్చు

గమనికలు మార్చు

  1. Chandi Charitra | Salrbloh Granth - Sikhism
  2. Devi Bhagavati - ‘Nirguna’ and ‘Virupa’ Shakti | http://www.kamakoti.org/kamakoti/details/devibhagvatpurana5.html
  3. Srimad Devi Bhagwatam, Devi Gita, Brahmand Purana, Sunder Lehri
  4. "Primary Deity - Parashakthi Karumari Amman - Divine Eternal Mother (Heart of Divine Love)". parashakthitemple. Parashakti Temple. Archived from the original on 27 అక్టోబరు 2014. Retrieved 6 December 2014.
  5. Vishwa, Amara. "Creation part 8 – Shiva Loka (Kailasa)". vishwaamara.com. VishwaAmara. Retrieved 15 December 2014.
  6. "The Devi Gita index". Sacred-texts.com. Retrieved 2012-08-05.
  7. Vishnu Purana | merki.lv/vedas/Vishnu%20Purana%2000%20(eng).pdf
  8. Brahmanda Purana translated into English in PDF | hindudharmaforums.com › Sanatana Dharma › Scriptures › Puranas
  9. Shiva Mahapurana | Gitapress Gorakhpur
  10. DailyNews (February 26, 2014). "Hindu Purana | Creation of Universe | Daily News Watch - An Effort to Unite India". Usenet: info@dailynewswatch.in. Archived from the original on 2014-05-05. Retrieved May 24, 2014.
  11. Sri Bhagwati Gita | Devi Gita | Sri Parvati Gita - Scribd | http://www.scribd.com/doc/147548723/Sri-Bhagwati-Gita-Devi-Gita-Sri-Parvati-Gita
  12. Calculation of the Energy in the Universe| http://www.curtismenning.com/ZeroEnergyCalc.htm Archived 2014-11-12 at the Wayback Machine retrieved 2-05-2014
  13. Prof. Shrikant Prasoon. The Creator Of Universe Ma Shakti. ISBN 978-8-122-31100-6. Archived from the original on 2014-06-06. Retrieved 2015-01-17.
  14. dus-mahavidyas.pdf, Dollofindia.com, http://www.dollsofindia.com/acrobat/dus-mahavidyas.pdf
  15. The Heart of Hinduism: The Eastern Path to Freedom, Empowerment and Illumination. Stephen Knapp.
  16. Srimad Bhagwata Purana
  17. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-18. Retrieved 2015-01-17.
  18. kundalinihoy.com/wp-content/.../12/Adi-Shakti.pdf
  19. "Adi Shakti Aarti and Maa Parvati Amritwani Soon Will be Released by Adi Shakti Nrityashala and Kashyap Production House". Daily News Watch India. 11 Dec 2014. Archived from the original on 15 డిసెంబరు 2014. Retrieved 15 December 2014.
  20. Sanchita, Chowdhury. "Who Is Adi Shakti?". www.boldsky.com. Sanchita Chowdhury. Retrieved 10 December 2014.

మూలాలు మార్చు