అనిషా అంబ్రోస్ భారతీయ సినిమా నటి, మోడల్. ఆమె తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలలో కథానాయకిగా నటిస్తుంది. ఈమె ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం నకు చెందినవారు. 2013లో నీలిమ తిరుమలశెట్టి దర్శకత్వంలోని తెలుగు చిత్రం అలియాస్ జానకిలో నటించడం ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టింది.[1]

అనిషా అంబ్రోస్
జననం
అనిషా అంబ్రోస్

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయులు
విద్యాసంస్థగీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

ప్రారంభ జీవితం మార్చు

ఆమె తల్లిదండ్రులు విశాఖపట్నం నకు చెందినవారు. ఆమె ఒడిషాలో పెరిగింది. ఆమె కుటుంబం ఒడిషా, ఆంధ్రప్రదేశ్ లలో అనేక పాఠశాలను నడిపారు. ఆమె కళాశాల విద్యను విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో పూర్తిచేసింది. తరువాత ఎం.బి.ఎను గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో పూర్తిచేసింది.[2]

ఆమె ఫేస్‌బుక్ లోని "ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ" పేజీలో మోడలింగ్ చేసింది. ఆమె చిత్రాలను నిర్మాత అయిన నీలిమ తిరుమలశెట్టి చూసి ఆమెకు సినిమాలలో నటించే అవకాశం కల్పించింది.[3][4]

'అలియాస్ జానకీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఆ తరువాత ఆమె పవన్ దృష్టిలో పడటం 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు హీరోయిన్ గా ఎంపిక కాబడింది. కానీ తరువాత ఈమెను తొలగించారు.[5]

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష వివరాలు
2013 అలియాస్ జానకి చరిత్ర తెలుగు
2013 పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు శ్వేత తెలుగు లఘు చిత్రం
2015 గోపాల గోపాల కామియో తెలుగు
2015 ఎ 2న్డ్ హ్యాండ్ లవర్ అంజలి కన్నడ
2016 రన్ అమూల్య తెలుగు
2016 కర్వ అమృత కన్నడ
2016 మనమంతా ఐరా తెలుగు
2016 విశ్మయం మలయాళం
2017 ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లెడీస్ టైలర్ మహాలక్ష్మి తెలుగు
2017 ఉన్నది ఒకటే జిందగి శ్రీయా తెలుగు
2017 ఒక్కడు మిగిలాడు స్వర్ణ తెలుగు
2017 ఇదం పొరుళ్ ఆవి తమిళం
2018 ఈ నగరానికి ఏమైంది తెలుగు
2018 వంజర్ ఉలగం తమిళం పొస్ట్ ప్రొడక్షన్స్
2018 విటలాచార్యా తెలుగు చిత్రీకరణ జరుగుతుంది

మూలాలు మార్చు

  1. King, Vincent (8 July 2013). "From FB to films". Deccan Chronicle. Retrieved 10 September 2014.
  2. Rajamani, Radhika (24 July 2013). "Anisha Ambrose: I never thought of being an actor". rediff.com. Retrieved 10 September 2014.
  3. "Pride - a quality aspiring actors shouldn`t possess: Anisha Ambrose". zeenews.india.com. 8 July 2013. Archived from the original on 29 నవంబరు 2014. Retrieved 10 September 2014.
  4. "Pride - a quality aspiring actors shouldn't possess: Anisha Ambrose". Yahoo! News. 8 July 2013. Archived from the original on 31 డిసెంబరు 2013. Retrieved 28 December 2013.
  5. పవన్ కు షాక్ ఇచ్చిన అనిషా ఆంబ్రోస్ వ్యాఖ్యలు !