ఆభేరి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో వినిపించే ఒక రాగం. ఇది ఒక జన్య రాగం అనగా, కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో ఒకటి/కొన్ని రాగాల ఆధారంగా పుట్టిన(జననం పొందిన) రాగం. రాగనిధి ప్రకారం ఈ రాగం 20వ మేళకర్త రాగమైన నాటభైరవికి జన్యరాగం. ఈ రాగం హిందుస్తానీ పద్ధతిలోని రాగ్ అభీర్ కు దగ్గరగా ఉంటుండి.[1]

ఆభేరి
ఆరోహణస గ2 మ1 ప ని2 స'
అవరోహణస' ని2 ద2 ప మ1 గ2 రి2 స

రాగ స్వరూపం మార్చు

ఈ రాగం ఆరోహణలో రిషభం, నిషాదం ఉండవు. ఇవి వర్జ్య స్వరాలు. అవరోహణలో మొత్తం 7 స్వరాలు ఉంటాయి. అందుకని ఈ రాగం ఔధవసంపూర్ణ జతి కలిగి ఉంటుంది.

ఆభేరి రాగం

ఈ రాగంలోని ప్రముఖ కృతులు మార్చు

ఆభేరి రాగంలో అందరికీ సుపరిచితమైన కృతి త్యాగరాజు రచించిన "నగుమోము గనలేని". మైసూరు వాసుదేవాచార్య రచించిన భజరే రే మనసా, గోకుల నిలయ కృపాలయ కృతులు ఈ రాగంలో కూర్చినవే. ముద్దుస్వామి దీక్షితులు వినభేరి అనే కృతిని ఆభేరి లో రచించినా, అప్పటి ఆభేరికి నేటి ఆభేరికీ వ్యత్యాసం ఉంది. మల్లీశ్వరి సినిమాలోని "ఆకాశ వీధిలో" పాట ఈ రాగంలో వచ్చినదే. ఈమాట వెబ్ పత్రికలో కింద తెలిపిన సినిమా పాటల్లో ఆభేరి రాగం వినిపిస్తుందని తెలిపారు:[2]

  1. ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
  2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)
  3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)
  4. వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)
  5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు)
  6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి)
  7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు)
  8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి)
  9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్‌)
  10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క)
  11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు)
  12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు)
  13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే)
  14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ)
  15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు)
  16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ)
  17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ)
  18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
  19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు)
  20. ఉయ్యాల జంపాల లూగరావయా… (చక్రపాణి)
  21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం)
  22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు)
  23. కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్‌)
  24. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ప్రైవేటు రికార్డ్‌)
  25. హాయమ్మ హాయి మా పాపాయి… (ప్రైవేటు రికార్డ్‌ )
  26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్‌)
  27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్‌)
  28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్‌ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం)
  29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు)
  30. తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)

వనరులు మార్చు

  1. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
  2. రాగలహరి: ఆభేరి
"https://te.wikipedia.org/w/index.php?title=ఆభేరి&oldid=3846229" నుండి వెలికితీశారు